డాక్టర్ గొంది కృష్ణకుమారి ఇకలేరు

నరసరావుపేట పట్టణంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన స్త్రీల ప్రసూతి వైద్యులు రాజ్యలక్ష్మి నర్సింగ్ హోమ్ అధినేత శ్రీమతి గొంది కృష్ణకుమారి మంగళవారం తుది శ్వాస విడిచారు.1980,1990 దశకాల్లో స్త్రీల వైద్య నిపుణులుగా నరసరావుపేట, పల్నాడు , ప్రకాశం జిల్లాల్లో ప్రాచుర్యం పొందారు. డాక్టర్ గొంది కృష్ణకుమారి మృతిపై నర్సరావుపేటకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. నేస్తం ట్రస్టు కార్యవర్గం డాక్టర్ కృష్ణకుమారి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆమె తనయుడు, నేస్తం ట్రస్టు సభ్యుడు డాక్టర్ గొంది శ్రీనివాసరావుకు సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైద్యురాలిగా డాక్టర్ కృష్ణకుమారి సేవలను గుర్తు చేశారు.

Leave a Reply