Suryaa.co.in

Andhra Pradesh

జగన్ డ్రామాను ఈసీ తేల్చాల్సిందే

-మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

చంద్రబాబు ర్యాలీమీద గాంధీ సెంటర్ లో రాయి పడ్డప్పుడు, ఎర్రగొండపాలెంలో రాయి పడ్డప్పుడు చంద్రబాబు పర్యటనలో ఎస్ బిసి కమాండర్ సంతోష్ కుమార్ కు కూడా ఆరోజు గాయమైంది. రక్తం కారింది. నందిగామ రాళ్ల దాడిలో సీఎస్ ఓ మధు మీద కూడా రాయి దెబ్బ తగిలి రక్తం కారింది. చిత్తూరు జిల్లా అంగళ్లులో తామందరం ఇరిగేషన్ ప్రాజెక్టులు చూడటానికి వెళ్తే ఆరోజు మా మీద వేసిన రాళ్లు కూడా చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు చూపారు.

ఈ సమయాల్లో హత్యా యత్నం కేసు నమోదు చేయలేదు గానీ జగన్ పై చిన్న రాయి పడితే హత్యా యత్నం కేసు నమోదు చేశారు. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ప్రమాదంలో ప్రజాస్వామ్యం ఇవన్నీ కూడా ఆరోజుల్లో దాడుల్లో జరిగిన సంఘటనలే. చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు వివరించి రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? ప్రజాస్వామ్యం ఉందా? చట్టబద్ద పరిపాలన ఉందా? రూల్ ఆఫ్ లా ఉందా? ఏం జరుగుతోంది? ప్రతిపక్ష నాయకుడిపై ఇటువంటి దాడులు జరుగుతుంటే బెయిల్ కేసులు పెట్టి ఈ స్టేట్ స్పాన్సర్ టెర్రరిజాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించిందంటూ ప్రజల కు తెలియజేయడం జరిగింది.

ఈరోజు జగన్ పైకి చిన్న రాయి పడితే సీఎంపై రాయి అని, వారి కుటుంబ పత్రికలో హత్యా ప్రయత్నం అని ప్రచురించుకున్నారు. పథకం ప్రకారం ఒక స్కూల్ రెండో అంతస్తులో దాక్కున్న అగంతకుడు అని సాక్షిలో ప్రచురించుకున్నారు. ఒకడే అని తేల్చేశారు. ఒకడైతే క్యాట్ బాల్ అన్నాడు, ఒకాయన సౌండ్ వచ్చింది, విన్నాను అన్నాడు. రక రకాలుగా మాట్లాడారు.

5 సంవత్సరాల క్రితం ఎన్నికలకు ఆరు నెలల ముందు విశాఖపట్నం ఎయిర్ పోర్టులో కోడికత్తి డ్రామా ఆడారు. ఈ సంఘటనలో కోడికత్తి శీనును 5 సంవత్సరాలపాటు జైల్లో మగ్గేలా చేశారు. అప్పుడు డ్రామాను రక్తికట్టంచి ఇక్కడ అంతా బాగుందని చేయి ఊపి ఈ రాష్ట్రంలో పోలీసుల మీద నమ్మకం లేదు, ఈ రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని నేను నమ్మను,. అని హైదరాబాద్ కు పోయి ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కుట్లు వేయించుకున్నాడు. ఆ కుట్లు వేసిన ఆయన రాష్ట్ర మెడికల్ కార్పొరేషన్ కి ఛైర్మన్ అయి ఆ డాక్టర్ కి వెయ్యి కోట్లు ప్రజల సొమ్ము ఖర్చు పెట్టే పెత్తనాన్ని ఈ ఐదేళ్లు జగన్ అప్పగించాడు.

కోడి కత్తి శీను ఐదేళ్లపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్ లో అనేక బాధలు పడి మొన్ననే కోర్టు ద్వారా బయటకు వచ్చాడు. ఈ డ్రామా రక్తి కట్టలేదని ఆరోజు ఐ ప్యాక్ టీమ్ బాబాయి హత్య కేసు మీద సీబీఐ విచారణలో చాలా స్పష్టంగా సానుభూతి కోసం ఎన్నికల్లో లబ్ది పొందడానికి కడప ఎంపీ సీటు పంచాయతీలో చాలా స్పష్టంగా ఎన్నికలకు కరెక్టుగా నెల రోజులకు ముందు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాత బాబాయి హత్య చేశారు.

సానుభూతి డ్రామాతో నారా సుర రక్త చరిత్ర అని మా చేతుల్లో గొడ్డలి పెట్టి మీ సాక్షి పత్రికలోనే బొమ్మలు వేసుకున్నారు. 2019 ఎన్నికలకు ముందు ఒక్క ఛాన్స్ అంటు అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాడు. అభివృద్ధి కుంటుపడేలా చేశాడు.లక్షలాది రూపాయలు ప్రజా ధనాన్ని జీతంగా తీసుకునే సజ్జల రామకృష్ణా రెడ్డి కోల్డ్ బ్లడ్డర్ మర్దర్ అని మాట్లాడుతున్నాడు.

కాగా నిన్న విజయవాడలో జగన్ పై రాయి దాడి జరిగితే ఇమ్మిడియట్ గా జరిగిన నిమిషంలోనే ఒకడు ఎయిర్ గన్ అని ఒకడు, క్యాట్ బాల్ అని నానా యాగి చేశారు. ఓటమి భయంతోనే జగన్ రెడ్డి డ్రామా రాజకీయాలు చేస్తున్నాడు. ఛీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ ని వేసి ఇమ్మిడియట్ గా సీబీఐ విచారణ జరిపితేనే వాస్తవాలు బయట పడతాయని టీడీపీ తరపున డిమాండ్ చేస్తున్నాం.

LEAVE A RESPONSE