Suryaa.co.in

అష్ట సిద్ధులు
Devotional

అష్ట సిద్ధులు

హిమాలయాలలో , దక్షిణమున నల్లమల అడువుల్లోని శ్రీశైల శిఖర ప్రాంతాన గొప్ప గొప్ప యోగులు ఉన్నారు . వారికి తెలియని విద్యలు అంటూ ఏమి లేవు .
అణిమ
అన్ని జంతువుల కంటే స్వల్ప జంతువు వలే కనపడుట . తన ఆకారం కంటే కొద్ది ఆకారం గల జీవము వలే యుండుట .
మహిమ
బ్రహ్మ , విష్ణు, శివుడు ఈ త్రిమూర్తులు కంటే పెద్దవాడిగా కనపడుట.
లఘిమ
దూది కంటే తేలిక అయ్యి ఉండుట. యే మాత్రం బరువు లేకుండా ఉండుట .
గరిమ
బరువుగల సమస్త జీవములు, సమస్త పదార్దముల కంటే బరువు అయ్యి ఉండుట.
ప్రాప్తి
కోరిన దానినేల్లా కలగ చేసుకొనుట . తనకే ఆకారం కావలెను అన్న ఆ ఆకారంని పొందుట. కొరిన చోటకేల్లా క్షణ మాత్రములో పోవుట , కొరిన వస్తువుని గాని జీవముని గాని తన యోద్దకి తెప్పించు కొనుట .
ప్రాకమ్యము
ఆకాశ గమనము కలిగి యుండుట, తన శరీరం వదిలి త్రిలోక సుందరమగు యవ్వన శరీరము తాను కోరినంత కాలము పొంది యుండుట.
వశిత్వము
సమస్త జంతువులను , దుష్ట మృగములను పెద్ద పులి,చిరుత పులి , సింహము, మదగజము మొదలగు అడివి జంతువులను మొసలి, తాంబేలు, చేప మొదలగు నీటి జంతువులను, సర్పములు మొదలగు వాటిని మచ్చిక చేసుకొనుట .
ఈశిత్వము
కామ, క్రోధ, లోభ, మోహ , మధ, మాత్సర్యము అనెడు అరిషడ్వర్గములను జయించి ఆధ్యాత్మిక , బౌతికాది , ధైవికములు అనెడి తాపత్రయములు లేనివాడై జితేన్ద్రియుడై , భూత, భవిష్యత్ , వర్తమాన విషయాలను సర్వమును గ్రహించి ఈశ్వరుని వలే సృష్టి, స్థితి, లయములు లకు కారణ భూతుడు అగుట .

– కాళహస్తి వేంకటేశ్వరరావు,
అనువంశిక ఆయుర్వేదం,
9885030034

LEAVE A RESPONSE