“ప్రమాదం”లో ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి!

ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర మరియు ఇద్దరు ఎన్నికల కమిషనర్లు రాజీవ్ కుమార్, అనుప్ చంద్ర పాండే 2021 నవంబర్ 16న ప్రధానమంత్రి కార్యాలయం(పి.యం.ఓ.)తో జరిగిన “ఆన్‌లైన్ ఇంటరాక్షన్‌”కు హాజరు కావడం ద్వారా రాజ్యాంగబద్ధంగా నిర్దేశించబడిన “ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి”ని ప్రమాదంలో పడేశారాన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఎన్నికల కమిషన్ యొక్క స్వతంత్ర ప్రతిపత్తిని పరిరక్షించడం ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఇద్దరు ఎన్నికల కమిషనర్ల విధి. విధి నిర్వహణలో పాలకులతో రాజీపడితే భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడే ప్రమాదంలో పడుతుంది.

ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తికి భంగం కలిగించకూడదనే కట్టుబాటు, నిజాయితీ కొరవడిన వ్యక్తులు ప్రధానమంత్రి పదవిని అధిరోహిస్తే, తన అధికారాన్ని దుర్వినియోగం చేసి, అర్హతలేని వ్యక్తిని సిఇసిగా నియమించడం ద్వారా ఎన్నికల ప్రక్రియను నాశనం చేస్తారని 1949లో రాజ్యాంగ సభలో జరిగిన చర్చల్లోనే డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ మరియు ఇతర సభ్యులు తీవ్రభయాందోళనలు వ్యక్తం చేశారని ప్రముఖులు గుర్తుచేస్తున్నారు.

టి.లక్ష్మీనారాయణ
సామాజిక ఉద్యమకారుడు

Leave a Reply