– చట్ట పరంగా ,షెడ్యూల్ 9 ప్రకారం ఎన్నికలకు పోవాలి
– ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే తీవ్ర పరిమాణాలు
– రిజర్వేషన్ పోరాటంలో రాజీ లేదు
– 18న జరిగే ఆందోళనకు బీఆర్ఎస్ మద్దతు
– మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్
– తెలంగాణభవన్‌లో బీసీ నేతల భేటీ
– మాజీ మంత్రులు గంగుల,తలసాని, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ వద్దిరాజు తదితర బీసీ నాయకులతో కలిసి సమావేశం
హైదరాబాద్: మాజీ మంత్రి,సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో గురువారం మధ్యాహ్నం బీసీ ముఖ్య నాయకులు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా తలసాని ఏమన్నారంటే..తెలంగాణ భవన్ నుంచే వెళ్లి బీసీ బంద్ లో పాల్గొంటాం.కాంగ్రెస్ డ్రామా చేయడానికి చూసింది. మేము అసెంబ్లీ లోనే చెప్పినం. ప్రభుత్వం పై వ్యతిరేకత ఉంది. కుల గణన సరిగా జరగలేదు. కులగణన సర్వే పత్రం పై ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఫోటో పెట్టడం తప్పు.
గవర్నర్ కి తీర్మానం వెళ్ళక ముందే ఢిల్లీ లో ధర్నా చేశారు.మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడాధర్నా కు రాలే. ఢిల్లీ కి వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చారు. కేబినెట్ లో పార్టీ ల పరంగా ఎన్నికల కి వెళ్తాము అంటే మేము ఒప్పుకోము.42 శాతం రిజర్వేషన్ ఇచ్చాకనే ఎన్నిక కి పోవాలి. చట్ట పరంగా ,షెడ్యూల్ 9 ప్రకారం ఎన్నికలకు పోవాలి. ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే తీవ్ర పరిమాణాలు ఉంటాయి.అందరూ బంద్ కి సహకరించాలి. బంద్ లో ప్రతి బీసీ పాల్గొనాలి..
మాజీ మంత్రి వి .శ్రీనివాస్ గౌడ్ ఏమన్నారంటే…కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు వారి వెంట పడుతూనే ఉంటాం. 17 నెలల నుంచి కాంగ్రెస్ నిద్ర పోయింది. ఢిల్లీ లో జరిగిన ధర్నా కి రాహుల్ గాంధీ ఎందుకు రాలేదో కాంగ్రెస్ వాళ్లు చెప్పాలి. చట్టమే లేనిది ఏ జడ్జి తీర్పు ఇస్తారు? అందరూ ఈ నెల 18 న బంద్ కు సహకరించాలి.
సమావేశానికి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్,పుట్టా మధుకర్, కోరుకంటి చందర్, కరీంనగర్ జడ్పీ మాజీ ఛైర్మన్ తుల ఉమ,నాయకులు శుభప్రద్ పటేల్,ఉపేంద్రాచారి, గడ్డం శ్రీనివాస్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.
స్థానిక సంస్థలు, విద్యా, ఉద్యోగ రంగాలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే విషయమై సమావేశంలో చర్చించారు. ఈనెల 18వతేదీన జరుప తలపెట్టిన రాష్ట్ర బంద్ లో పాల్గొని విజయవంతం చేయాలని సమావేశం నిర్ణయించింది.