– విద్యుత్ ఉద్యోగులు హెచ్చరిక
విజయవాడ: విద్యుత్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వ ఇంధనశాఖ కార్యదర్శికి విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ నోటీసులు ఇచ్చింది. కృష్ణపట్నం థర్మల్ పవర్ స్టేషన్ ప్రైవేటీకరణకు నిరసనగా ఆందోళన చేసింది.
సమస్యల పరిష్కారం కోసం మంత్రి సమక్షంలో జరిగిన ఒప్పందాన్ని ఉల్లంఘించడంపై జేఏసీ సీరియస్ అయింది. యాజమాన్యం కక్ష సాధింపు చర్యలకు దిగడంపై ఆందోళన వ్యక్తం చేసింది.నోటీసులు తీసుకున్న తర్వాత కక్ష సాధింపు చర్యలు చేపడితే మెరుపు సమ్మెకు దిగుతామంటూ హెచ్చరించింది.
ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 5 వరకు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతామని ప్రకటించింది. ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు సీఎంకు సోషల్‌మీడియా, పోస్ట్‌కార్డుల ద్వారా వినతులు అందిస్తామని పేర్కొంది.
ఫిబ్రవరి 7 నుంచి 16 వరకు లంచ్ అవర్‌లో ఆందోళనలు చేస్తామని తెలిపింది. ఫిబ్రవరి 21 నుంచి 28 వరకు రిలే నిరాహార దీక్షలు చేస్తామని పేర్కొంది. మార్చి 2న సిమ్‌కార్డులు హ్యాండోవర్ చేయాలని నిర్ణయించింది. ఆందోళన నోటీసులు జేఏసీ చైర్మన్ చంద్రశేఖర్, సెక్రెటరీ జనరల్ ప్రతాప్‌రెడ్డి, కన్వీనర్ బి.సాయికృష్ణ ఇచ్చారు.