Home » ముగిసిన జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్లబండ లాగుడు ప్రదర్శన

ముగిసిన జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్లబండ లాగుడు ప్రదర్శన

– ప్రత్యక్షంగా వీక్షించిన లక్ష మంది రైతులు, ఔత్సాహికులు
– పోటీలను జయప్రదం చేసిన వారందరికీ కృతజ్ఞతలు
– తెలిపిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

గుడివాడ, జనవరి 17: కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం లింగవరం రోడ్డులోని కే. కన్వెన్షన్లో ఎన్టీఆర్ టూ వైఎస్సార్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు జరిగిన జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్లబండ లాగుడు ప్రదర్శన పోటీలు ఘనంగా ముగిసాయి. రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), ఆయన సోదరుడు కొడాలి నాగేశ్వరరావు (చిన్ని) లు నిర్వహించిన ఈ పోటీలను రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన రైతులు, పశు పోషకులు, ఔత్సాహికులు దాదాపు లక్ష మంది ప్రత్యక్షంగా వీక్షించారు. రెండు పళ్ళు, నాలుగు పళ్ళు, ఆరు పళ్ళు, సేద్యపు విభాగం, సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో దాదాపు వందకు పైగా ఎడ్ల జతలు హెూరా హెూరీగా పోటీపడ్డాయి. రాష్ట్ర నలుమూలల నుండి పశు పోషకులు తమ ఎడ్ల జతలను పోటీలకు తీసుకువచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎడ్ల జతలు, వాటి యజమానులకు అవసరమైన అన్ని వసతి, భోజన సదుపాయాలను కే. కన్వెన్షన్ కల్పించడం జరిగింది. వరుసగా ఐదవ ఏడాది నిర్వహించిన ఈ జాతీయస్థాయి పోటీలను మరింతగా వీక్షించేందుకు కే.కన్వెన్షన్ గ్రౌండ్లో ఒక వైపున భారీ గ్యాలరీలను నిర్మించారు. అలాగే ట్రస్ట్ ఆధ్వర్యంలో యుట్యూబ్ లైవ్ కూడా సోషల్ మీడియా గ్రూపుల ద్వారా అందుబాటులోకి తెచ్చారు. చివరి రోజు జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో జరుగుతున్న పోటీలను చూసేందుకు వచ్చిన రైతులు, పశు పోషకులు, ఔత్సాహికులతో కే. కన్వెన్షన్ గ్రౌండ్ కిక్కిరిసిపోయింది.

అనుకున్న దానికన్నా పోటీలకు భారీగా జనం తరలిరావడంతో మంత్రి కొడాలి నాని, కొడాలి చిన్నిలు హర్షం వ్యక్తం చేశారు. ప్రదర్శన పోటీల విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, మున్సిపల్ మాజీ వైఙాచైర్మన్ అడపా బాబ్జి, వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి, గుడివాడ ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి సంఘం చైర్మన్ ఎంవీ నారాయణరెడ్డి, ఎంపీపీలు పెయ్యల ఆదాం, గద్దె పుష్పరాణి, జడ్పీటీసీ సభ్యుడు గోళ్ళ రామకృష్ణ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్విక్టర్, నాయకులు ఉప్పాల రాంప్రసాద్, వల్లూరుపల్లి సుధాకర్, కసుకుర్తి బాబ్జి, కొల్లి విజయ్, పాలడుగు రాంప్రసాద్, గాదిరెడ్డి రామలింగారెడ్డి, మేకల సత్యనారాయణ, కొంకితల ఆంజనేయప్రసాద్, గిరిబాబాయ్, మూడెడ్ల ఉమా, దారం ఏడుకొండలు, చింతల భాస్కరరావు, వెంపటి సైమన్, దారం నరసింహా, కొలుసు నరేంద్ర, రేమల్లి పసి, ఆర్వీఎల్ నరసింహారావు, షేక్ సయ్యద్, యార్లగడ్డ సత్యభూషణ్, చుండి బాబి, పెద్ధి కిషోర్, పొట్లూరి మురళీధర్, తోట రాజేష్, లోయ రాజేష్, ఎస్కే బాజీ, అలీబేగ్, చింతాడ నాగూర్, చిన్ని దుర్గాప్రసాద్, మాదాసు వెంకటలక్ష్మి, గంటా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply