వాకింగ్ కి నడుచుకుంటూ వెళ్లినప్పుడు, అలసిపోయి కూర్చున్నప్పుడు, నా పక్కన ఉన్న వ్యక్తి, ఈరోజు ఏదైనా మంచి విషయాలు చెప్పండి అన్నాడు ఒకతను.
కాసేపు ఆలోచించి …
స్వర్గానికి ప్రవేశం ఉచితం, నరకానికి వెళ్లాలంటే బోలెడు ఖర్చు, అన్నాను.
ఆశ్చర్యంగా అతను నా వంకచూసి అదెలా? అన్నాడు,
నేను చిన్నగా నవ్వి, ఇలా అన్నాను…
జూదం ఆడటానికి డబ్బు కావాలి,
మత్తు పానీయాలు త్రాగడానికి డబ్బు కావాలి,
సిగరెట్ త్రాగడానికి డబ్బు కావాలి,
పాపాలతో పయనించడానికి డబ్బుకావాలి, ఇలా ఇంకా, ఇంకా….
కానీ,
ప్రేమను పంచడానికి డబ్బు అవసరం లేదు,
దేవుణ్ణి ప్రార్థించడానికి డబ్బు అవసరం లేదు,
సేవచేయడానికి డబ్బు అవసరం లేదు,
అప్పుడప్పుడు ఉపవాసం (ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం కోసం) ఉండడానికి డబ్బు అవసరం లేదు,
క్షమించమని అడగడానికి డబ్బు అవసరం లేదు,
మన చూపులో కరుణ, సానుభూతి, మానవత్వం చూపడానికి పెద్దగా డబ్బు ఆవసరంలేదు.
దేవుణ్ణిపై నమ్మకం ఉండాలి, మనపై మనకు ప్రేమ, విశ్వాసం ఉండాలి, ఇప్పుడు చెప్పండి…
డబ్బు ఖర్చు చేసి నరకాన్ని వెళ్ళడానికి ఇష్టపడతారా ? ఉచితంగా లభించే స్వర్గం ఇష్టపడతారా? ఆలోచించండి!
సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చలతత్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తి:
సత్పురుషుల మార్గదర్శనం,
సత్సంగత్యం, సహవాసం,
సత్ప్రవర్తనతో జీవించడం
మించి, ఈ భౌతిక ప్రపంచంలో ఇంకొకటి, మరొకటి లేదు కదా
– సేకరణ ఆర్కే