Suryaa.co.in

Andhra Pradesh

అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం మరో తుగ్లక్ నిర్ణయం

– అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు బాలకోటయ్య వ్యాఖ్య

మూడు రాజధానులు వంటి తుగ్లక్ పాలనా నిర్ణయాలతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన వైకాపా ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి అంగన్వాడీ ఆందోళన పై ఎస్మా చట్టం ప్రయోగించిందని, వేతనాలు పెంపు ఆందోళన పై ఎస్మా చట్టం ప్రయోగించిన తొలి ప్రభుత్వంగా చరిత్ర కెక్కిందని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో అంగన్వాడీలకు హామీలు ఇవ్వనేల? ఎస్మా ప్రయోగించనేల? అంటూ ప్రశ్నించారు.

వైసీపీ 55 నెలల పాలనలో అన్ని వర్గాల ప్రజలు, అన్ని సామాజిక వర్గాల ప్రజలు అందరూ రోడ్డుపైనే ఉన్నారని తెలిపారు. వెట్టిచాకిరీ చేసే అంగన్వాడీ, పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను కూడా పరిష్కరించలేని పరిస్థితిలో మంత్రులు ఉన్నారని చెప్పారు. నిర్బంధ చట్టాలతో, పోలీసు అరెస్టులు, కేసులతో ఉద్యమాలను అణచలేరని, ఉద్యమ కారులను భయ పెట్టలేరని స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఖరి కారణంగానే బాదితులు రహదాలపైకి వస్తున్నారని, కోర్టుల చుట్టూ న్యాయమో రామచంద్ర అంటూ తిరుగుతున్నారని పేర్కొన్నారు. కోర్టులు చెప్పినా ప్రభుత్వం వినటం లేదని, ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

LEAVE A RESPONSE