అంగన్వాడీల ఆందోళనతో తాడేపల్లి ప్యాలెస్ లో వణుకు మొదలైంది

-సిబ్బందిపై ఎస్మాస్త్రం జగన్ రెడ్డి నియంతృత్వ పోకడలకు నిదర్శనం
– అంగన్‌వాడీ, డ్వాక్రా సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత

శాంతియుతంగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడం జగన్ రెడ్డి అరాచకపాలనకు పరాకాష్ఠ. ఎస్మా ప్రయోగించాల్సినంత తప్పు అంగన్వాడీలు ఏం చేశారు జగన్ రెడ్డీ? జీతం పెంచమని అడగటం నేరమా? తెలంగాణ కంటే వెయ్యి రూపాయిలు ఎక్కువే ఇస్తానని ప్రగల్భాలు పలికింది నువ్వే కదా? నువ్వు ఇచ్చిన మాట నీకు గుర్తు చేస్తే అంత ఆక్రోశమా? నీ ఇష్టానుసారమే అంతా నడవాలంటే ఎలా? ఇదేమైనా రాచరికం అనుకుంటున్నావా?

ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని జగన్ రెడ్డి తెలుసుకోవాలి. ఐదేళ్లలో కేవలం వెయ్యి రూపాయిలు పెంచి అంగన్వాడీల జీవితాలను ఉద్దరించినట్టు జగన్ రెడ్డి మాట్లాడ్డం సిగ్గుచేటు. పైగా సమ్మె కాలానికి వేతనంలో రూ. 3,450 కోత విధించడం దుర్మార్గం. జగన్ రెడ్డి నియంత పోకడలకు అంగన్వాడీలేం బెదరరు. రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. జగన్ రెడ్డి అరాచక పాలనకు చరమగీతం పలుకుదాం. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే. అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీల సమ్యలను పరిష్కరిస్తాం.

Leave a Reply