– అధికారంలో లేకపోయినా వైసీపీ నాయకుల దురాగతాలు ఆగడం లేదు
– సర్వేపల్లిలో కాకాణి మార్క్ అరాచకాలు
– పంటపాళెంలో శ్యాంరెడ్డిపై హత్యాయత్నం ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నాం
– నెల్లూరు అపోలో ఆస్పత్రిలో పంటపాళెం శ్యాంరెడ్డిని పరామర్శించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
నెల్లూరు: అధికారంలో లేకపోయినా వైసీపీ నాయకుల దురాగతాలు ఆగడం లేదు. మేం అధికారంలో ఉన్నా మా నాయకులను కత్తులతో పొడుస్తున్నారు. కాకాణి జైల్లో ఉన్నా సర్వేపల్లిలో వైసీపీ నేతలు చెలరేగిపోతున్నారు. పంటపాళెంలో ఎదనపర్తి శ్యాంరెడ్డిని మొన్న రాత్రి రాడ్లతో పొడిచారు. ఇంట్లో ఉన్న వ్యక్తిని బయటకు పిలిచి దుర్మార్గానికి పాల్పడ్డారు. ఒక రాడ్ వెన్నుముక వరకు వెళ్లగా, మరొకపోటు లంగ్స్ వరకు వెళ్లింది.పక్కటెముకలు విరిగాయి.
22వ తేదీ రాత్రి 9 గంటల తర్వాత అటాక్ జరిగింది.వెంటనే అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లగా వేకువజాము 2.30 గంటల వరకు వైద్యులు శ్రమించి శస్త్రచికిత్స చేశారు. ఇంకా ఐసీయూలో ప్రాణాపాయ పరిస్థితిలో చికిత్స పొందుతున్నాడు.
కాకాణి గురించి వైసీపీ జిల్లా నాయకులేమో చాలా గొప్పగా చెప్పుకుంటూ స్మేట్మెంట్ల మీద స్టేట్మెంట్లు ఇచ్చుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇది. వైసీపీ పాలనలో ఐదేళ్లూ దుర్మార్గాలకు పాల్పడ్డారు. ఇప్పుడు కూడా అదే విధంగా అరాచకాలు కొనసాగిస్తామంటే కుదరదు. శ్యాంరెడ్డిపై హత్యాప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా తీసుకుంటాం. అంతిమంగా మేం న్యాయస్థానాలు, దేవుడు, ప్రజలనే నమ్ముతున్నాం.