– మంత్రి పొన్నం ప్రభాకర్
– బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు సాకారం కావాలని కోరుతూ బీసీ కమిషన్ ఆధ్వర్యంలో బాపు ఘాట్ వద్ద తెలంగాణ కాంగ్రెస్ నేతల ప్రార్థనలు & పూజ్య బాపూజీ స్మృతి భజన కార్యక్రమం
– అసెంబ్లీ లో పాస్ అయిన బీసీ రిజర్వేషన్ల బిల్లును బాపూజీ ఘాట్ పై పెట్టీ ప్రార్థనలు చేసిన నేతలు
బాపు ఘాట్ వద్ద ప్రార్థనల్లో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ , బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్,కమిషన్ సభ్యులు తిరుమలగిరి సురేందర్, రాపోలు జయ ప్రకాష్, బాల లక్ష్మీ ,ఇతర ముఖ్య నేతలు
హైదరాబాద్: బాపు ఘాట్ దగ్గర తెలంగాణ బీసీ కమిషన్ ఆధ్వర్యంలో గాంధీజీ ఆలోచన విధానం మేరకు శాంతియుతంగా ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరిగింది. బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు అయ్యేలా అందరి మనసులు మారాలని ఇక్కడ ప్రార్థనలు చేయడం జరిగింది. మహాత్మా గాంధీ ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం చట్ట పరంగా ,న్యాయ పరంగా చేయాల్సినవి చేసి గవర్నర్ ద్వారా ఢిల్లీకి పంపించడం జరిగింది
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సకల జనులు ఏ విధంగా ఉద్యమం చేశారో, ఇప్పుడు కూడా బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు సాధించడానికి సకల జనులు ఇటీవల ఐక్యంగా బంద్ నిర్వహించి కార్యాచరణ తీసుకోవడం జరిగింది. శివుని పటంలో పాము , నంది , నెమలి, ఎలుక వీటన్నిటికి ఒకదానికి ఒకటి పడవు. కానీ శివుడి దగ్గర కలిసి ఉంటాయి.
ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు సాధించడానికి అందరూ ముందుకు రావాలి. అన్ని రాజకీయ పార్టీలుగా వ్యక్తులుగా ,ప్రజా ప్రతినిధులు గా ,రాజకీయ నాయకులుగా వేరు. ఈ కార్యాచరణ సాధించడానికి అందరూ ఐక్యంగా అన్ని వర్గాలు మనం రిజర్వేషన్లు సాధించుకోవాలి.
తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో 42 శాతం రిజర్వేషన్లు రాహుల్ గాంధీ ఆలోచన మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకు పోతున్నాం. తెలంగాణ లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు సాధించడానికి దేశానికి రోల్ మోడల్ గా ఉండాలి