Suryaa.co.in

Andhra Pradesh

ఆయుష్మాన్ కార్డులు అందరికీ అందాలి

– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి

కారంచేడులో బిజెపి పతాకాన్ని ఆవిష్కరించి, వాజపేయి జయంతి వేడుకలు లో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ….కారంచేడు గ్రామానికి గత తొమ్మిది న్నర సంవత్సరాలగా, 23కోట్ల నిధులు కేంద్రం లో ని బిజెపి ప్రభుత్వం మంజూరు చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయడం జరిగింది. ఆయుష్మాన్ కార్డు లు అందరికీ అందాలి ఆవిధంగా కృషి చేయాలన్నారు.అదేవిధంగా విశ్వకర్మ యోజన పథకం ద్వారా రుణాలు మంజూరు.కేంద్రం చేస్తున్న అభివృద్ధి ని ప్రతి ఇంటి కి తీసుకొని వెళ్లాలని పిలుపు ఇచ్చారు. కేంద్రం నిధులు లేక పోతే రాష్ట్రంలో అభివృద్ధి లేదన్నారు.

దేవుడి దయ వల్ల పర్చూరులో నేను ఓడిపోవడం మంచిదైంది: దగ్గుబాటి వెంకటేశ్వరరావు
రాజకీయాల్లోకి రావడం… అభివృద్ధి పనులు చేయడం దైవేచ్చ గా భావిస్తున్నాను మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు. కారంచేడు గ్రామం లో మూడు మంచి నీటి చెరువు లకు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ లను మూడు కోట్ల 50లక్షల వ్యయం తో నిర్మిస్తున్న పనులు కు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి దంపతులు శంఖుస్థాపన చేశారు.

ఈసందర్భంగా జరిగిన గ్రామ సభలో డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మనకు అవకాశం వచ్చినప్పుడల్లా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయాలన్నారు.ఈ సందర్భంగా ఆయన తన రాజకీయ జీవితంలో సంభవించిన కొన్ని సంఘటనలు ప్రస్తావించారు. పర్చూరులో వైకాపా నుంచి గెలవకపోవడమే మంచిదైంది. గెలిచి ఉంటే రోడ్లు వేయలేదని ప్రజలు నన్ను నిలదీసేవారు.వైకాపా పాలనలో కారంచేడులో ఒక్క రోడ్డు కూడా మరమ్మతు చేయలేదు. ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ రోడ్లపై ఇంత స్వేచ్ఛగా తిరగగలిగివాడిని కాదు. దేవుడి దయ వల్ల పర్చూరులో నేను ఓడిపోవడం మంచిదైంది

ఎన్టీఆర్ బిజెపి దగ్గర గా ఉన్న సంఘటన లు ప్రస్తావించారు. నా గ్రామాన్ని అభివృద్ధి చేయడం నాకు ఆత్మ సంతృప్తి ఇస్తుందన్నారు. దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ వాజపేయి జయంతి వేడుకలు సుపరిపాలన దినోత్సవం గా జరుపుకుంటున్నాము.అంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి వివరించారు. గ్రామస్తులు దగ్గుబాటి దంపతులు ను అభినందనలు తో ముంచెత్తారు

LEAVE A RESPONSE