Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు విదేశీ పర్యటనపై సాక్షిలో తప్పుడు రాతలు

• చంద్రబాబు ఎక్కడికి వెళితే వీళ్లకు అవసరమా ?
• జగన్ రెడ్డి లా చంద్రబాబుపై కోర్టు ఆంక్షలు ఉన్నాయా?… జగన్ రెడ్డి విదేశాలకు వెళ్లాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి
• చంద్రబాబు బయటకు వెళ్లాలంటే ఎవరి పర్మిషన్ తీసుకోవాలని లేదు
• పత్రిక, ఛానల్ ఉంది కదా అని అడ్డగోలు రాతలు చంద్రబాబుపై రాయించి బురద చల్లేందుకు చూస్తున్నారు
• తప్పుడు రాతలు రాసిన వారందరూ ఉచలు లేక్కలు పెడతారు
• అబద్ధాలతో నమ్మించాలనుకుంటే పిచ్చి భ్రమ అవుతుంది
• టీడీపీ నూటికి 1000 శాతం అధికారంలోకి రావడం ఖాయం
– మాజీ మంత్రి నక్కా ఆనందబాబు

చంద్రబాబు విదేశీ పర్యటనపై సాక్షిలో తప్పుడు రాతలు విష ప్రచాం చేస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ.. జగన్ రెడ్డి చీకటి చేష్టలు అన్నీ చంద్రబాబుకు అంటగట్టి సాక్షిలో అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు విదేశీ పర్యటనపై తప్పుడు రాతలు రాస్తున్నారు. సాక్షి రాతలు, సాక్షిలో వచ్చే వార్తలు నిస్సిగ్గుగా ఉంటాయి. చంద్రబాబు ఎక్కడికి వెళితే వీళ్లకు అవసరమా ? సెక్యూరిటీ రీజన్ కారణంగా అన్ని విషయాలు బటయకు చెప్పరు. పనికిమాలిన మాఫియా బ్యాచ్ వైసీపీ, సాక్షి చెప్పాల్సిన అవసరం లేదు.

జగన్ రెడ్డిలా చంద్రబాబుపై కోర్టు ఆంక్షలు ఉన్నాయా?… జగన్ రెడ్డి విదేశాలకు వెళ్లాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. జగన్ రెడ్డి ఆస్తులను ఈడీ జప్తు చేసింది. పాస్ పోర్టును సీజ్ చేసింది. జగన్ రెడ్డిపై 13 సీబీఐ ఛార్జ్ షీట్ లు ఉన్నాయి. చంద్రబాబు బయటకు వెళ్లాలంటే ఎక్కడా పర్మిషన్ తీసుకోవాలని లేదు. చంద్రబాబు ప్రతి సంవత్సరం విదేశీ పర్యటనలకు వెళ్తారు.. అదేవిధంగా ఈ సంవత్సరం వెళ్లారు. జగనన్ రెడ్డి లండన్ వెళ్తున్నానని చెప్పాడు.. కాని జగన్ రెడ్డి విమానం ఎక్కడ ల్యాండ్ అయ్యింది.. దానికి జగన్ రెడ్డే వివరణ ఇచ్చుకోవాల్సి ఉంది.

పత్రిక, ఛానల్ ఉంది కదా అని అడ్డగోలు రాతలు చంద్రబాబుపై రాయించి బురద చల్లేందుకు చూస్తున్నారు. జగన్ రెడ్డి కాడ ఉన్నట్లు లక్షల కోట్లు నల్లధనం చంద్రబాబు వద్ద లేదు. జగన్ రెడ్డి పెట్టించిన పనికిమాలిన కేసుల్లో ఒక్క రూపాయి కూడా నిరూపణ కాలేదు. చంద్రబాబు మచ్చలేని చంద్రుడు. చంద్రబాబుకు ఏ అవినీతి అంటదు… అంటించలేరు. జగన్ దగ్గర ఉన్న తాబేదారులతో చంద్రబాబును జైలుకు పంపి శునకానందం పొందారు. అంతకు మించి ఏమి చేయలేరు.

తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ. 43 వేల కోట్లు దోచుకున్నాడు జగన్ రెడ్డి… జగన్ రెడ్డి పై సీబీఐ ఛార్జ్ షీట్ లు వేసింది. సూట్కేస్ కంపెనీలు, షెల్ కంపెనీలు అనే పదాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు పరిచయం చేసింది జగన్ రెడ్డి. జగన్ రెడ్డి పెద్ద ఆర్థిక ఉగ్రవాది, ఆర్థిక నేరస్తుడు అందుకే 16 నెలలు జైల్లో ఉన్నాడు. జగన్ రెడ్డి లండన్ ఎందుకు పారిపోయాడో తానే చెప్పాలి.

ఎన్నికల తరువాత టీడీపీ నేతలు మాట్లాడటం లేదని అనడానికి సిగ్గుండాలి. పోలింగ్ తరువాత తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నది వైసీపీ నేతలే. జగన్ రెడ్డి నుండి కింది స్థాయి నాయకులు వరకు పత్తా లేకుండా పోయారు. కౌంటింగ్ ఏజెంట్లుగా ఎవరూ కూర్చోరని పనికిమాలిన మంత్రులు మాట్లాడుతున్నారు తప్పా… నియోజకవర్గాల్లో ఎవరికి తాము గెలుస్తామన్న నమ్మకం లేదు.

జగన్ రెడ్డి చేస్తున్న తప్పిదాలు, పోలింగ్ తరువాత జరిగిన హింసపై సీఈసీకి లెటర్ లు పెట్టాం. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అడ్డగోలుగా తాబేదారులకు బిల్లులు చెల్లించాలని చూస్తే దానిపై గౌవర్నర్ కు మా నాయకుడు లెటర్ రాశాడు. వైసీపీ నేతలు ఎన్నికల తరువాత నోరు తెరవలేదు. అందరూ పారిపోతున్నారు. ప్రజలు సైకో ప్రభుత్వాన్ని తరిమి కొట్టడానికి డిసైడ్ అయ్యి భారీగా ఓట్లు వేయడానికి తరలివచ్చారు.

పేపర్, ఛానల్ ఉందని ఇష్టం వచ్చినట్లు రాస్తే తప్పకుండా రాబోయే రోజుల్లో శిక్ష పడుతుంది. తప్పుడు రాతలు రాసిన వారందరూ ఉచలు లేక్కలు పెడతారు. అబద్దాలతో అందరిని నమ్మించాలనుకుంటే అది పిచ్చి భ్రమే అవుతుంది. ఒకే అబద్దాన్ని పది సార్లు రాసి రాసి నమ్మించాలనుకుంటే అది మీ మూర్ఖత్వం అవుతుంది. అది తిరిగి మీ మెడకే చుట్టుకుంటుంది. టీడీపీ కూటమి నూటికి 1000 శాతం అధికారంలోకి రాబోతుంది. దీన్ని ఎవరూ ఆపలేరు.

LEAVE A RESPONSE