Suryaa.co.in

Andhra Pradesh

కొంతమంది పోలీస్ అధికారులు వైసీపీ నాయకులకు కొమ్ముకాస్తున్నారు

-క్రిమినల్ ఆస్పిరెన్స్ ఉన్న వ్యక్తులు పోలింగ్ కౌంటింగ్ ఏజెంట్లుగా ఉండకూడదనే నిబంధన ఎక్కడా లేదు
-కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా రాజనగరం ఆర్ వో సర్కులర్ జారీ చేశారు
-పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఆర్వోలకు ఈసీ సరైన గైడ్లైన్స్ ఇవ్వాలి
-పోలింగ్ ముగిశాక కూడా వుగా సాగే విధంగా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి
– మాజీ మంత్రి నక్కా ఆనందబాబు

కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా రాజనగరం ఆర్వో సర్కులర్ జారీ చేశారని, కౌంటింగ్ ఏజెంట్లకు క్రిమినల్ ఆస్పిరెన్స్ అవసరం లేదు కాబట్టి ఆర్వోలకు సరైన ఆదేశాలు ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరిన తెలుగుదేశం పార్టీ నేతలు. మంగళవారం మాజీ మంత్రి నక్కా ఆనందబాబు నేతృత్వంలోని తెదేపా బృందం అడిషనల్ సీఈవో కోటేశ్వరరావును కలిసి విజ్ఞప్తి చేశారు.

అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ….”జూన్ 4న జరగబోయే కౌంటింగ్ ప్రక్రియలోని కొన్ని విషయాలపై ఎన్నికల సంఘంతొ చర్చించాం. ఎక్కడా లేని విధంగా కౌంటింగ్ ఏజెంట్ల లిస్టు ఇవ్వండని రాజానగరం రైటర్నింగ్ అధికారి సర్కులర్ జారీ చేశారు. గతంలో కూడా పోలింగ్ ఏజెంట్ల క్రిమినల్ ఆస్పిరెన్స్ ఇవ్వాలని ఆర్వో ఆదేశాలిస్తే మేము ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్ళాం.

అటువంటి రూల్ ఎన్నికల గైడ్ లైన్స్ లో ఎక్కడా లేదని సీఈవో వివరణ ఇచ్చారు. పోలింగ్ కి ఒక్క రోజు ముందు ఏజెంట్ల లిస్ట్ ప్రీసైడింగ్ ఆఫీసర్ కు ఇస్తే చాలు అని సర్కులర్ కూడా జారీ చేశారు. కానీ ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియలో కూడా ఆర్వోలు అదే అంశాన్ని తిరిగి తెర మీదకు తీసుకువచ్చారు. అందుకే పోలింగ్ ఏజెంట్లను ఏ విధంగా అనుమతించరో అలానే కౌంటింగ్ ఏజెంట్ల అంశంలో కూడా సర్కులర్ జారీ చేయాలనీ ఈసీని కోరాం” అని తెలిపారు

వైసీపీ గూండాలకు పోలీసులు ఏ విధంగా కొమ్ము కాసారో ప్రజలు గమనించారు….
ఇంకా కొంతమంది పోలీసు అధికారులు జగన్ రెడ్డికి తాబేదారులుగా పనిచేస్తున్నారు. గడిచిన ఐదేళ్లలో వేల మంది టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టారు. ప్రభుత్వ తప్పిదలను ప్రశ్నించిన ప్రతి కార్యకర్తపై కేసు నమోదు చేశారు. కక్షపూరితంగా కొన్ని కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ లో వందల మంది పేర్లు నమోదు చేసి, అది చాలకుండా అదర్స్ అని పెట్టి కేసుని క్లోజ్ చేయకుండా హోల్డ్ లో పెట్టారు.

అటువంటి కేసుల్లో ఏజెంట్లుగా ఉండే టిడిపి కార్యకర్తల పేర్లు ఎఫ్ఐఆర్ లో నమోదు చేయాలనే కుట్రను పన్నారు. కూటమి నేతలకు కార్యకర్తలకు ఏజెంట్లకు ఇబ్బందులు కలిగించాలని ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియలో కూడా అవే ఇబ్బందులు సృష్టించాలని చూస్తున్నారు. కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం రాజానగరం ఆర్వో సర్కులర్ చేసిన ఆదేశాలు చెల్లదు.

పోలింగ్ రోజు నుంచి వైసిపి మోకలు ఎటువంటి అల్లర్లు, దాడులు చేశారో ప్రజలంతా గమనించారు. వైసిపి గుండాలకు కొంతమంది పోలీసులు ఏ విధంగా సహాయం చేశారో కూడా ప్రజలు చూశారు. కాబట్టి కౌంటింగ్ ప్రక్రియ కూడా సజావుగా సాగే విధంగా చర్యలు తీసుకోవాలని అడిషనల్ సీఈవో ను కోరాం” అని ఆనంద్ బాబు తెలిపారు

ఎన్నికల సంఘాన్ని కలిసిన వారిలో నక్కా ఆనందబాబుతో పాటు ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చిట్టబత్తిన చిట్టిబాబు, మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్ర, భాస్కర రావు, దామోదర్ రాజు తదితరులు ఉన్నారు.

LEAVE A RESPONSE