Suryaa.co.in

Telangana

ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబాంధవులు

-కేసీఆర్ సుపరిపాలనలో రైతులకు నష్టం జరుగదు
-ఖమ్మం జిల్లాలో ప్రతిపాదిత రైల్వే లైన్ అలైన్మెంట్ మార్చాల్సిందిగా కోరుతూ ఎంపీ రవిచంద్రకు వినతిపత్రం ఇచ్చిన రైతులు
-మంత్రి పువ్వాడ, ఎంపీలు నామా,బండిలతో పాటు ముఖ్యమంత్రిని కలిసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తా:ఎంపీ రవిచంద్ర

ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు రైతుబాంధవులు అని,వారి సుపరిపాలనలో రైతులకు ఎటువంటి కష్టం రాదని, ఎలాంటి నష్టం జరుగదని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు.పాపడ్ పల్లి-జాన్ పహాడ్ -మిర్యాలగూడ ప్రతిపాదిత రైల్వే లైన్ అలైన్మెంట్ మార్చాల్సిందిగా కోరుతూ ఖమ్మం రూరల్, ముదిగొండ, నేలకొండపల్లి మండలాలకు చెందిన రైతులు సోమవారం ఎంపీ రవిచంద్రను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ రైతుల పక్షపాతి అని,వారి జనరంజక పాలనలో ఎవరికి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి నష్టం జరుగదని విస్పష్టంగా చెప్పారు.ప్రతిపాదిత రైల్వే లైన్ అలైన్మెంట్ వల్ల బడుగు,బలహీన వర్గాలకు చెందిన సన్న, చిన్న కారు రైతులకే ఎక్కువగా నష్టం వాటిల్లనున్నందున,దీన్ని మార్చాల్సిన ఆవశ్యకత గురించి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు,బండి పార్థసారథి రెడ్డిలతో కలిసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీనిచ్చారు.మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చంద్రావతి, నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్శాఖమూరి రమేష్,రైతు ప్రతినిధులు సాధిఖ్ అలీ,వల్లూరి పట్టాభి, గుర్రం అచ్చయ్య, పుచ్చకాయల సుధాకర్,ఎడ్లపల్లి వెంకట్రామయ్య,కట్టెకోల నాగేశ్వరరావులతో పాటు 80మంది రైతులు ఎంపీ వద్దిరాజును కలిశారు.ఈ సందర్భంగా “జై తెలంగాణ జైజై తెలంగాణ,”జిందాబాద్ జిందాబాద్ కేసీఆర్ జిందాబాద్”,ఆబ్ కీ బార్ కిసాన్ సర్కారు”అంటూ పెద్దపెట్టున నినాదాలిచ్చారు.

LEAVE A RESPONSE