Suryaa.co.in

Andhra Pradesh

రాయలసీమ ప్రాజెక్టులు – వాస్తవాలు

– జలవనరుల ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిన రాయలసీమ ద్రోహి జగన్ రెడ్డి
– 4 ఏళ్లల్లో ఒక్క ప్రాజెక్టు కట్టలేదు – ఒక్క ఎకరాకు సాగు నీరందించలేదు
– అప్పర్ భద్రపై కేంద్రాన్ని ప్రశ్నించడం చేతగానిదద్దమ్మ జగన్ రెడ్డి
– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు

జలయజ్ఞాన్ని పూర్తి చేస్తాం. పోలవరం, వెలిగొండ సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత మంచినీరు – సాగు నీరు కల నిజం చేస్తాం. చెరువులను పునరుద్దరిస్తాం, జలకళను తీసుకోస్తాం వైసీపీ 2019 మ్యానిఫెస్టోలో హామీ. కాని 4 ఏళ్లుగా జలవనరుల రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. బడ్జెట్ లెక్కలు చూస్తే వాస్తవ పరిస్థితులు భయటపడతాయి.
2014 – 22 రాష్ట్ర వ్యాప్తంగా జలవనరుల కేటాయింపులు – వ్యయాలు
వ.సం. సంవత్సరం కేటాయింపు (కోట్లల్లో) వ్యయం (కోట్లల్లో)
చంద్రబాబు నాయుడు హయాంలో
1 2014-15 3,017.5 9223.75
2 2015-16 4,500.79 9545.87
3 2016-17 7,205.82 10561.68
4 2017-18 11,870 12100.28
5 2018-19 16,978 14,462.13
43,572 55,893.71
1 నీరు ప్రగతి 12,400.23
మొత్తం 68,293.94
జగన్ రెడ్డి హయాంలో
1 2019-20 13,139.05 4,930.91
2 2020-21 11,805 4,715.41
3 2021-22 12,431 8,610.73
4 2022-23 11,482.37 10,741
5 2023-24 11,908
మొత్తం 28,998.05

టీడీపీ ఐదేళ్లలో జలవనరుల రంగంలో రూ.68,293.94 కోట్ల వ్యయం, రాష్ట్ర వ్యాప్తంగా 62 ప్రాజెక్టులను చేపట్టి, 23 ప్రాజెక్టులను పూర్తి చేసి, 32.02 లక్షల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ, 7 లక్షల ఎకరాలకు నూతన ఆయకట్టు అందించింది. కాని జగన్ ప్రభుత్వం 4 ఏళ్లల్లో రూ. 28,998.05 కోట్లు ఖర్చు చేసి ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదు, ఒక్క ఎకరాకు సాగునీరందించలేదు. రివర్స్ టెండరింగ్ పేరుతో కాలయాపన చేసి కాంట్రాక్టర్లను మార్చి కమీషన్లు దండుకుంటున్నారు.

జగన్ రాయలసీమ బిడ్డ కాదు ద్రోహి
ఎన్నికలకు ముందు రాయలసీమకు టీడీపీ అన్యాయం చేస్తుందంటూ దుష్ప్రాచారం చేసి, సీమ ప్రజలను మభ్యకు గురి చేసి ఓట్లు దండుకొని తీరా అధికారంలోకి వచ్చాక నట్టేట ముంచారు. 4 ఏళ్లుగా రాయలసీమలో ప్రగతి, అభివృద్ధి లేదు, ప్రాజెక్టుల నిర్మాణం ఊసే లేదు, వలసలు పెరిగిపోయాయి. రాయలసీమను రాళ్ల సీమగా మార్చేశారు. సీమకు అన్యాయం జరుగుతుందని ప్రశ్నిస్తుంటే న్యాయ రాజధాని అంటూ ప్రజలను మళ్లీ మోసం చేస్తూ ప్రాంతాల మధ్య విధ్వేషాలు రెచ్చగొడుతున్నారు.

కృష్ణా-గోదావరి జలాల్లో మన రాష్ట్ర హక్కుల్ని కేంద్రానికి దారాదత్తం చేసిన రాయలసీమ ద్రోహి జగన్. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జలదీక్ష చేసి అధికారంలోకి వచ్చాక అదే ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లి సీమ ప్రజలకు నమ్మక ద్రోహం చేశారు.కృష్ణాలోని మిగులు జలాలపై హక్కు కోరబోమని నాడు రాజశేఖర్ రెడ్డి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు లేఖ రాసి ఇచ్చి బచావత్ కమిషన్ మన రాష్ట్రానికి కల్పించిన హక్కుల్ని తాకట్టు పెట్టారు. కృష్ణా బోర్డును విశాఖలో పెట్టాలని జగన్ కేంద్రానికి లేఖ రాశారు. ఇప్పుడు రాయలసీమపై మొసలి కన్నీరు కారుస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో రాయలసీమ ప్రాజెక్టులపై రూ.8,291.76 కోట్లు ఖర్చు చేస్తే, జగన్ 4 ఏళ్లల్లో ఖర్చు చేసింది కేవలం రూ.2,011.13 కోట్లు మాత్రమే. విభజన చట్టం 11వ షెడ్యూల్డ్ లో హంద్రీ నీవా, గాలేరు నగరిని పొందుపరిచారు. అయినా కేంద్ర జలశక్తి కమీషన్ నాన్ అప్రూడ్ ప్రాజెక్టులుగా జాబితాలో పేర్కొన్నా జగన్ రెడ్డి నోరెత్తకపోవడం సిగ్గుచేటు.

జలవనరుల ప్రాజెక్టుల నిర్వీర్యం:-
చంద్రబాబు అధికారంలో ఉంటే రాయలసీమకు పండగ… జగన్ ఉంటే దండగ. పైపుల ద్వారా కృష్ణా జలాలను మద్రాసుకు తరలించాలని ఆనాడు తమిళనాడు ప్రయత్నిస్తే.. దాన్ని ఎన్టీఆర్ వ్యతిరేకించారు. రాయలసీమ గడ్డపై తెలుగుగంగ ప్రాజెక్టు చేపట్టారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును నిర్మించారు. ఎన్టీఆర్ ప్రారంభించి.. చంద్రన్న అభివృద్ధి చేసిన తెలుగు గంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, సోమశిల, స్వర్ణముఖి ప్రాజెక్టులు ఈనాడు రాయలసీమకు వరప్రసాదాలయ్యాయి. చంద్రబాబు తెలుగు గంగ జలాలను కాళహస్తి నుండి తిరుమల కొండకు తరలించి భక్తులకు నీటి కొరత తీర్చారు. టిడిపి ప్రభుత్వం ప్రారంభించిన ముచ్చుమర్రి ఆర్డిఎస్, గుండ్రేవుల, వేదవతి, గాలేరు-నగరి, హంద్రీ-నీవా కాలువల సామర్థ్యం పెంపుకు జగన్ తగు స్థాయిలో నిధులు విడుదల చేయలేదు. నిర్వాసితులకు పరిహారం చెల్లించి అన్ని రిజర్వాయర్ల సామర్థ్యం పెంచేందుకు నిధులు ఇవ్వలేదు. బొల్లాపల్లి రిజర్వాయర్ పనులు చేపట్టి దాన్ని పోతిరెడ్డిపాడుకు అనుసంధానం చేసి, గోదావరి జలాలు అందించి ఉంటే రాయలసీమ సస్యశ్యామలమై ఉండేది. దీనివల్ల పారిశ్రామిక అభివృద్ధి కూడా అయి ఉండేది.

ప్రాజెక్టు పేరు టీడీపీ (2014-19) వైసీపీ (2019-23) జులై 10, 2019న జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో నివేదిక ప్రకారం 4 ఏళ్లుగా నిర్వీర్యం
తెలుగు గంగ 504.51 383.76 84% పూర్తైన ప్రాజెక్టును జూన్ 2020న పూర్తి చేస్తామని హామీనిచ్చి పట్టించుకోలేదు ఆయకట్టు పెంచేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు – కాలువల మరమ్మత్తులకు నిధులు ఇవ్వలేదు
సోమశిల – స్వర్ణముఖి లింక్ కెనాల్ 134.26 18.38 66% పూర్తైన ప్రాజెక్టును జూన్ 2020న పూర్తి చేస్తామని హామీనిచ్చి ఇంత వరకు తట్ట మట్టి ఎత్తలేదు ప్రాజెక్ట్ మెయింటెన్స్ లేదు
సోమశిల 380.45 253.50 61% పూర్తైన ప్రాజెక్టును జూన్ 2020న పూర్తి చేస్తామని హామీనిచ్చి గాలికొదిలేశారు. కాలువల పూడిక తీత పనులు చేయకపోవడంతో చివరి ఆయకట్టుకు అందని నీరు
సోమశిల హైలెవెల్ లింక్ కెనాల్ ఫేజ్ – 521.53 78.93 61% పూర్తైన ప్రాజెక్టును జూన్ 2020న పూర్తి చేస్తామని హామీనిచ్చి గాలికొదిలేశారు కాలువల నిర్వహణ అద్వానం
గాలేరు – నగరి ఫేజ్ I -II 1546.26 443.43 గాలేరు నగరి ఫేజ్ I 84% పూర్తైతే జూన్ 2020న పూర్తి చేస్తామని – ఫేజ్ II 26% పూర్తైతే జూన్ 2021 పూర్తి చేస్తామని హామీనిచ్చి పట్టించుకోలేదు మట్టి తవ్వకాలు చూపుతున్న శ్రద్ధ నిర్మాణంపై చూపడం లేదు
గండికోట ఎత్తిపోతల పథకం 91.71 43.90 96% పూర్తైతే మార్చి 2020న ప్రారంభిస్తామని హామీనిచ్చి మాట తప్పారు. నిధులు లేక నిలిచిపోయిన ప్రాజెక్టు
ఎస్.ఆర్.బి.సి 282.15 44.37 93% పనులు పూర్తి చేస్తే మిగిలిన పనులు పూర్తి చేసి జూన్ 2020న ప్రారంభిస్తామని హామీనిచ్చి మాట తప్పి మడమ తిప్పారు అత్యంత కీలకమైన ప్రాజెక్టు నిర్మాణం పట్ల నిధులు ఇవ్వడం నిర్లక్ష్యం
సిద్ధాపురం ఎత్తిపోతల 36.55 15.68 67% పూర్తి అయితే త్యరితగతిన పూర్తి చేసి జూన్ 2020న ప్రారంభిస్తామని హమీనిచ్చారు. రైతు సంఘాలు పలు మార్లు విజ్ఞప్తి చేసినా పనులు ముందుకు సాగడం లేదు
హంద్రీ నీవా – ఫేజ్ I-II 4,182.67 515.79 ఫేజ్ I – 84% పూర్తి ఫేజ్ –II 75 % పూర్తికాగా జూన్ 2020, జూన్ 2021 ప్రారంభిస్తామని మాట తప్పి మడమ తిప్పారు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిపివేసిన కాంట్రాక్టర్లు
పీఏబీఆర్ స్టేజ్ –II 411.48 42.16 65% పూర్తి చేస్తే మిగిలిన ప్రాజెక్టులను పూర్తి చేసి జూన్ 2020 నాటికి ప్రారంభిస్తామని హామీనిచ్చారు రెండేళ్ల నుంచి పూర్తిగా నిలిచిపోయిన పనులు
గాలేరు-నగరికి చంద్రబాబు రూ 1546.26 కోట్లు ఖర్చు చేయగా.. జగన్ ఖర్చు చేసింది రూ.443.43 కోట్లు మాత్రమే. హంద్రీ-నీవాకు చంద్రన్న రూ.4,182 కోట్లు ఖర్చు చేయగా… జగన్ రెడ్డి ఖర్చు చేసింది రూ.515.79 కోట్లు మాత్రమే. ఇతర ప్రాజెక్టులది ఇదే తీరు. తన ఈ ద్రోహాన్ని కప్పి పెట్టుకోవడానికి రాయలసీమ లిఫ్టు పేరుతో జగన్నాటకం ఆడి కృష్ణ, గోదావరి జలాలను కేంద్రానికి ధారాదత్తం చేశారు. రూ.900 కోట్లు అవినీతికి పాల్పడ్డారు.
తెలుగుదేశం హయాంలో రాయలసీమ జిల్లాల వారీగా ప్రాజెక్టులు పూర్తి
జిల్లా ప్రాజెక్టు నిధులు (కోట్లు) ఎకరాలు
చిత్తూరు అవుకు టన్నెల్ రూ.452 1,600 ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణ
అడవిపల్లి రిజర్వాయర్ రూ.218 80,000 ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణ

అనంతపురం TBP హైలెవల్ మెయిన్ కెనాల్ వర్కు రూ.310
మిడ్ పెన్నార్ సౌత్ కెనాల్ ఆధునికీకరణ రూ.124
గుంతకల్లు బ్రాంచి కెనాల్ ఆధునికీకరణ రూ.111
ధర్మవరం బ్రాంచ్ కెనాల్ ఆధునికీకరణ రూ.7
మారాల రిజర్వాయర్ రూ.40 18,000 ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణ
చెర్లోపల్లి రిజర్వాయర్ రూ.98 5,500 ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణ
మడకశిర బ్రాంచి కెనాల్ రూ.806 32,772 ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణ -10వేల ఎకరాల నూతన ఆయకట్టు

కడప గండికోట సీబీఆర్ లిఫ్ట్ రూ.1,744 60వేలు ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ – 12,000 ఎకరాలకు నూతన ఆయకట్టు
నెం. 31వ రహదారి రూ.128 కడప – గుత్తి మధ్య ముంపును కాపాడం
గండికోట రిజర్వాయర్ రూ.755

కర్నూలు ముచ్చుమర్రి ఎత్తిపోతల రూ.549 88,919 ఎకరాలకు సాగు నీరు – 10 మండలాలకు లబ్ధి
సిద్దాపుం ఎత్తిపోతల రూ.116 1,000 ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ – 20,300 ఎకరాలకు నూతన ఆయకట్టు
పులకుర్తి ఎత్తిపోతల రూ.119 9,830 ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ
గోరుకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ రూ.840 1,90,000 ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ
పులికనుమ ఎత్తిపోతల రూ.294 26,400 ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ

తెలుగుదేశం హాయంలో రాయలసీమను కోనసీమగా మార్చారు. జీడిపల్లి భైరవతిప్ప, వేదవతి, గుండ్రేవుల వంటి ప్రాజెక్టులను నూతనంగా చేపట్టి ప్రాజెక్టులను పూర్తి చేశారు. పట్టిసీమ ద్వారా గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం వల్లే రాయలసీమ సాగుకు సకాంలో నీరందించి చీని చెట్లను కాపాడిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతుంది.

కుప్పం కంటే ముందే పులివెందులకు నీళ్లిచ్చాం కాని జగన్ రెడ్డి కుప్పానికి నీళ్లందించకుండా కక్షసాధింపు చర్యలకు దిగారు. వచ్చే ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకొని భూమినే జలాశయంగా మార్చుకునే విధంగా ప్రణాళికలు రచించాం. లోటు వర్షపాతం ప్రాంతాలలో రెయిన్ గన్స్, జిబా సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకున్నాం.

రాయలసీమ దుర్భిక్ష నివారణ మిషన్ జాడేది?
జగన్‌ ప్రభుత్వం ఆర్భాటంగా రాయలసీమ దుర్భిక్ష నివారణ మిషన్‌ (ఆర్‌డీఎంపీ) కింద 23 ప్రాజెక్టుల కోసం రూ.33,862 కోట్లతో భారీఎత్తున టెండర్లు కూడా పిలిచి ఉత్తుత్తి హడావుడి చేశారు. ఈ మిషన్‌ కింద ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆరు, కడప జిల్లాలో 10, అనంతపురం జిల్లాలో రెండు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో నాలుగు.. ఇలా మొత్తం 23 ప్రాజెక్టులు చేపట్టింది. తమ నిర్వాకంతో చివరికి కేంద్రం నిధులిస్తేనే పూర్తయ్యే పరిస్థితికి సీమ ప్రాజెక్టులను నెట్టేసింది.

ఇప్పటికే రూ.1,650 కోట్ల విలువైన పనులు జరిగాయి. ఇందులో సుమారు రూ.వెయ్యి కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో కాంట్రాక్టర్లు పనులు చేయక చేతులెత్తేశారు. జగన్‌ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులకు నిధులు సమకూర్చేందుకు ‘రాయలసీమ డ్రాట్‌ మిటికేషన్‌ కార్పొరేషన్‌’ ద్వారా నాబార్డు, ఏషియన్‌ డెవల్‌పమెంట్‌ బ్యాంకు (ఏడీబీ) వంటి ఆర్థిక సంస్థల చుట్టూ తిరిగినా అప్పు పుట్టలేదు.

అప్పర్ భద్రపై నోరుమెదపని జగన్
తుంగభద్ర నది కె–8 సబ్ బేసిన్‌లో కేటాయించిన నీటిలో అంతర్గతంగా సర్దుబాట్లతో బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులకు లోబడే కర్నాటక ప్రభుత్వం అప్పర్ భద్ర ప్రాజెక్టు చేపట్టిందని కేంద్ర జలవనరుల శాఖ నివేదికను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2022లో పంపింది. కేంద్ర జలవనరుల శాఖ ఫిబ్రవరి 15, 2022న అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి రూ.5300 కోట్లు బడ్జెట్‌లో ప్రకటించింది.

కర్ణాటక ప్రభుత్వం బచావత్ ట్రిబ్యునల్‌లో కె–8 సబ్ బేసిన్‌లో కేటాయించిన ప్రాజెక్టుల ఆధునీకరణ ద్వారా ఆదా అయ్యే నీళ్ళను, పోలవరం నిర్మాణం ద్వారా ఆదా అయ్యే కృష్ణా జలాల్లో కర్నాటకకు లభించే 21 టిఎంసిల నీటిలో 2.4 టిఎంసిల నీటిని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేటాయింపులు చేసి ఈ ప్రాజెక్టుకు అనుమతులు సా‌ధించింది.

కానీ జగన్ ప్రభుత్వం కరువు పీడిత రాయలసీమలో చట్టబద్ధ నీటి హక్కులున్న ప్రాజెక్టులకు సంపూర్ణంగా నీటిని వినియోగించుకోవడానికి చేపట్టాల్సిన ప్రాజెక్టుల ప్రణాళికలు రూపొందించడంలో, వాటిని కేంద్ర జలవనరుల శాఖ ముందుంచి అనుమతులు సాధించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించింది.
సాగునీటి ప్రాజెక్టుల కోసం, ప్రజల ఆకాంక్షలను ఏ మాత్రం పట్టించుకోని జగన్ చర్యలను రాయలసీమ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. సకాలంలో బుద్ది చెప్పేందుకు సిద్దమవుతున్నారు.

LEAVE A RESPONSE