అక్కిరెడ్డిపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం

-వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ..ముగ్గురి దుర్మరణం
-మరో 10 మందికి తీవ్రగాయాలు

విశాఖ జిల్లా పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా ఏస్‌ వ్యాన్‌ను లారీ ఢీకొట్టగా ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. చనిపోయిన వారంతా తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రు లను కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply