– బీజేపీ పొలిటికల్ ఫీడ్బ్యాక్ ప్రముఖ్ లంకా దినకర్
ఆర్బీఐ ప్రకటించిన గణాంకాల ప్రభావం కన్న తీవ్రమైన వత్తిడిలో ఆంద్రప్రదేశ్ ఉంది. కాగ్ కి సమర్పించిన నెలవారీ ఇండికేటర్ల ప్రకారం ఫిబ్రవరి 2022 లెక్కలను మార్చి 2022 నాటికి ఏమార్చారు. ఫిబ్రవరి 2022 నాటికి ఉన్న ఆర్ధిక లోటు ( అప్పు ) 51,112 కోట్లను మార్చి 2022 నాటికి 25,194 కోట్లకి ఏలా సర్దుబాటు చేస్తే తగ్గింది.
ఆర్బీఐ ప్రకటించిన అప్పుల తో జిడిపి నిష్పత్తి 32.8% పై సర్దుబాటు లేకుండా ఉండి ఉంటే మన రాష్ట్రం పంజాబ్ సరసన చేరేది, అదే కేంద్రప్రభుత్వం అడిగిన వివరణ ప్రకారం.. రాష్ట్రప్రభుత్వ కార్పొరేషన్ రుణాలను, డిస్కాం , ఉద్యోగుల పదవీవిరమణ నిధులను ఏఫ్ఆర్బీఏం పరిధిలోకి తెస్తే దేశంలో మన రాష్ట్ర పరిస్థితిని ఊహించలేము.
ఉచితం మాటున అనుత్పాదక వ్యయం తో, జిఏస్డిపి నిష్పత్తి 2.1 గా ఆర్బీఐ నివేదికలో ఉన్నప్పటికి, వాస్తవిక రెవెన్యూ ఆదాయం ఫిబ్రవరి 2022 నుండి మార్చి 2022లోపు 20,000 కోట్లకు పైగ వచ్చినట్టు సర్దుబాటు చేయడం వల్ల , దాదాపు పంజాబ్ నిష్పత్తి 2.7 కి సమానంగా ఉండాల్సిన స్థానంలో 2.1 గా కనబడుతుంది.
రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీల తో, జిఏస్డిపి నిష్పత్తి 9 దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అత్యధికం, గ్యారంటీలను సర్దుబాటు చేయలేరు కాబట్టి దొరికిపోయారు. రాష్ట్ర ప్రాథమిక లోటు తో.. జిఏస్డిపి 1.4 మరియ రెవెన్యూ లోటు 1.6 గా తగ్గించి కనబడడానికి కారణం, ఆకస్మిక రెవెన్యూ వసూళ్లు పెరుగుదల 20 వేల కోట్ల సర్దుబాట్ల వల్ల, పంజాబ్ మరియ బీహర్ల కన్న తక్కువ గా కనబడుతుంది.
కాగ్ ఆడిట్ అనంతరం ఫిబ్రవరి 2022 , మార్చి 2022 మధ్య గణాంకాల మధ్య జగన్నాటకం బహిర్గతం కావడం ఖాయం. ఆర్బీఐ కేవలం ప్రభుత్వం సమర్పించిన లెక్కల ప్రకారం మాత్రమే తన విశ్లేషణ చేస్తోంది కానీ గణాంకాల విండో డ్రస్సింగ్ ( ఆర్థిక నిర్వహణ లో ఉన్నవి లేనట్టు, లేనిది ఉన్నట్టు చేసే ప్రక్రియ) తో వారికి సంబంధం ఉండదు.