Suryaa.co.in

Crime News National

కాలేజీ విద్యార్థినిపై మాజీ క్లాస్‌మేట్ కత్తితో దాడి

పూణెకు చెందిన ఓ 19 ఏళ్ల యువతిపై 21 ఏళ్ల మాజీ క్లాస్‌మేట్ కత్తితో రోడ్డుపై పరుగెత్తించి దాడికి మంగళవారం పాల్పడ్డాడు. అదే సమయంలో అటు నుంచి బైక్ వెళుతున్న స్థానికులు.. అతడిని వెంబడించి యువతిని దాడి నుంచి రక్షించారు. కాగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో యువకుడు యువతి వెంటపడి దాడి చేయడం స్పష్టంగా కనిపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తన మాజీ క్లాస్‌మేట్ అయిన యువతి.. నిందితుడితో మాట్లాడేందుకు మహిళ నిరాకరించడంతో.. ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

LEAVE A RESPONSE