పెమ్మసాని చర్చలు సఫలం
గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఇటీవల మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. టీడీపీలోకి రావాలని ఆహ్వానించగా ఆయన కొన్ని డిమాండ్లను ముందు ఉంచారు. వాటికి అధిష్ఠానంతో పాటు స్థానిక టీడీపీ నేతలు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. దీంతో త్వరలోనే ఆయన పార్టీలో చేరేందుకు లైన్ క్లియర్ అయినట్లు సమాచారం. పొన్నూరు, ప్రత్తిపాడు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల్లో రావికి మంచి పట్టుంది. ఈ మూడు నియోజకవర్గాల్లో తెలుగు దేశం పార్టీ గెలవడం ఖాయమైనట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.