(చాకిరేవు)
మధ్యాహ్నం రాగి సంగటి, దానిపై పెరుగు. స్పూన్‌తో ఆరగిస్తూ సాధారణ రాజకీయ సమావేశం. అదే చంద్రబాబు నాయుడు.
కానీ అదే నాయుడు.. రాత్రికి ప్రపంచ దిగ్గజాలతో క్వాంటమ్ జాతక రాత్రికి వేదికయ్యారు! ఒకే రోజులో ఆయనే, ఈ సాధారణ, అసాధారణ కలయికకు నిదర్శనం.
అమరావతిలోని ముఖ్యమంత్రి నివాసం. ఈ ఆదివారం రాత్రి ఇక్కడ జరిగింది కేవలం విందు కాదు, భవిష్యత్తుకు బీజాంకురం! క్వాంటమ్ శాస్త్రజ్ఞులు, ప్రపంచ ఐటీ దిగ్గజాలు, భారతీయ మేధోనేతలు… అందరూ ఒకే గొడుగు కింద, ఒక డిన్నర్ టేబుల్ చుట్టూ! IBM నుండి మైక్రోసాఫ్ట్, AT&T నుండి వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ దాకా… ఆ టేబుల్ మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఆయా రంగాల్లో అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న వారే.
అసలు అతిథుల జాబితా చూస్తేనే ఆశ్చర్యమేస్తుంది. మైక్రోసాఫ్ట్, IBM, AT&T, అమెజాన్, HCL, TCS వంటి టెక్ దిగ్గజాలు. భారత్ బయోటెక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అస్ట్రాజెనెకా వంటి ఆరోగ్య రంగ నాయకులు. IITల ప్రొఫెసర్లు, కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సలహాదారులు… వారందరితో అమరావతి భవిష్యత్ భౌతిక శాస్త్రానికి, గణితానికి గర్భగుడి అవుతుందా? అనిపించే స్థాయిలో చర్చలు సాగాయి.
క్వాంటమ్ వ్యాలీ కాన్సెప్ట్ ఇప్పుడు ఆరంభ దశలో ఉన్నా, దానికి వచ్చే రోజుల్లో గ్లోబల్ ఫోకస్ ఖాయమనేలా దిగ్గజాలతో గుమికూడిన రాత్రి ఇది.
ఇది ఓ రాజకీయ కార్యక్రమం కాదు, భవిష్యత్ భారతదేశాన్ని క్వాంటమ్ శక్తిగా తయారుచేసే ఆలోచనల సమ్మేళనం. సాంకేతికతకు వేదికగా మారుతున్న ఆంధ్రప్రదేశ్.
ఈ డిన్నర్ పిండివంటల ఆరగింపుల కోసం కాదు. ఇక్కడ చర్చలు జరిగినవి డేటా ప్రాసెసింగ్, భావి క్వాంటమ్ గురించిన కుతూహల విషయాలపై. స్పూన్లు, ఫోర్కుల ధ్వనుల కంటే చప్పట్లే ఎక్కువగా మారుమోగాయి.
ప్రపంచాన్ని మెప్పిస్తున్న నాయుడు, అక్కడ తినేది ఊహకు అందని రేపటి భవిష్యత్తు కోసం… జీవితాన్ని పొడిగించుకోడానికి తినే అత్యంత సాధారణ ఆహారమే.
ఆ రాగి సంగటి వెనుక ఉన్న ఆ సాధారణత్వం, క్వాంటమ్ డిన్నర్ వెనుక ఉన్న ఆ దూరదృష్టి – ఇదే చంద్రబాబు నాయుడు!