Suryaa.co.in

Telangana

ఏ బలుపుతో పెడతాడు తంబ్ నెయిల్ ?

– మీడియా హౌజ్ ల పేరిట స్లాటర్ హౌజ్ లు
– ఏముంది ఫోన్ ట్యాప్ లో ? ఎవడిచ్చాడు సమాచారం ?
– రేవంత్ టూల్ మాత్రమే ..మోడీ ,చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ
– దేశం లో ఫోన్ ట్యాపింగ్ చేయని రాష్ట్ర ప్రభుత్వం ఉందా ?
– రేవంత్ తన ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదని చెప్పగలరా ?
– బాబు భార్య గురించి అసెంబ్లీ లో చర్చ జరిగినపుడు కేసీఆర్ భాధ పడ్డారు
– మాజీ మంత్రి ,ఎమ్మెల్యే జి .జగదీష్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం ఇష్టం లేని వాళ్ళు ఆంధ్రా నుంచి తెలంగాణ విడిపోవడం ఇష్టం లేని వాళ్ళు కేసీఆర్ పై కక్ష కట్టారు.
మీడియా హౌజ్ ల పేరిట స్లాటర్ హౌజ్ లు నడుపుతున్నారు. కేసీఆర్ ,కే టీ ఆర్ ల పై ఓ పథకం ప్రకారమే మీడియా హాజ్ లు కుట్రపూరితమైన కథనాలు ప్రసారం చేస్తున్నాయి.

కేసీఆర్ ఫీనిక్స్ పక్షిగా వస్తున్న తీరు తెలంగాణ వ్యతిరేకులకు నచ్చడం లేదు. కే టీ ఆర్ ప్రజల పక్షాన పోరాడటం తెలంగాణ వ్యతిరేకులను నచ్చడం లేదు. రేవంత్ టూల్ మాత్రమే ..మోడీ ,చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ. ఏముంది ఫోన్ ట్యాప్ లో ? ఎవడిచ్చాడు సమాచారం ? ఏ బలుపుతో పెడతాడు తంబ్ నెయిల్ ?

మీరు చేస్తున్న దుర్మార్గాలతో ఎంత మందిని క్షోభ పెడతారు? ఆడబిడ్డలు ఏడుస్తున్నారు ?ఎందుకు మీరు మాట్లాడటం లేదని మమ్మల్ని అడుగుతున్నారు ? ఏ మహిళ నైనా తన ఫోన్ ట్యాప్ అయింది అని చెప్పారా ? కాళేశ్వరం అని కొంత సేపు ,ఫోన్ ట్యాపింగ్ అని ఇంకొంత సేపు సీరియళ్ల సిరీస్ నడుపుతున్నారు ?

మీడియా హౌజ్ పేరిట ఏమిటీ అరాచకం ? ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన ఖర్మ మాకు పట్టలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసు పనికి మాలిన కేసు. మీ తప్పుల్ని కప్పి పుచ్చుకోవడానికి బీ ఆర్ ఎస్ ను బద్నామ్ చేసే కుట్ర చేస్తున్నారు. కేసీఆర్ తెలంగాణ ను దేశానికి రోల్ మోడల్ చేశారు. అందుకే కేసీఆర్ అంటే తెలంగాణ వ్యతిరేకుల కుట్ర.

చంద్రబాబు భార్య గురించి అసెంబ్లీ లో చర్చ జరిగినపుడు కేసీఆర్ భాధ పడ్డారు. మీ లాగా కేసీఆర్ కు ప్రచారం చేసుకునే అలవాటు లేదు. మాకు భాష రాక కాదు ..హుందా గా ఉంటున్నాం. దేశం లో ఫోన్ ట్యాపింగ్ చేయని రాష్ట్ర ప్రభుత్వం ఉందా ? గుడుల లోకి వెళ్తారు కదా ..చేస్తారా ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదని ప్రమాణం ? రేవంత్ తన ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదని చెప్పగలరా ?

ఉద్యమం లో నా ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగింది. ఎవరి డ్యూటీ వాళ్ళం చేశాం. ఇష్టమొచ్చినట్టు రాసి ఇదే జర్నలిజం అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. ఫోన్ ట్యాపింగ్ విచారణ విషయాలు అధికారికంగా ఎక్కడైనా వెల్లడించారా ? పోలీస్ డ్రెస్ వేసుకుని దొంగ వచ్చిన్నట్టు ,మిలిటరీ డ్రెస్ వేసుకుని ఉగ్రవాది వచ్చినట్టు ..మీడియా ముసుగు వేసుకుని మమ్మల్ని కాలుస్తున్నారు.

కొందరు సత్యహరిశ్చంద్రునికి అన్నలుగా ఫోజు కొడుతున్నారు. డెక్కన్ క్రానికల్ ,సాక్షి లపై టీడీపీ జనసేన దాడులు చేయలేదా ? మహా న్యూస్ పై దాడి జరిగిందని ఎవరికీ తెలియక ముందే చంద్రబాబు స్పందించారు. చంద్రబాబు ముందస్తు ప్రణాళిక ఏంటో దీన్ని బట్టి అర్థమవుతోంది. కాళేశ్వరం మేడిగడ్డ లో పిల్లర్లకు చిన్న పగుళ్లు వస్తే నానా హంగామా చేసిన కాంగ్రెస్ బీజేపీ నేతలకు, వాళ్ళ పాలిత రాష్ట్రాల్లో ఎన్నో బ్రిడ్జిలు కూలుతున్నా మాట్లాడరు.మీడియా కూడా అక్కడ జరుగుతున్న విషయాలు చూపించదు.

మీడియా అంటే మాకు గౌరవం ఉంది. ఆధారాలు లేనిది వార్తలు రాసి మా వ్యక్తిగత హననానికి పాల్పడితే సహించేది లేదు. రాసేది ఒక్క వాక్యమే అయినా ఎంత మంది హృదయాలను మీరు గాయపరుస్తున్నారు ? కోట్లాది మంది హృదయాలు గాయపడ్డపుడు మీడియా హౌజ్ ల దగ్గర నిరసనలు సహజం. కేసీఆర్ కే టీ ఆర్ లతో పాటు వేరే మహిళలు ఉన్న ఫోటోలు వేస్తున్నారు. వేసిన వారు వారి కుటుంబ మహిళల ఫోటోలు వేసుకుంటే బాగుంటుందని మా వాళ్ళు అంటున్నారు.

రేవంత్ రెడ్డి మీడియా ను పండబెట్టి తొక్కుతా అన్నది వాళ్లకు కనిపించడం లేదు. మీడియా హౌజ్ ల పేరిట కబేళా హౌజ్ లను నడుపుతున్న మీదనే మా నిరసన. కోదండరాం సమైక్యవాదుల నీడలో బతుకుతున్నారు. కోదండరాం కు తన పాత ఉద్యమాల గురించి పశ్చాత్తాప పడుతున్నట్టు ఉంది.తెలంగాణ జర్నలిస్టుల మీద దాడి జరిగినప్పుడు కోదండరాం ఎందుకో స్పందించలేదు

కొందరు శాంతి దూతలు గా నటించడం మరీ విడ్డూరం. వాళ్ళ బలుపు అహంకారం అంతా కేసీఆర్ ఏమనరు అనే. కేసీఆర్ ను ఏమైనా అంటాం అధికారం లోకి వచ్చాక మళ్ళీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాం అనేది వారి ఆలోచన. మీడియా ముసుగులు తీస్తాం .రాక్షస రూపం బయట పెడతాం. ఉద్యమం లో బయట పెట్టాం .మళ్ళీ పెడతాం.

చంద్రబాబు కు దమ్ముంటే కే టీ ఆర్ ,కేసీఆర్ లపై మహాన్యూస్ లో పెట్టిన థంబ్ నెయిల్స్ కు మద్దతు ప్రకటించి మాట్లాడాలి. కోట్లాది ప్రజల మనసులను గాయపరిచిన వారిని వదిలేది లేదు. ప్రెస్ మీట్ లో ఎమ్మెల్సీ కోటి రెడ్డి మాజీ ఎంపీ లింగయ్య యాదవ్ మాజీ ఎమ్మెల్యేలు భాస్కర్ రావు ,భిక్షమయ్య గౌడ్ ,బీ ఆర్ ఎస్ నేతలు చింతల వెంకటేశ్వర్ రెడ్డి ,ఒంటెద్దు నరసింహ రెడ్డి పాల్గొన్నారు.

LEAVE A RESPONSE