జీ20 సదస్సు .. ప్రత్యేక ఆకర్షణగా కోణార్క్ చక్రం

జీ20 సదస్సు తొలి రోజు మార్నింగ్‌ సెషన్‌ విశేషాలను ప్రధాని మోదీ సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ఓ వీడియోను షేర్‌ చేశారు

ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన భారత్ మండపంలో, ప్రధాని మోదీ అతిథులను స్వయంగా ఆహ్వానించారుఅమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తో పాటు బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్, జర్మనీ చాన్స్ లర్ ఓలఫ్ స్కాల్ట్, మారిషస్ అధ్యక్షుడిని కూడా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మండపం దగ్గర ఏర్పాటుచేసిన కోణార్క్ చక్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.బైడెన్ ను ఇది ఆకట్టుకుంది_ దేశ సంస్కృతిని ప్రతిబింబించే చిహ్నంగా దీని ప్రాముఖ్యతను మోదీ ఆయనకు వివరించారు