Suryaa.co.in

National

కుంభమేళా నీరు దేశ ప్రజలకు ఇంటింటికీ ఇవ్వండి!

– మఠాలు, పీఠాథిపతులు జనంలోకి వచ్చి కలవండి
– జ్యోతిష్ పీఠానికి డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ నివేదిక

ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకి సనాతన ధర్మము, వైభవం, ఇతర ధార్మికమైన భవిష్యత్ కార్యచరణ కోసం హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వైద్యులు, డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ తన ఆలోచనలు, అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆ సందర్భంలో అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాటిని సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు.

కొద్ది రోజుల క్రితం మహా కుంభ మేళా లో పుణ్యస్నానం చేసిన డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్, అక్కడ ఏర్పాట్లపై, తను చూసిన పరిస్థితులపై తనదైన శైలి లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవి ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అందులో భాగంగా డాక్టర్ వ్యాకరణం మఠానికి నాలుగు కీలమైన సూచనలు అందించారు. వాటి వివరాలు ఇవీ.. దానితోపాటు మహాకుంభమేళా, సనాతనధర్మ అమలు అంశాలపై జ్యోష్ పీఠానికి నాలుగు అంశాలతో కూడిన ఒక నివేదిక అందించారు.

కుంభమేళాకి అధికార యంత్రాంగం చక్కటి ఏర్పాట్లు చేశారని చెబుతూ, ఏర్పాట్లలో రాజకీయ నేతలు, ధనికులు, పలుకుబడి కలిగిన వారు, సినిమా తారలు వంటి వారికి కాకుండా, సామాన్య ప్రజలు కూడా పెద్ద పీట వేయాలని డాక్టర్ వ్యాకరణం సూచించారు. సామాన్యమైన ప్రజలే సనాతన ధర్మానికి ఆయుపట్టని, సామాన్యమైన ప్రజానీకంలో సనాతన ధర్మం ఇంకా ఉందని, ఇటువంటి కార్యక్రమాలలో వారి కష్ట నష్టాలు, సుఖాలు, ప్రత్యేక ప్రణాళికతో, పట్టించుకోవాల్సిన బాధ్యత ఉన్నది.

పెద్దన్న బాధ్యతగా, అధికార యంత్రాంగానికి ఉండాలని, ఓ జాతీయ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో డాక్టర్ వ్యాకరణం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. డాక్టర్ వ్యాకరణం చేసిన ఈ వ్యాఖ్యలు , దేశంలోని వివిధ శంకరాచార్య మఠాల వారు గమనించడం జరిగింది. ఇట్టి అభిప్రాయాలను పరిగణలో తీసుకొని, డాక్టర్ వ్యాకరణ చేసిన సూచలను అమలు పరచటానికి బాధ్యతగా ఏం చేస్తే బాగుంటుంది? అనే విషయం కొరకు ప్రత్యేకంగా రావాలని జ్యోతిష్మట్ శంకరాచార్య శ్రీ అవి ముక్తేశ్వరానంద స్వామి జ్యోతిష్ పీఠము ఆహ్వానం పంపింది.

అందులో భాగంగా డాక్టర్ వ్యాకరణం మఠానికి నాలుగు కీలమైన సూచనలు అందించారు. వాటి వివరాలు ఇవీ..

1) సుమారు 35 కోట్ల మంది సనాతన ధర్మ ఆచరణాపరులు కుంభమేళాలో జరిగే స్నానానికి హాజరవుతున్న ఈ మహత్తరమైన తేదీలలో, అన్ని శంకరాచార్య పీఠంవారు ఉన్న సందర్భంగా, అందరూ కలిసి సనాతన ధర్మమును మఠాల నుంచి పీఠాల నుంచి రెండు అడుగులు బయటికి వచ్చి, ప్రజలతో కలిసి మమేకమై, అనుదినము సనాతన ధర్మం ఎదురుకుంటున్న కష్టాలు సవాళ్లను అధికమించడానికి మేము ఉన్నాము అనే అండా- దండా బలము చూపించాల్సిన అవసరం ఉంది అని డాక్టర్ వ్యాకరణం అభిప్రాయబడ్డారు.

2) 75% ధర్మంలో ఉన్నవారు కుంభమేళాకు రాలేని పరిస్థితుల్లో, ఓ ధర్మార్గము ఓ ధర్మ సూచన ఓ ధర్మ దిక్సూచి, చేస్తూ వారికి పవిత్రమైన కుంభమేళ ప్రయాగరాజ్ సంఘం నీరును కూడా ప్రతి ఇంటికి తరలించి, ఆ పవిత్రమైన పుణ్యమైన నీరు అందే విధంగా చూడాల్సిన బాధ్యత ఈ నాలుగు పీఠాలది అని డాక్టర్ వ్యాకరణం వాక్యాలు చేశారు.

3) అనుదినం ఎన్నో కష్టాలు, విచిత్రమైన సవాళ్లు ఎదురు కుంటున్న సనాతన ధర్మ వాదులు, ఎన్నో విషయాలపై ఏ మఠం స్పందించకుండా మౌన నిద్రలో ఉండడం.. సనాతన ధర్మం ఆచరించే వాళ్ళకి నిరుత్సాహపడే అవకాశం ఉంటుందని అన్నారు.

4) ఆధ్యాత్మికమైన,ఆలౌకికమైన, దైవికమైన విషయాలపై, ధర్మ బోధన కార్యక్రమాలపై, పవిత్ర యజ్ఞాలపై ప్రతి శంకరాచార్య మఠం దృష్టి పెడుతున్న భక్తి శ్రద్ధ చాలా సంతోషించే దగ్గ విషయం అంటూ.. సనాతనధర్మి ఏ కష్టాలు పడుతున్నారు? కష్టాలని అధిగమించే విధంగా చేయూతనివ్వడం మఠాల బాధ్యత అని అన్నారు.

LEAVE A RESPONSE