Suryaa.co.in

Andhra Pradesh

విజయసాయిరెడ్డి కన్నింగ్ కాబట్టే జగన్ పక్కనబెట్టారు

– బీజేపీ విజయ సాయి రెడ్డిని చేర్చుకొనే ఆసక్తి చూపిస్తుంది
– బీజేపీలో చేరేందుకు విజయ సాయి రెడ్డి ఊవిర్లూరుతున్నారు
– జగన్ ను సాయిరెడ్డి‌….సాయిరెడ్డి జగన్ ను వాడుకున్నారు
– సాయు రెడ్డి కుమార్తె వివాహాన్ని జగన్ కోటరీ అడ్డుకుంది‌
– జాతీయ పార్టీతో ఒప్పందం కుదుర్చుకుని రాజీనామా చేశాడు
– కళ్యాణమస్తు పేరుతో కొన్ని వేల బంగారు తాళిబొట్లను మాయం చేసిన వ్యక్తి కరుణాకర్ రెడ్డి – టీడీపీ నేత, బలిజనాడు కన్వీనర్, టీటీడీ మాజీ పాలకమండలి సభ్యులు ఓ.వి.రమణ సంచలన ఆరోపణలు

తిరుపతి: వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎంపి విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత, బలిజనాడు కన్వీనర్, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు డాక్టర్ ఓ.వి.రమణ సంచలన ఆరోపణలు చేశారు. ఆయనో బ్లాక్‌మెయిలర్ అన్నారు. విజయసాయి కన్నింగ్ కాబట్టే ఆయనను జగన్ పక్కనపెట్టారన్నారు. రాజకీయాల్లో అతి విశ్వాసం, అహంకారం కనబరిస్తే ఆ పార్టీకి మనుగడ ఉండదని, ఏపి, తెలంగాణలో ఇది జనం చెప్పిన వాస్తమన్నారు. నాయకులు గౌరవం కోసమే రాజకీయాల్లో ఉంటారని, అవమానం జరిగే చోట ఉండరని సరైన సమయంలో వెళ్లిపోతారన్నారు.

‘నేను మాజీ ప్రధాని దేవగౌడకు కొన్నేళ్లు సన్నిహితంగా మెలిగా. జనతాదళ్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, కోశాధికారిగా పనిచేశా. ఆ అనుభవంతోనే చెబుతున్నా. అహంకారం, అతి విశ్వాసం ఉన్న ఏ పార్టీకి, ఏ నాయకుడికీ మనుగడ ఉండదు.నమ్మకం కలిగించలేని నాయకుడి దగ్గర ఎవరూ ఎక్కువకాలం ఉండరు. ఇది ఏ పార్టీకయినా, ఏ నాయకుడికయినా వర్తించే సూత్రమే’నని రమణ స్పష్టం చేశారు. అంతకుముందుకు ఆయన.. తిరుమల దర్శనానికి వచ్చిన దేవగౌడ కుమారుడైన కేంద్రమంత్రి కుమారస్వామితో కలసి వెంకన్నను దర్శించుకున్నారు.

విజయసాయిరెడ్డిపై రమణ ఇంకా ఏమన్నారంటే.. వైఎస్ కుటుంబాన్ని విజయసాయి రెడ్డి వాడుకున్నట్లు ఎవరు వాడుకోలేదు. టీటీడీ చైర్మన్ ఇస్తానని సాయిరెడ్డికి జగన్ హామీ ఇచ్చి ఇవ్వలేదు. ఆస్తులు ఇచ్చి విజయసాయి రెడ్డి రెండవ సారి ఎంపీ అయ్యాడు . రెండోసారి ఎంపీ పదవి రాదని ఆస్ట్రేలియాలో వ్యవసాయం చేసుకుంటా అంటూ కోర్టులో రిట్ పిటిషన్ వేశారు. వైయస్ కుటుంబం గురించి అన్నీ తెలిసిన వ్యక్తి విజయసాయిరెడ్డి.

విజయసాయిరెడ్డి కన్నింగ్ కాబట్టే జగన్ పక్కనబెట్టారు. దుష్టచతుష్టయం వల్ల రాష్ట్రం అధోగతి పాలైంది. జాతీయ పార్టీతో సంబంధం పెట్టుకొని జగన్ ను నట్టేట ముంచే ప్రయత్నం చేస్తున్నాడు విజయసాయిరెడ్డి. జగన్ పక్కన ఉన్న నలుగురు మిగిలిన సామాజిక వర్గాన్ని అధోగతి పాలు చేశారు. బ్లాక్ మెయిలర్ విజయసాయిరెడ్డి వేరొక పార్టీలో చేరి మళ్లీ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్నాడు.

టీటీడీలో అపచారం జరిగిపోయిందని కరుణాకర్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదం. చెలికత్తెలను తీసుకొచ్చి కొన్ని గంటల పాటు ఆలయంలో కూర్చోబెట్టిన చరిత్ర కరుణాకర్ రెడ్డిదే. కళ్యాణమస్తు పేరుతో కొన్ని వేల బంగారు తాళిబొట్లను మాయం చేసిన వ్యక్తి కరుణాకర్ రెడ్డి. అనవసరమైన కట్టడాలు కట్టిన కరుణాకర్ రెడ్డి అపచారం అంటూ మాట్లాడటం సిగ్గుచేటు. అపచారం అని చెప్పి కొండపై ఏదో జరిగిపోతోందని భూమన చెప్పడం సరైంది కాదు. అతి విశ్వాసం, అతి నమ్మకం ఉంటే జగన్ పార్టీలాగా మూతపడడం ఖాయం.

బీజేపీ విజయ సాయి రెడ్డిని చేర్చుకొనే ఆసక్తి చూపిస్తుంది. బీజేపీలో చేరేందుకు విజయ సాయి రెడ్డి ఊవిర్లూరుతున్నారు చంద్రబాబు మా అన్న వరుస అని చెప్పి ఆయనపై అనేక విమర్శలు చేశారు. మూడు పెళ్లిలు పవన్ కళ్యాణ్ చేసుకున్నాడని, నేడు నాకు అత్యంత ఆప్తుడు అంటూ వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి. ఒక కన్నింగ్ ,తెలివైన రాజకీయ నేత విజయ సాయి రెడ్డి.వైఎస్ ఆర్ కుటుంబాన్ని విజయసాయి లాగా ఎవరు వాడుకోలేదు‌‌. విజయసాయి రెడ్డికి టిటిడి చైర్మన్ ఇస్తామని చెప్పి జగన్ మోసం చేశాడు.తప్పనిసరి పరిస్థితుల్లో రాజ్యసభ కు పంపాడు. జగన్ ను సాయిరెడ్డి‌….సాయిరెడ్డి జగన్ వాడుకున్నారు.

అక్రమాస్తుల కేసులో విజయసాయి రెడ్డి వల్ల ఇబ్బందులు వస్తాయని జగన్ రెండోసారి పదవీ ఇచ్చాడు. విజయ సాయు రెడ్డి కుమార్తె వివాహాన్ని జగన్ కోటరీ అడ్డుకుంది‌. జాతీయ పార్టీతో ఒప్పందం కుదుర్చుకుని రాజీనామా చేశాడు. భవిష్యత్తులో పవన్ కల్యాణ్ పక్కన విజయసాయి రెడ్డి చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడం విజయసాయి రెడ్డి అలవాటే.
అగ్గిపెట్టె నుండి తాలిబొట్టు వరకు అవినీతి చేస్తే అపచారం కాదా భూమన‌‌?

బిచ్చగాళ్ళను తీసుకొచ్చి కల్యాణం చేస్తే అపచారం కాదా? అగ్గిపెట్టె నుండి తాలిబొట్టు వరకు అవినీతి చేస్తే అపచారం కాదా భూమన‌‌? హుండీలో డబ్బులను రాజకీయాలు వాడుకుంటే తప్పుకాదా? అపచారం గురించి భూమన మాట్లాడటం హాస్యాస్పదం. భూమన చేసిన తప్పులు టిటిడి చైర్మన్ గా ఎవరూ చేయలేదు.

LEAVE A RESPONSE