– ‘గో సంపదను’ రక్షించుకోలేని ప్రభుత్వాలు దేవాలయాలకు, హిందువులకు ఇంకేం భద్రత, రక్షణ కల్పిస్తారు?
ఇలా అయితే ఇంక దేశాన్ని ఏం రక్షిస్తారు?
(సిహెచ్‌విఎస్ శర్మ)
చూస్తున్నారా…
బాధగా ఉంది కదా…
కళ్ళంబడి నీళ్ళు వస్తున్నాయి కదా…
మన తల్లి ‘గో మాతలను’ ఎంత కర్కశంగా, పాశవికంగా, చిత్ర హింసలకు గురి చేస్తూ తరలిస్తున్నారో. చాలా బాధగా ఉంది కదా. మనుషిని కూడా ఇలాగే హింసించి చంపుకుతినే ఏదైనా ఒక జీవిని ఈ సృష్టిలో ఆ భగవంతుడు
సృష్టించి ఉన్నట్లయితే, ఆ జీవి ఈ మనిషిని కూడా ఈ ‘గో మాతలను’ ఎలా హింసించి చంపుకు తింటున్నారో అలాగే బ్రతికుండగానే హింసించి చంపుకు తింటూ ఉంటే అప్పుడు తెలుస్తుందేమో ఈ నర రూప రాక్షసులకు ఆ ‘గో మాతలు’ అనుభవించే నరకయాతన.
గో హత్యలు చేసిన వారు ఏనాటికైనా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఈ రోజున నాకేమవ్వలేదు అనుకుని విర్రవీగవచ్చు కానీ కర్మ అనేది ఒకటి ఉంటుంది ఆకర్మకు ఎవ్వరూ అతీతులు కారు. వారు ఎంతటి హోదాలో ఉన్నా, ఎంతటి గొప్ప వారైనా సరే తప్పించుకోలేరు. ఆ కర్మను అనుభవించి తీరాల్సిందే.
మన హిందూ దేశంలో ‘గోమాతల’ హత్యలు నిరంతరం యధేచ్ఛగా జరుగుతున్నాయి. ఈ గో హత్యలకు సంబంధించిన వార్తలను మనము ఎన్నో వార్తా మాధ్యమాలలో చూస్తున్నాము, వింటూ ఉన్నాము. ‘గోమాతల’ హత్యలను ఆపాలి, అందుకు ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకురావాలి, అమలు చేయాలి, ‘గోమాతలను’ హత్య చేసిన వారిని యావజ్జీవ జైలు శిక్షలు వేసి అయినా సరే ఈ ‘గోమాతల’ హత్యలను ఆపటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్యాచరణను రూపొందించుకుని అమలు చేయాలి.
ఎంతో కాలం నుంచి గో హత్యల మీద అనేక మంది, గో రక్షక సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, సాధువులు, స్వామీజీలు, పీఠాధిపతులు, అనేకానేక హిందు సంఘాలు ఎన్ని విజ్ఞప్తులు చేసినా, ర్యాలీలు చేసినా, ఆందోళనలు, పోరాటాలు చేసినా ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు. ఎందుకు పట్టించుకోవటం లేదో అర్ధం కావటం లేదు. ఈ హిందూ దేశంలో హిందూ దేవాలయాలకు, హిందూ సమాజం అత్యంత దైవ సమానంగా ఆరాధించుకునే గో సంపదకు రక్షణ లేకుండా పోయింది.
ఈ హిందూ దేశంలో హిందువులు తమకు అన్ని విధాలుగా రక్షణ, భద్రత కల్పించేది ఒక్క బి జె పి అని నరనరాల్లో విశ్వసిస్తారు కదా మరి బి జె పి కేంద్రంలో అధికారంలోనే ఉంది కదా… మరి ఏం చేస్తున్నది. ప్రతి రాష్ట్రంలో కూడా బి జె పి నాయకులు ఉన్నారు మరి వీళ్ళేం చేస్తున్నారు.
అలాగే విశ్వ హిందూ పరిషత్, భజరంగ్‌దళ్, అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ ఇంకా అనేక హిందూ సంఘాలు కూడా ఉన్నాయి కదా మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? గో హత్యలను ఆపలేరా? ఈ హిందూ దేశంలో ‘గో సంపదను’ రక్షించుకోలేని, కాపాడుకోలేని ప్రభుత్వాలు దేవాలయాలకు, హిందువులకు ఇంకేం భద్రత, రక్షణ కల్పిస్తారు? ఇలా అయితే ఇంక దేశాన్ని ఏం రక్షిస్తారు అనే సందేహం కూడా కలుగుతుంది. అటువంటి సందేహాలకు తావివ్వకుండా ప్రభుత్వాలు గోహత్యలను చేసే వారిని ఉక్కుపాదంతో తొక్కి నారతీయాలి. అటువంటి వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలి.
గో హత్యలను ఆపకపోతే దేశానికి అరిష్టం, అనర్ధం జరుగుతుంది. అల్లకల్లోలాకు దారితీస్తుంది. దేశం అధోగతి పాలవుతుంది, దేశంలో శాంతి అనేదే లేకుండా పోతుంది. కొట్టుకు చస్తారు, చస్తున్నారు కూడా. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇదైతే ముమ్మాటికీ నిజం దేశానికి ఈ అరిష్టం, అనర్ధం మాత్రం ఖచ్ఛితంగా జరుగుతుంది. దరిద్రం చుట్టుకుంటుంది అని గ్రహించాలి.
‘గో సంపదను’ చంపుకుని తింటున్న దేశాలను చూడండి. అవి ఏవైతే ఉన్నాయో ఆయా దేశాలు అన్నీ కూడా ఎంతగా అలమటిస్తున్నాయో, అడుక్కుతింటున్నాయో. వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకు చస్తున్నారు, ఒకళ్ళనొకళ్ళు దుర్మార్గంగా చంపుకుంటున్నారు, అర్ధికంగా కుంగిపోయి దారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతున్నారు, ఆయా దేశాల మధ్య బాంబుల మోతలు, యుద్ధాలు, శవాల గుట్టలు, దేశాలకు దేశాలే శ్మశాన దిబ్బలుగా మారిపోవటాన్ని మనం చూస్తూనే ఉన్నాం. జరుగుతున్నది కూడా ఇదే.
ఇంకా అనేకానేక సమస్యలతో ప్రశాంతత లేకుండా ఆయా దేశాల ప్రజలు బిక్కు బిక్కుమనుకుంటూ క్షణక్షణం ప్రాణ భయంతో చస్తూ, బ్రతుకుతూ ఉండటం కూడా మనం చూస్తూనే ఉన్నాము. గో హత్యలు మన భారతదేశంలో కూడా రహస్యంగాను, బహిరంగంగాను, భయం లేకుండా విచ్చలవిడిగా జరుగుతున్నాయి. అందుకే మన దేశంలోని అన్ని రాష్ట్రాలలో కూడా ప్రశాంతత అనేది లేకుండా కొట్టుకోవటం, చంపుకోవటం, అసాంఘీక కార్యక్రమాలు ఎక్కువైపోవటం, మనుషుల్లో వైషమ్యాలు పెరగటం, అశాంతికి దారి తీయటం మొదలైన విపత్కర పరిస్థితులను చూస్తూ ఉన్నాం.
కావున అటువంటి బాధాకరమైన పరిస్థితులు రాకుండా ఉండాలంటే మనము తప్పని సరిగా ‘గో సంపదకు’, ‘హిందూ దేవాలయాలకు’ రక్షణ, భద్రత కల్పించి కాపాడుకోవాలి. దేశం బాగుండాలంటే ‘గో మాత’ కంట తడిపెట్టకూడదు. గో సంపదల హత్యలకు పాల్పడిన వారిని తక్షణమే అత్యంత కఠినంగా శిక్షించాలి, యవజ్జీవ శిక్షలు విధించాలి, దేశ బహిష్కరణ చేయాలి.
ఈ విధమైన చట్టాన్ని తీసుకు వచ్చి అత్యంత కఠినంగా దేశంలోని అన్ని రాష్ట్రాలలో అమలు చేయాలి. ‘గో సంపదను’ మన భారత దేశపు జాతీయ ప్రాణిగా గుర్తించాలి. ఆలస్యం చేయకుండా వెంటనే ప్రకటించాలి. ఈ విషయంలో అన్ని రాష్ట్రాలలోని బి జె పి నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకు రావాలి.