Suryaa.co.in

National

ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు శుభవార్త…..

73 లక్షల మందికి ఒకేసారి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ప్రతీ నెలా పెన్షనర్లకు పెన్షన్ విడుదల చేస్తూ ఉంటుంది.

ప్రస్తుతం ఈపీఎఫ్ఓకు ఉన్న 138 రీజనల్ ఆఫీసుల ద్వారా పెన్షనర్లకు పెన్షన్ విడుదలవుతూ ఉంటుంది. అంటే రీజియన్ల వారీగా పెన్షన్ వేర్వేరు సమయాల్లో విడుదలవుతూ ఉంటుంది. దేశమంతా ఉన్న పెన్షనర్లకు ఒకేసారి డబ్బులు జమ కావట్లేదు.

ఈపీఎఫ్ఓ కొత్తగా సెంట్రల్ సిస్టమ్ రూపొందించింది. ఈ సిస్టమ్ ద్వారా 73 లక్షల మంది పెన్షనర్లకు ఒకేసారి పెన్షన్ విడుదల కానుంది. అంటే రీజనల్ ఆఫీసులతో సంబంధం లేకుండా దేశంలోని అందరు పెన్షనర్లకు ఒకేసారి పెన్షన్ విడుదల చేయనుంది. జూలై 29, 30 తేదీల్లో జరగబోయే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో సెంట్రల్ సిస్టమ్ ప్రారంభించడంపై కీలక నిర్ణయం తీసుకోనుంది.

సీడాక్ సహకారంతో సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్డ్ సిస్టమ్స్ అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనకు 2021 నవంబర్ 20న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవస్థ ఏర్పాటుపై ఈ నెలాఖరులో జరగబోయే సమావేశంలో కీలక ప్రకటన రావడం ఖాయం. ఈ వ్యవస్థ ప్రారంభమైతే 73 లక్షల మంది పెన్షనర్లు ఒకేసారి పెన్షన్ పొందొచ్చు.

ప్రస్తుత పద్ధతి ప్రకారం అన్ని ప్రాంతీయ కార్యాలయాలు తమ ప్రాంతాల్లోని పెన్షనర్ల వివరాలను విడివిడిగా అందజేస్తాయి. అందుకే దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్లు వేర్వేరు సమయాల్లో లేదా వేర్వేరు రోజుల్లో పెన్షన్ పొందుతారు. 138 రీజియనల్ కార్యాలయాల్లో ఉన్న డేటాను సెంట్రల్ డేటాబేస్‌కు అనుసంధానం చేసి ఒకేసారి పెన్షన్ విడుదల చేయనుంది ఈపీఎఫ్ఓ.

సెంట్రలైజ్డ్ సిస్టమ్ అందుబాటులోకి వస్తే ఒకే మెంబర్‌కు వేర్వేరు అకౌంట్స్ ఉన్నా అవి మెర్జ్ అవుతాయి. ఉద్యోగం మారినప్పుడు అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇక దీంతో పాటు ఆరు నెలల లోపు ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్స్ తమ పెన్షన్ ఖాతాల నుంచి డిపాజిట్లను విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతించే ప్రతిపాదనపైనా చర్చ జరిగే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఆరు నెలల నుంచి 10 ఏళ్ల లోపు ఈపీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు జమ చేసినవారికే విత్‌డ్రా చేసే అవకాశం ఉంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మీటింగ్‌లో మినిమమ్ వేజ్‌ లిమిట్‌ను రూ.15,000 నుంచి రూ.21,000 కి పెంచే ఆలోచనలో ఉంది ఈపీఎఫ్ఓ. కేంద్ర ప్రభుత్వం 2014లో సాలరీ లిమిట్‌ను రూ.15,000 చేసింది.

మినిమమ్ వేజ్ సీలింగ్‌ను పెంచాలన్న డిమాండ్లు చాలాకాలంగా ఉన్నాయి. ఈ లిమిట్ రూ.15,000 నుంచి రూ.21,000 పెంచాలన్న ప్రతిపాదనలున్నాయి. జూలై 29, 30 తేదీల్లో జరగబోయే సమావేశంలో దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంది.

LEAVE A RESPONSE