గూగుల్ విద్యార్థుల్ని ఆదర్శవంతమైన పౌరులుగా తీర్చిదిద్దలేదని, అది గురువులకు ఏమాత్రం ప్రత్నామాయం కాదని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి.హృదయ రాజు, యస్.చిరంజీవి లు అన్నారు. గూగుల్ మానవుడు తయారు చేసిన ఒక సాధనం లాంటిదే తప్పా గురువుకు సాటి కాదన్నారు.
ఉపాధ్యాయుల సాన్నిహిత్యంలో మాత్రమే విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని, విద్య అంటే కేవలం పాఠాలు బోధించడం మాత్రమే కాదని, విద్యార్థికి క్రమశిక్షణ, మానవ సంబంధాలు, నైతిక విలువలు మొదలగు అన్ని విలువలను ఉపాధ్యాయుల ద్వారా మాత్రమే విద్యార్థులు నేర్చుకుంటారని ఆదిమూలపు సురేష్ గ్రహించాలని, మంత్రి వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని ఏపీటీఎఫ్ నేతలు తెలిపారు.