Suryaa.co.in

Telangana

గోశాలపై కిరాయి గుండాల దాడి

– గోశాల నేలమట్ట చేసిన గుండాలు
– కోర్టు ఉత్తర్వులు బేఖాతర్
– ఆశ్రయం కోల్పోయిన గోవులు

ఆలేరు: బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి రోజున గోశాల పై కిరాయి గుండాలు జేసీబీ లతో దాడులు చేసి విధ్వంసం చేసి గోశాలను పూర్తిగా నేలమట్టం చేసి, గోవులకు నిలువ నీడ లేకుండా చేసిన సంఘటన శుక్రవారం ఆలేరు మండలం బహదూర్ పెట్ట గ్రామంలో చోటుచేసుకుంది.

ఆలేరు మండలం బహద్దుర్ పేట గ్రామంలోని సర్వే నెంబర్ 88లో అదే గ్రామానికి చెందిన గోవిందు రాజుల మాధవి గత మూడు సంవత్సరాల క్రితం తన సొంతానికి కు చెందిన వ్యవసాయ భూమిలో, వాళ్ళ తాత అమ్మమ్మ జ్ఞాపకార్థం సారబుడ్ల సావిత్రమ్మ లక్ష్మారెడ్డి గోశాల రిజిస్ట్రేషన్ నెంబర్ 592/22 నమోదు గోశాలను ప్రారంభించారు.

ఈ యొక్క భూమిలో గోవులకు పెద్ద రేకుల షెడ్డు వేసి, గోవులకు వినియోగించే దాణ కోసం ఒక పెద్ద కంటైనర్ ను ఏర్పాటు చేసి, గో ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నాటి నుంచి నేటి వరకు ఈ గోశాలలో ఆరు ఆవులను పోషిస్తున్నారు. మిగతా భూముల్లో గోవులకు పశుగ్రాసం ఏర్పాటుచేసి గోశాల బాద్యతలు నిర్వహిస్తున్నారు.

ఈ గోశాలలో ప్రతిరోజు గోవులకు క్రమం తప్పకుండా వేద పండితులతో పూజలు నిర్వహిస్తు బహదూర్ పేట గ్రామం లో ప్రజలకు ఆధ్యాత్మికత అవశ్యత.హిందూ, సనాతన ధర్మంపై పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు.

గోశాలపై కిరాయి గుండాల దాడి

గ్రామంలో నిర్విరామంగా నిర్వహిస్తున్న సారబుడ్ల సావిత్రమ్మ లక్ష్మారెడ్డి గోశాలపై బహదూర్ పేట గ్రామానికి చెందిన కుళ్ళ నర్సింహులు అనే వ్యక్తి వందమంది కిరాయి గుండాలను జెసిబిలతో గోశాలపై దాడికి ఉసిగొలి పాడు. దీంతో వంద మంది కిరాయి దుండగులు జెసిబి ల తో గోశాల మీద పడి దాడి చేసి గోవులను చెల్లాచెదను చేసి గోశాలను, పశు గ్రాశాన్ని పూర్తిగా నేలమట్టం చేశారు.

కోర్టు ఉత్తర్వులు అతిక్రమించి..
గోశాలకు సంబంధించిన భూమి విషయమై ఆలేరు సివిల్ కోర్టు యందు గోశాల నిర్వాహకురాలు గోవిందరాజుల మాధవి ఓ ఎస్ నెంబర్ 67/2022 ద్వారా ఇంజక్షన్ ఆర్డర్ పొంది ఉన్నారు. కోర్ట్ మంజూరు చేసిన ఇంజక్షన్ ఆర్డర్ ను సైతం అతిక్రమించి దుండగులు గోశాలపై దాడి చేసి ధ్వంసం చేశారు. వీరికి స్థానిక కాంగ్రెస్ నేతల అండదండలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. భూమిని కాజేయాలనే ఉద్ధేశ్యంతో గోవులకు నిలువ నీడలేకుండా చేశారని తెలుస్తోంది.

పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

గోశాలపై దాడి చేసి గోశాలను పూర్తిగా మట్టం చేసిన దుండగులపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ వివిధ పార్టీల చెందిన నాయకులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

LEAVE A RESPONSE