-వాట్సప్ గవర్నెన్స్ లాంటి ఆలోచన నారా లోకేష్ మదిలో పుట్టిన వినూత్న ఆలోచన
– ఈ సేవల ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువ
– ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రజలకు పిలుపు.
పుట్టపర్తి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , మంత్రి నారా లోకేష్ బాబు ఆధ్వర్యంలో ఏపీలో సుపరిపరిపాలన విధానం ప్రపంచానికే రోల్ మోడల్ గా మారుతోందని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వాట్సప్ గవర్నెన్స్ ప్రారంభించిన నేపథ్యంలో ఆయన సీఎం చంద్రబాబు నాయుడు కి , మంత్రి నారా లోకేష్ కి పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తొలివిడతలో దేవాదాయ, విద్యుత్, ఆర్టీసీ , రెవెన్యూ, అన్నక్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపాల్ శాఖల్లో 161 సేవలు అందించనున్నట్టు చెప్పారు. దీని ద్వారా వేగంగా పౌరసేవలు, పారదర్శకత, జవాబుదారీతనంలో భాగంగా వాట్సాప్ గవర్నెన్స్ ఉపయోగపడుతుందన్నారు. రెండో విడతలో వాట్సాప్‍లో 360 సేవలను అందుబాటులో ఉంచుతారన్నారు. ప్రజలు గతంలోగా ఏదైనా సర్టిఫికెట్ కావాలంటే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పొందవచ్చన్నారు.
ప్రతి సర్టిఫికెట్ పైన క్యూఆర్ కోడ్ ఉంటుందని.. వాట్సాప్ గవర్నెన్స్ తో ఎక్కడా నకిలీకి ఆస్కారం ఉండదన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సేవల్ని 9552300009 వాట్సాప్ నెంబర్ ద్వారా ప్రజలు అన్ని సేవలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పిలుపునిచ్చారు.