Suryaa.co.in

Andhra Pradesh

ఏపీలో ఉద్యోగార్థులకు ప్రభుత్వం తీపికబురు

-ఈ నెలలో వరుసగా 23 నోటిఫికేషన్లకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు
-ఎంపీ విజయసాయిరెడ్డి

నవంబర్ 2: రాష్ట్రంలో ఉద్యోగార్థులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీపికబురు అందించిందని, ఈ నెలలో వరుసగా 23 నోటిఫికేషన్ల విడుదలకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి చెప్పారు. సోషల్ మీడియాలో రాష్ట్రంలో అభివృద్ధికి సంబంధించి పలు అంశాలను వెల్లడించారు.

నోటిఫికేషన్ లో బాగంగా 100 గ్రూప్-1 పోస్టులు, 900 గ్రూప్-2 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అలాగే నోటిఫికేషన్ ద్వారా వందల సంఖ్యలో డిగ్రీ లెక్చరర్ల పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు.

డిసెంబర్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉంటుందని అన్నారు. అవకాశాల్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగార్థులు ఉద్యోగాలు సాధించాలని ఈ మేరకు ఉద్యోగార్దులందరికీ అభినందనలు తెలియజేశారు.

సాగునీటి అందించడంతో కొత్త చరిత్ర లిఖించిన జగన్ ప్రభుత్వం
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏటా కోటి ఎకరాలకు పైగా సాగునీరు అందిస్తోందని, సుస్థిర సాగు, ఆహార భద్రత లక్ష్యంగా అన్నదాతకు అన్ని విధాలా అండగా నిలుస్తోందని విజయసాయి రెడ్డి తెలిపారు. సాగునీరు అందించడంలో జగన్ ప్రభుత్వం నవ చరిత్ర లిఖించిందని అన్నారు.

ఈ మేరకు గురువారం విశాఖలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో కలిసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మక ఐసీఐడీ సదస్సు ప్రారంభించారని అన్నారు. దేశంలో 57 ఏళ్ల తరువాత ఈ ప్రతిష్టాత్మక సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశ విదేశాల నుండి భారీగా ప్రతినిధులు సదస్సుకు తరలివచ్చారని అన్నారు. నీటి ఎద్దడిని అదిగమించడం, అధిక దిగుబడులు సాధించడమే సదస్సు ప్రధాన ఎజెండా అని అన్నారు.

వైఎస్సార్ అవార్డు గ్రహీతలకు అభినందనలు
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక వైఎస్సార్ అచీవ్మెంట్, వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు అందుకున్న మొత్తం 27 మందికి అభినందనలు తెలియజేశారు, ఎంపికైన రంగాలలో వారు చేస్తున్న సేవలు ఎనలేనివని కొనియాడారు. వారు సమాజానికి అందిస్తున్న సేవల ద్వారా భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని భావిస్తున్నానని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు మీద వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వైఎస్సా అవార్డుల పరంపర ఇదే స్ఫూర్తితో కొనసాగుతుందని అన్నారు.

LEAVE A RESPONSE