Home » చంద్రబాబు తప్పు చేయలేదనే నమ్మకం ప్రజల్లో ఉంది కాబట్టే… ప్రజాభిమానం కట్టలు తెంచుకుంది

చంద్రబాబు తప్పు చేయలేదనే నమ్మకం ప్రజల్లో ఉంది కాబట్టే… ప్రజాభిమానం కట్టలు తెంచుకుంది

-స్కిల్ డెవలప్ మెంట్ కేసుపై అసత్యాలు, అర్థసత్యాలతో విషప్రచారం చేయడం తప్ప 52 రోజుల్లో 50 పైసలైనా చంద్రబాబుకి వచ్చినట్టు జగన్ ప్రభుత్వం నిరూపించగలిగిందా?
• చంద్రబాబుని తమ రాజకీయకుట్రలకు బలిచేయడానికి ఈ ప్రభుత్వం.. సీఐడీ స్కిల్ డెవలప్ మెంట్ కేసుకు సంబంధించి సృష్టించిన తప్పుడు ఛార్జ్ షీట్లు..వేసిన ఎఫ్.ఐ.ఆర్ లు న్యాయస్థానాలు వీళ్ల ముఖానే విసిరికొట్టే రోజు దగ్గర్లోనే ఉంది
• స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో రూపాయి కూడా అవినీతి జరగలేదని మేం ముందునుంచీ చెబుతున్నదే నిజం
• నిరాధార ఆరోపణలు చేస్తున్న ప్రభుత్వానికి.. ముఖ్యమంత్రి…మంత్రుల.. సీఐడీ చీఫ్ సంజయ్ కు.. ఏఏజీ సుధాకర్ రెడ్డికి సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్ వేర్ కేంద్రప్రభుత్వ సంస్థ షిప్పింగ్ కార్పొరేషన్..గుజరాత్ సహా మరో 5 రాష్ట్రాలతో చేసుకున్న ఒప్పందాల్లోని వివరాలు కనిపించడం లేదా?
• యువతకు ఉద్యోగాలు ఇస్తామని 2014లో టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించింది.
• దానిప్రకారం చంద్రబాబు ముఖ్యమంత్రిగా స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు.. అమలుపై దృష్టిపెట్టి, క్షేత్రస్థాయిలో సత్ఫలితాలు సాధించారు
• తప్పు చేసిన అధికారుల్ని వదిలేసి… చంద్రబాబే అంతా చేశాడనడం జగన్ కుట్రరాజకీయాల్లో భాగమే.
• స్కిల్ డెవలప్ మెంట్ కేసు లోతుల్లోకి వెళ్లి న్యాయస్థానాలు విచారించిన నాడు, ఈ ప్రభుత్వం సృష్టించిన ఛార్జ్ షీట్లు.. ఎఫ్.ఐ.ఆర్ లు విసిరి పాలకుల ముఖానే కొడతాయి
– పీ.ఏ.సీ ఛైర్మన్, టీడీపీ శాసనసభ్యులు పయ్యావుల కేశవ్

రాజమహేంద్రవరం నుంచి విజయవాడకు రావడానికి 14 గంటల సమయం ఎందుకు పట్టిందో, ఎందుకంత జనసునామీ పోటెత్తిందో, ప్రజాదరణతో చంద్రబాబు వాహనశ్రేణి కదలలేక, కదలలేక ఎందుకు ముందుకు కదలాల్సి వచ్చిందో ప్రభుత్వ ఇంటిలిజెన్స్ వర్గాలు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్పలేదా అని.. నిజం తెలిసి ఈ పాటికే పాలకుల్లో అడుగంటిన అరకొర విశ్వాసం కూడా పూర్తిగా సన్నగిల్లే ఉంటుందని టీడీపీ సీనియర్ నేత, శాసనసభ్యులు పయ్యావుల కేశవ్ ఎద్దేవాచేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“ అర్థరాత్రి నడిరోడ్లపై లక్షలాదిమంది జనం ఎందుకు నిలబడ్డారో.. పదేళ్ల నుంచి 70 ఏళ్ల వారి వరకు ఎవరి రాకకోసం పడిగాపులు కాశారో తెలిసి.. ఏమీ తెలియదన్నట్టు.. చూడలేదన్నట్లు మాట్లాడుతున్నారంటే కచ్చితంగా సజ్జలను ప్రజలు గుడ్డివాడిగా, మతిలేనివాడిగా భావిస్తారు.

చంద్రబాబు తప్పు చేయలేదని… ఆయనపై ప్రజలకు ఉన్న అపారమైన నమ్మకానికి నిదర్శనమే.. అర్థరాత్రి రోడ్లపై ఉప్పొంగిన ప్రజాభిమానం
ప్రభుత్వ నిఘావర్గాలు వాస్తవాల్ని కొంత తగ్గించి చెప్పినా… సగం దాచి సగమే సజ్జల కు చెప్పినా పావువంతు సమాచారంచాలు ప్రభుత్వ..మరియు పాలకుల గుండెలు జారిపోవడానికి. ప్రజాభిమానం కట్టలు తెచ్చుకుంటే ఎలా ఉంటుందో ఇన్నేళ్ల నా రాజకీ య జీవితంలో మొన్ననే ప్రత్యక్షంగా చూశాను. ఎక్కడైనా మా నాయకుడి వాహనం గానీ.. మా వాహనాలు గానీ నిమిషం ఆపినట్టు మీ పోలీసులు మీకు చెప్పారా సజ్జలా ?

మీటింగులు పెట్టామంటున్నారు…కనీసం చంద్రబాబు కారు దిగారా? అవేమీ లేవు… ఎక్కడా బండి ఆగకుండా.. అర్థరాత్రి జాతీయ రహదారిపై వాహనాలు కనీసం 20 కిలోమీటర్ల వేగంతో కూడా ముందుకు కదల్లేని పరిస్థితి రావడానికి కారణం ఏమిటో సజ్జలకు ఇంకా అర్థంకాలేదా? అర్థమైనా.. నిజం తెలిసినా తెలియనట్టు నటిస్తున్నారా?

ఉప్పొంగిన ప్రజాభిమానానికి కారణం.. చంద్రబాబు తప్పు చేయలేదని ప్రజలకు ఆయనపై నమ్మకం ఉండబట్టే. ఈ ప్రభుత్వం కావాలని అక్రమంగా తప్పుడుకేసులు పెట్టి ఆయన్ని జైలుకు పంపిందనే నమ్మకం. తెలుగురాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 70కి పైగా దేశాల్లో చంద్రబాబుకు మద్ధతుగా నిరసనలు, ధర్నాలు కొనసాగితే.. అవన్నీ ఆర్గనైజ్డ్ ప్రోగ్రామ్స్ అని సజ్జల అవహేళన చేశారు.

మరి 14 గంటలపాటు సాగిన సంఘీభావయాత్ర ఎవరు ఆర్గనైజ్ చేశారో సజ్జల చెప్పాలి. రోడ్లపైనే పడుకొని..చంద్రబాబు వాహనశ్రేణి వస్తుందని తెలియగానే రోడ్లపైకి పరిగెత్తుకు వచ్చిన జనాన్ని ఏమనాలి? చంద్రబాబు వల్ల తమకు ఈ మంచి జరిగింది .. తమ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి.. తమ కూతుళ్లకు పెళ్లిళ్లు అయ్యాయి…. తమ కుటుంబానికి మేలు జరిగిందనే నమ్మకమే ప్రజల్ని రోడ్లపైకి తీసుకొచ్చింది.

రైతులు..మహిళలు.. యువత.. వృద్ధులు ఇలా అన్నివర్గాల వారి గుండెల్లోని అభిమాఃనం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంటే మీరు.. మీ ప్రభుత్వ పరిస్థితి ఏమిటో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది.

14 గంటల పాటు నిర్విరామంగా ఉప్పొంగిన ప్రజాభిమానాన్ని ఎవరు ఆర్గనైజ్ చేశారో సజ్జలే చెప్పాలి
బెయిల్ కు సంబంధించి సజ్జల మాట్లాడుతూ.. చంద్రబాబు బెయిల్ పై బయట ఉన్నారు.. మెరిట్స్ కు సంబంధించి ఏమైనా చర్చ జరిగిందా అంటున్నారు. నిజంగా ఆయన అన్నట్టు మెరిట్స్ పై న్యాయస్థానాలు దృష్టిసారిస్తే, ప్రజల ముందు మీరు.. మీ నాయకుడు నగ్నంగా నిలబడాల్సిన దుస్థితి వస్తుందని తెలుసుకో సజ్జలా! అసత్యాలు. .. అర్థసత్యాలతో చంద్రబాబుని ఏవిధంగా 52 రోజులపాటు జైల్లో ఉంచారనే దానిపై న్యాయస్థానాలు మెరిట్స్ లోకి వెళ్తే.. మీరు.. మీ న్యాయవాదులు ఇచ్చిన పేపర్లను వి సిరి మీ ముఖానే కొడతాయని తెలుసుకోండి.

52 రోజులు మా నాయకుడిని జైల్లో పెట్టి, 50 పైసల అవినీతి అయినా నిరూపించారా? చివరకు సిగ్గులేకుండా పార్టీ సభ్యత్వం పొందడానికి కార్యకర్తలు చెల్లించిన కష్టార్జితాన్ని అవినీతి సొమ్ము అంటున్నారు. మా కార్యకర్తలు కష్టపడిన సొమ్ముని పార్టీకి విరాళంగా..సభ్యత్వాల రూపంలో రాష్ట్రంలో ని పలుబ్యాంకుల ద్వారా పార్టీకి అందించారు. ఆ సొమ్ముని తప్పుడు సొమ్ముగా చిత్రీ కరించడానికి దిగజారారంటేనే అర్థమవుతోంది.. చివరకు మీరు ఎంతగా బరితెగించారో అని.

ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నా… స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ద్వారా, మా నాయకుడికి.. మాపార్టీకి ఒక్కరూపాయి వచ్చినట్టు నిరూపించగలదా అని? తలకిందులుగా తపస్సు చేసినా మీ వల్లకాదని గుర్తుంచుకోండి. చంద్రబాబుని మీ రాజ కీయ కుట్రలకు బలిచేయడానికి మీరు సృష్టించిన ఎఫ్.ఐ.ఆర్ లు.. ఛార్జ్ షీట్లను న్యాయస్థానాలు మీ ముఖంపైనే విసిరేసి మీకు చీవాట్లు పెట్టే రోజు దగ్గర్లోనే ఉంది.

సీఐడీ చీఫ్ .. అడిషనల్ ఏజీ.. ప్రభుత్వ సలహాదారు సజ్జల.. మంత్రులు.. పదేపదే తమనోటికి వచ్చిన అబద్ధాలతో దుష్ప్రచారం చేస్తున్నారు తప్ప.. వాస్తవాలు ప్రజల ముందు ఉంచడంలేదు . స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఒప్పందంలోఎక్కడా 90:10 అనే విషయం పొందు పరచలేదు అంటున్నారు. డబ్బు విడుదలకు ముందే.. చాలా స్పష్టంగా ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం 10శాతం సొమ్ము మాత్రమే చెల్లిస్తుందని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ ఒప్పందంలో 90 : 10 శాతానికి ఒప్పుకుంటున్నట్టు వికాశ్ కన్వేల్కర్.. గంటా సుబ్బారావు.. సుమన్ బోస్ సంతకాలు పెట్టారు.

ఒప్పందంలో ఎక్కడా తేదీ వేయలేదు…. 90 :10 శాతం అనే ప్రస్తావనే లేదు…గ్రాంట్ ఇన్ ఎయిడ్.. గ్రాంట్ ఇన్ కైండ్ కు సంబంధించి చేస్తున్న ప్రచారమంతా అసత్యమే
చాలా క్లియర్ గా భారత ప్రభుత్వ విభాగమైన మినిస్ట్ట్రీ ఆఫ్ షిప్పింగ్ మరియు ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్ వారు సీమెన్స్ ఇండస్ట్రీ సాప్ట్ వేర్ ప్రైవేట్ లిమిటెడ్ వారితో సెప్టెంబర్ 17, 2017న ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందంలో కూడా 90 : 10 నిష్ప్తత్తి.. నిధులకు సంబంధించి గ్రాంట్ ఇన్ కైండ్ ప్రతిపాదనలు ఉన్నాయ. అసలు 90 : 10 అనేదే లేదని వాదిస్తున్న వైసీపీ ప్రభుత్వం.. మంత్రులు.. భారత ప్రభుత్వం సీమెన్స్ సంస్థతో చేసుకున్న ఒప్పందంపై ఏం సమాధానం చెబుతారు?

మిగిలిన భారతప్రభుత్వ సంస్థలు కూడా దీని ద్వారా లబ్దిపొందాలని…90 : 10 నిష్పత్తిలో నిధులు వినియోగించుకోవాలని కేంద్రప్రభుత్వ కార్యదర్శే గతంలో లేఖ రాశారు. దీనిపై జగన్ సర్కార్ ఏం సమాధానం చెబుతుంది? భారత ప్రభుత్వంపై కూడా కేసు నమోదు చేయాలంటుందా?

భారత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలోని సమాచారం మొత్తం టైప్ చేయబడ్డాక… కింద పెన్నుతో ఎప్పుడో తర్వాత సంతకం పెట్టారు. అది చాలా నార్మల్ గా జరిగే ప్రక్రి యే. దాన్ని కూడా తప్పు పడతారా? అలా జరగగడం తప్పయితే… వైసీపీ ప్రభుత్వం లో అలాంటి డాక్యుమెంట్లు.. సంతకాలు కొన్ని వందల్లో ఉంటాయి. వాటిని ఎలా సమర్థించుకుంటారు? ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా జగన్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు.. పెట్టిన సంతకాలు కొన్ని వందల్లో ఉంటాయి. వాటిపై ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది?

గ్రాంట్ ఇన్ ఎయిడ్..గ్రాంట్ ఇన్ కైండ్ పదాలే తేడా..భావం ఒక్కటే.
సీమెన్స్ సంస్థకు ఏపీ ప్రభుత్వ ఒప్పందంతో సంబంధంలేదని ప్రభుత్వం..సీఐడీ చెబు తున్నాయి. జర్మనీలోని సీమెన్స్ హెడ్ క్వార్టర్ ను జగన్ ప్రభుత్వం సంప్రదించిందా? లేఖరాయడం..మెయిల్ ద్వారా సంప్రదించడం చేసిందా?.. దానిపై జర్మనీ నుంచి ఈ ప్రభుత్వానికిగానీ.. సీఐడీకిగానీ సమాధానం వచ్చిందా? ఇవేమీ చేయకుండా పదేపదే ప్రభుత్వం సాక్షిపత్రిలో ప్రచురిస్తున్న లెటర్ ఎవరిది అంటే.. ఏపీప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంలో సంతకం పెట్టిన sisw (సీమెన్స్ ఇండస్ట్రియల్ సాఫ్ట్ వేర్ లిమిటెడ్) వారిది. వారు ఏపీ ప్రభుత్వంతో జరిగిన ఒప్పందంతో తమకు సంబంధం లేదని జగన్ ప్రభుత్వాకినికి చెప్పారా?

జగన్ ప్రభుత్వం సీమెన్స్ ఇండస్ట్రియల్ సాఫ్ట్ వేర్ వారికి రాసిన లేఖలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్ధతిలో అమలుచేసే పథకం మీ వద్ద ఉందా… అని ప్రశ్నించారు. దానికి సీమెన్స్ సంస్థ వారు.. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనే పద్ధతి అయితే మావద్ద లేదుగానీ.. విద్యాసంస్థలకు తాము డిస్కౌంట్ అందించే పథకం ఉంది.. దాన్ని గ్రాంట్ ఇన్ కైండ్ గా వ్యవహరిస్తామని చెప్పింది. భారత ప్రభు త్వం చేసుకున్నఒప్పందంలో కూడా గ్రాంట్ ఇన్ కైండ్ అనే మెన్షన్ చేసింది. అదే పదాన్ని సీమెన్ ఇండియా సంస్థ ఇన్ కైండ్ గ్రాంట్ అంటే..ఏపీ ప్రభుత్వం దాన్ని గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంది. అంతే తేడా?

అమెరికా వాడు గతంలో భారత్ కు గోధుమలు.. పాలపొడి వంటి కొన్ని ఆహారపదార్థాలు పంపించి.. వాటిని గ్రాంట్ ఇన్ ఎయిడ్ అన్నా డు. డాలర్లు పంపించామని చెప్పలేదు.. అలాంటప్పడు ఆ వచ్చినవన్నీ డబ్బుగా ఎలా పరిగణిస్తారు? వాడుక భాషలో ఒకలా.. ఒప్పందపత్రాలపై మరోలా ఉన్నా.. భావం ఒక్కటే. అదే విషయం సీమెన్స్ సంస్థ కూడా చెప్పింది. కానీ ఈ ప్రభుత్వం …ముఖ్యమంత్రి.. అతని జేబు సంస్థ సీఐడీ మాత్రం అడ్డగోలుగా వాదిస్తూనే ఉన్నాయి.

గతంలోనే స్కిల్ డెవలప్ మెంట్ కేసుని ఈడీ దర్యాప్తు చేసి, sisw (సీమెన్స్ ఇండస్ట్రియల్ సాఫ్ట్ వేర్ లిమిటెడ్ ఏదైతే ఉందో.. దాని పేరుతో ఎవరైతే తమకు లేఖ రాశారని ఈ ప్రభుత్వం చెబుతుందో…అతను రాసిన దానిలోనే sisw రూ.1289,45, 31,753లు విలువైన పరికరాలు.. సాఫ్ట్ వేర్ ను పలానా ఇన్ వాయిస్ ద్వారా రూ.35 కోట్లకు అందించామని చాలా స్పష్టంగా పేర్కొన్నాడు. క్లియర్ గా తమ లేఖలో సీమెన్స్ సంస్థే రూ.1289కోట్ల విలువైన సాఫ్ట్ వేర్ ను ఏపీ ప్రభుత్వానికి రూ.35కోట్లకే అందించా మని. మొత్తం స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో సీమెన్స్ ఒప్పందమనేది కేవలం ఒక కాంపోనెంట్ మాత్రమే.

2014 ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టోలోని హామిని త్వరగా అమల్లోకి తీసుకురావడం కోసం స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ తక్షణమే ఏర్పాటయ్యేలా చూడాలని చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలు తప్పెలా అవుతాయి?
తెలుగుదేశం పార్టీ 2014లో తన మేనిఫెస్టోలో ప్రకటించిన ఉద్యోగమిత్ర అనే పథకానికి సంబంధించి, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రప్రభుత్వం అమలుచేసిన స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ విధానంలోనే తమ ప్రభుత్వానికి కూడా ఒక విధానం అమలు చేయాలని కోరడం జరిగింది. ప్రాజెక్ట్ ను త్వరితగతిన ఏర్పాటు చేయడానికి నాటి ముఖ్యమంత్రి వెంటనే జరిగేలా చూడండి అంటే.. దాన్ని తప్పు పడతారా? ము ఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్న 8 నెలలకు స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ రాష్ట్రంలో ఏర్పాటైతే.. 18 నెలలకు ప్రభుత్వం వద్ద నుంచి డబ్బులు రిలిజ్ అయ్యాయి. అయినా నాటి ప్రభుత్వం హడావిడిగా చేసిందని.. వాళ్లపై గన్నుపెట్టింది..వీళ్లపై కత్తి పెట్టిందని ఎలా ప్రచారం చేస్తారు?

స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు ప్రక్రియ కేబినెట్ అప్రూవల్ పొందకపోతే.. దానికి ముఖ్యమంత్రి బాధ్యుడు అవుతారా…అధికారులా?
కేబినెట్ అప్రూవల్ పొందలేదు అంటున్నారు…దానిలో తప్పెవరిది. నాటి ప్రభుత్వంలో పనిచేసిన అధికారిణి నీలంసహాని ద్వారా వెళ్లిన నోట్ ఫైల్లో ఏముంది? ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ఏర్పాటు అలస్యమైంది.. ముందు జీవో ఇవ్వండి.. తర్వా త ప్రపోజల్ పెట్టండి అని. అదే ఫైల్ తర్వాత ప్రేమచంద్రారెడ్డికి.. అజయ్ కల్లంరెడ్డికి కూడా వెళ్లింది. వారు ఆ ఫైల్ ను కేబినెట్ అప్రూవల్ కు పంపకపోతే.. దానికి నాటి ముఖ్యమంత్రి బాధ్యుడు అవుతాడా? అదే నిజమైతే నోట్ ఫైల్ పై తమ అభిప్రాయాలు రాసిన ముగ్గురు ఐ.ఏ.ఎస్ అధికారులపై జగన్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలే దు? వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు….విచారించలేదు?

మొత్తం వ్యవహారమంతా చీకట్లో జరిగిందని ఎలా చెబుతారు?
ముఖ్యమంత్రికి, కేబినెట్ కు సీమెన్స్.. డిజైన్ టెక్ సంస్థలు పూర్తి ప్రజంటేషన్ ఇచ్చాకే.. మొత్తం అవుట్ లే కు రూ.3,300కోట్లకు నాటి కేబినెట్ అనుమతి పొందడం జరిగింది. ఈ విషయం కూడా నోట్ ఫైల్ లో చాలా క్లియర్ గా ఉంది.

ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు 13 సంతకాలు పెట్టారు అంటున్నారు..
చంద్రబాబు.. ఈ గంటలో.. ఇప్పుడే డబ్బు రిలీజ్ చేయమని సంతకాలు పెట్టారా? ఫార్మేషన్ ఆఫ్ ssdc (స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్) ఏర్పాటు చేయమని ఒక సారి సంతకం పెట్టారు. దానికి సంబంధించిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్.. ఇతర కమిటీల ఏర్పాటును ఆమోదిస్తూ మరోసంతకం పెట్టారు. తరువాత దాన్ని అప్రూవ్ చేస్తూ మరో సంతకం.. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ను అప్రూవ్ చేస్తూ మరో సంతకం పెట్టారు. ఆ బోర్డ్ కు చైర్మన్ జీ.ఎం.ఆర్ గ్రూప్ ఛైర్మన్ గ్రంథి మల్లిఖార్జునరావు… మరో వ్యక్తి శ్రీని రాజు కీలక సభ్యులుగా వ్యవహరించారు. నిజంగా డబ్బులు కొట్టేయాలని చంద్రబాబుకు ఉంటే బయటివాళ్లను ఎందుకు పెడతారు?

బడ్జెట్ అప్రూవల్ చేస్తూ.. సుబ్బారావుని స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా అపాయింట్ చేస్తూ మరోసంతకం పెట్టారు. కేబినెట్ కౌన్సిల్ రిజల్యూషన్ పై మరోసారి సంతకం పెట్టారు. అపర్ణ అనే ఆమె అపాయింట్ మెంట్ కు సంబంధించిన ఫైల్ ర్యాటింగ్ నోటిఫికేషన్ కోసం ముఖ్యమంత్రి వద్దకు వెళ్లినప్పుడు మరోసంతకం పెట్టారు? అకడమిక్ సెంటర్లకు.. క్లస్టర్ల ఏర్పాటుకు సంబంధించి సంతకాలు పెట్టారు. అవన్నీ రొటీన్ గా.. ప్రాసెస్ ప్రకారమే జరిగేవి. వాటిని ఎలా తప్పుపడతారు?

ఇదే విషయం న్యాయస్థానాల్లో చెబితే సంతకాలు ఎలా పెట్టాలో చెప్పండి అంటూ జగన్ ప్రభుత్వాన్నే నిలదీస్తుంది. C.I.T.D వాల్యుయేషన్ కు సంబంధించి తానే స్వయంగా నిర్ణయం తీసుకున్నానని ప్రేమ చంద్రారెడ్డే స్వయంగా గతంలో ఈడీ విచారణలో చెప్పారు. కేంద్రప్రభుత్వ సంస్థ C.I.T.D కూడా చంద్రబాబు కోసం ఆయన చెప్పినట్టే పనిచేసిందన్నట్టు మాట్లాడితే ఎలా?

ఐ.ఏ.ఎస్ అధికారి సునీత స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ పై ఏంచెప్పింది.. ఈ ప్రభుత్వం ఏం మాట్లాడుతోంది?
సునీతకు స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించిన ఫైల్ పై అవగాహనే లేదని చెప్పాలి. 13-11-2015 న ఆమెవద్దకు స్కిల్ డెవలప్ మెంట్ కార్పొ రేషన్ ఫైల్ వెళితే, ఆమె ఫైల్ చదవకుండానే.. రూ.370కోట్లు ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ ద్వారా వెళ్లలేదని, తమ అనుమతి పొందలేదని రాసింది. ఆమె తన అభిప్రాయం చెప్పాక ఆమె కింద ఉండే వారు ఎవరో అమ్మా.. ఇది ఎప్పుడో మనశాఖ అనుమతి పొందింది. దానికి సంబంధించి ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ ఒక హెడ్ ను నియమించిందని చెప్పాక కింద మరలా చిన్న అక్షరాలతో ‘seen the old file’ అని రాసింది. అదీ ఆమె అవగాహన.

బడ్జెట్ అప్రూవల్ అయిన ఫైల్ లోని అంశాలను తిరగదోడే అధికారం ఐ.ఏ.ఎస్ అధికారికి ఉంటుందా? స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు సంబం ధించి.. పరిశీలనకు గుజరాత్ వెళ్లిన ఏపీ బృందంలో సునీత కూడా ఉన్నారు. గుజరా త్ వెళ్లొచ్చాక అక్కడ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ బ్రహ్మండంగా పనిచేస్తోంది అని అభిప్రాయపడింది. రెండు ప్రతిష్టాత్మకమైన సంస్థలైన సీమెన్స్.. డిజైన్ టెక్ లు గుజరాత్ లో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ను ఎలా అమలుచేశాయో… వాస్తవాలతో వివరిస్తూ.. పీ.వీ.రమేశ్ అద్భుతంగా ఫైల్ లో వివరణ ఇచ్చారు.

ఏపీ ప్రభుత్వం ఇక్కడరెండు వాయిదాల్లో సీమెన్స్ సంస్థకు డబ్బులు ఇస్తోందని.. కానీ గుజరాత్ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వం ఒకేసారి నిధులు విడుదలచేశాయని కూడా చెప్పారు. ఆ విధంగా సునీతకు వచ్చిన అనుమానాలను ఆమె పై అధికారిగా ఉన్న పీ.వీ.రమేశ్ పూర్తిగా నివృతి చేశారు. మొత్తం జరిగిన వ్వవహారం ఇదీ. ఇంత స్పష్టంగా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం ప్రక్రియ అంతా ఎంతో పారదర్శకంగా జరిగింది. ఈ వాస్తవాలు కోర్టులు గ్రహిస్తే ఈ ప్రభుత్వం ముఖాన ఉమ్మేయడం ఖాయం.” అని కేశవ్ తేల్చిచెప్పా రు.

Leave a Reply