రాష్ట్రంలో పారిశ్రామిక మహా విప్లవం

-తిరుపతిలో 8 భారీ ప్రాజక్టులు ప్రారంభించనున్న సీఎం జగన్
-జోకర్ గా మారిన 40 ఇయర్స్ ఇండస్ట్రీ బాబు
-బాబు చేనులో మేస్తే అయ్యన్న గట్టున మేయడుగా
-ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయి రెడ్డి

రాష్ట్రంలో పారిశ్రామిక మహా విప్లవం ప్రారంభమయ్యిందని ఈ నెల 23న ఒకేసారి రూ.3,644.32 కోట్ల విలువగల ఎనిమిది భారీ ప్రాజెక్టులకు సీఎం జగన్ తిరుపతి వేదికగా శ్రీకారం చుట్టనున్నారని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ట్విట్టర్ వేదికగా పలు అంశాలు వెల్లడించారు. తిరుపతి సమీపంలోని ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేసిన 5 ఎలక్ట్రానిక్ కంపెనీల ఉత్పత్తుల్ని ప్రారంభించడంతో పాటు అదనంగా రెండు ఎలక్ట్రానిక్ కంపెనీలు, ఒక పాదరక్షల తయారీ కంపెనీ నిర్మాణ పనులకు భూమి పూజ చేయనున్నారని తెలిపారు. టీసీఎల్, డిక్సన్, ఫాక్స్ లింక్, సన్నీ, కార్బన్ కంపెనీలు ప్రారంభం కానున్నాయని, అపాచీ పాదరక్షల తయారీ యూనిట్, ఫాక్స్ లింక్ విస్తరణ, డిక్సన్ టెలివిజన్ సెట్స్ కంపెనీలకు శంకుస్థాపన జరగనుందని పేర్కొన్నారు. 20.139 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు.

క్రీస్తు పూర్వమే అరిస్టాటిల్, ఆ తర్వాత అనేక మంది శాస్త్రవేత్తలు భూమి గుండ్రంగా ఉందని శాస్త్రీయంగా నిరూపించిన విషయం తెలిసిందే. అయితే భూమి బల్లపరుపుగా ఉందంటూ టీడీపీ మూర్ఖులు వాదిస్తుంటారని, ఆ పార్టీ నేత చంద్రం ఇంకా అప్ డేట్ కాలేదని ‘నేనుంటే కరోనా వచ్చేదా తమ్ముళ్లూ… అంటూ జనానికి హాస్యం పంచుతున్నాడని అన్నారు. అమరావతిని ఏసీ చేస్తా, సముద్రాన్ని కంట్రోల్ చేస్తానంటూ కామెడీ డైలాగ్స్ తో ఈ 40 ఇయర్స్ ఇండస్ట్రీ ప్రజల దృష్టిలో చివరికి జోకర్ గా మిగిలాడని పేర్కొన్నారు.

ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేయదని, దూడ కూడా చేనులోనే మేస్తుందని అన్నారు. తేదేపా చంద్రబాబు ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని కబ్జా చేసాడని, నదిని కబ్జా చేసి అక్రమ నివాసం కట్టుకున్నాడని, పోరంబోకు భూమిని కబ్జా చేసి మంగళగిరిలో టీడీపీ కార్యాలయం నిర్మించుకున్నారని నాయకుడి దారిలో ఇప్పుడు దూత అయ్యన్న పాత్రుడు పంట కాలువ కబ్జా చేసి ఇల్లు నిర్మించాడని అన్నారు. ఆవు దూడల కబ్జాల పర్వం ఇలా కొనసాగుతోందని అన్నారు.

Leave a Reply