నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు

చీకటి పాలనలో అణచివేతకు గురి అవుతున్న ప్రజలకు వెలుగు దివ్వెలా నిలిచిన నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు. దేశంలోనే మొట్ట మొదటి సారిగా కార్యకర్తలకు సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన నాయకుడు నారా లోకేష్. యువగళం పాదయాత్రతో యువతలో ఛైతన్యం తెచ్చారు. ప్రజా బాంధవుడిగా నిలిచారు. పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రత్యర్ధులు సృష్టించిన అవరోధాలను సమర్ధవంతంగా తిప్పికొట్టారు. 226 రోజుల్లో యువగళం 3,132 కి.మీ.లు నడిచారు. సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలను ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిసి సాధక బాధకాలు తెలుసుకున్నారు. రాష్ట్రంలోని యువత భవితకు నారాలోకేశ్ మార్గదర్శిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాం.

Leave a Reply