Suryaa.co.in

Andhra Pradesh

నవరత్నాల పేరుతో నకిలీ రత్నాలు

– బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ

గుంటూరు : బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ మలి విడత బిజెపి విజయ సంకల్పయాత్ర.. మొదటిరోజు ఎస్విఎన్ కాలనీలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి యాత్ర ప్రారంభించి తారకరామ నగర్, ఉద్యోగ నగర్, మీదుగా గుజ్జనగండ్ల వరకు సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిదులుగా బిజెపి రాష్ట్ర మీడియా ఇంచార్జ్ పాతూరి నాగభూషణం బిజెపి జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్ బిజెపి ఇంటలెక్చువల్ సెల్ రాష్ట్ర కోకన్వీనర్ టీవీ రావు విచ్చేశారు.

ఈసందర్భంగా వల్లూరు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ… గుంటూరు నగరంలో ఎక్కడ చూసినా సమస్యలే స్వాగతం పలుకు తున్నాయని వల్లూరు జయప్రకాష్ నారాయణ అన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు సరిగా సద్వినియోగం చేయని కారణంగా డ్రైనేజివ్యవస్త అస్తవ్యస్థంగా ఉందని ఆరోపించారు. రోడ్లు, మంచినీరు వంటి మౌళిక వసతులు కూడా కల్పించలేదని విమర్శించారు. నగరంలో రోడ్లన్నీ గోతుల మయంగా మారాయని, చెత్త పన్ను వేస్తూ కనీసం చెత్తను కూడా తొలగించడం లేదని అన్నారు. నవరత్నాల పేరుతో నకిలీ రత్నాలు ఇచ్చారని ఆఖరికి మన ప్రజాప్రతినిధి నకిలీ ప్రజాప్రతినిదులుగా మారిపోయారని ఎద్దేవా చేశారు.

బిజెపి రాష్ట్ర మీడియా ఇన్ఛార్జి పాతూరి నాగభూషణం మాట్లాడుతూ… కేంద్రప్రభుత్వ పథకాలకు పేరుమార్చి అమలు చేయటం తప్ప వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదని పాతూరి నాగభూషణం విమర్శించారు. నరేంద్రమోదీ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో గుంటూరులో బిజెపి నేత వల్లూరు జయప్రకాష్ చేపట్టిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వని కారణంగా రూ.40వేల కోట్లు కేంద్ర నిధులు ఆగిపోయాయని తెలిపారు. ఇది జగన్ ప్రభుత్వ వైఫల్యంగా అభివర్ణించారు.

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్రకుమార్, టీవీ రావు, ఈదర శ్రీనివాసరెడ్డి, మాగంటి సుధాకర్ యాదవ్, భీమినేని చంద్రశేఖర్, పాలపాటి రవికుమార్, మండల అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ మండల ప్రధాన కార్యదర్శి నరసింహారావు మహిళామోర్చా అధ్యక్షురాలు నాగమల్లేశ్వరి యాదవ్ వాణి వెంకట్, తాడువాయి రామకృష్ణ, అప్పిశెట్టి రంగారావు, అంకరాజు నరసింహమూర్తి, బోలగాని సాంబయ్య, స్టాలిన్, బజరంగ్ రామకృష్ణ, జితేంద్ర గుప్తా, సాంబమూర్తి, దేసు సత్యనారాయణ, నేరెడ్ల ప్రకాశరావు, జయకృష్ణ, రాష్ట్ర మీడియా కో కన్వీనర్ వెలగలేటి గంగాధర్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

LEAVE A RESPONSE