హైకోర్టు మార్గంలో వీధిదీపాల ఏర్పాటు, రహదారుల నిర్మాణం, భద్రత చర్యలు చేపట్టేలా పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి, సిఆర్డీఏ కమిషనర్, గుంటూరు కలెక్టర్, ఎస్పీలను ఆదేశించాలంటూ.. ఏపీ హైకోర్టు ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టు మార్గంలో వీధిదీపాల ఏర్పాటు, రహదారుల నిర్మాణం, భద్రత చర్యలు చేపట్టేలా పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి, సిఆర్డీఏ కమిషనర్, గుంటూరు కలెక్టర్, ఎస్పీలను ఆదేశించాలంటూ.. ఏపీ హైకోర్టు ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. విద్యుత్తు దీపాలు లేకపోవడంతో హైకోర్టు నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు రహదారులపై ప్రమాదాల బారిన పడుతున్నారన్నారని ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఏ.వేణుగోపాలరావు పేర్కోన్నారు. విజయవాడ, మంగళగిరి, గుంటూరు నుంచి హైకోర్టుకు చేరుకునే మార్గాలను అధికారులు సక్రమంగా నిర్వహించడం లేదని.. దీని కారణంగా హైకోర్టుకు సుదూర ప్రాంతాల నుంచి రావాల్సి వస్తోందని తెలిపారు. రోడ్లు ప్రమాదకరంగా ఉన్నాయని పశువులు దారిని దాటేటప్పుడు హైకోర్టు సీజే కాన్వాయ్ గతంలో ప్రమాదానికి గురైందని గుర్తు చేశారు. ఉద్యోగులు సురక్షితంగా హైకోర్టుకు వచ్చి వెళ్లేందుకు సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఉద్యోగుల ఇబ్బందులను వివరిస్తూ వినతులు ఇచ్చినా ఇప్పటివరకూ స్పందన లేదని వాజ్యంలో వివరించారు.