Suryaa.co.in

Andhra Pradesh

ఏపిలో భారీ నుండి అతి భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. ఇక, రానున్న 24 గంటల్లో అల్పపీడనం ప్రభావంతో కోస్తా ఆంధ్రా, తెలంగాణలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్‌ హెచ్చరికల కేంద్రం పేర్కొంది.

ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు, అల్లూరి సీతారామరాజులలో అతి భారీ వర్షాలు నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు.. మిగతా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఈ సమయంలో తీరం వెంబడి గంటకి 40 నుండి 55 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించారు.

రానున్న ఐదు రోజులు వర్షాల ప్రభావం కొనసాగుతుందని పేర్కొన్నారు.. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉంది.. కావును.. ఈ సమయంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.. లోతట్టు ప్రాంతాల్లో అదే విధంగా కొండ ప్రక్కన నివాసం ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద.

మరోవైపు.. ఎగువ రాష్ట్రాల్లో భారీవర్షాల వల్ల గోదావరి వరద ఉధృతి పెరుగుతుంది.. ముందస్తుగా ప్రభావిత జిల్లాల యంత్రాంగం అప్రమత్తం కావాలని సూచించారు ఏపీ విపత్తుల సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్.. ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షిస్తున్నట్టు తెలిపిన ఆయన.. ముందస్తు సహాయక యక చర్యలకు అల్లూరికు ఎన్డీఆర్ఎఫ్, ఏలూరుకు రెండు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పంపించామని.. విపత్తుల నిర్వహణ సంస్థలో స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.

అత్యవసర సహాయం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 1070, 18004250101గా ప్రకటించారు.. జిల్లాల్లో మండలస్థాయిలో కూడా అధికారులు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు.. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించడం చేయరాదని.. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని సూచించారు.. ఏపీ విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్.

LEAVE A RESPONSE