దానం నాగేందర్‌ కు హైకోర్టు నోటీసులు

– ఎన్నికను రద్దు చేయాలంటూ భారాస నేత విజయారెడ్డి పిటిషన్‌

హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయన ఎన్నికను రద్దు చేయాలంటూ భారాస నేత విజయారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫున సుంకర నరేశ్‌ వాదనలు వినిపించారు. ఎన్నికల్లో ఓటర్లను దానం నాగేందర్‌ ప్రలోభపెట్టారని కోర్టుకు ఆయన తెలిపారు. డబ్బులు పంచడంతో పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఆయన సతీమణి పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలను నామినేషన్‌ పత్రాల్లో పేర్కొనలేదన్నారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 18కి వాయిదా వేసింది.

Leave a Reply