జె-గ్యాంగ్ ధనదాహంతో ఒకతరం నాశనమైపోయింది

100రోజుల్లో డ్రగ్స్, గంజాయి ముఠాలపై ఉక్కుపాదం!
మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత లోకేష్

మంగళగిరి: విశాఖతీరంలో దేశంలోనే తొలిసారిగా 25వేల కిలోల డ్రగ్స్ పట్టుబడ్డాయన్న వార్తతో యావత్ భారతదేశం నివ్వెరపోయింది, జగన్ అండ్ కో ధనదాహంతో ఒకతరం నాశనమయ్యే పరిస్థితులు నెలకొన్నాయని యువనేత నారా లోకేష్ ఆందోళన వ్యక్తంచేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం డోలాస్ నగర్ రచ్చబండ సభలో యువనేత లోకేష్ మాట్లాడుతూ…

రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోనే డ్రగ్స్, గంజాయి మాఫియాలు చెలరేగిపోతున్నాయి, విశాఖ,తూర్పుగోదావరి ఏజన్సీలో ఎమ్మెల్సీ అనంతబాబు నేతృత్వంలోనే గంజాయి మాఫియా రాష్ట్రంతోపాటు దేశంలోని ప్రధాన నగరాలకు గంజాయిని సరఫరా చేస్తోంది. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఎపిలోనే ఉండటం ఇందుకు నిదర్శనం.

యువగళం పాదయాత్ర సందర్భంగా చంద్రగిరి లో ఓ తల్లి నన్ను కలిసింది, వైసిపినాయకులు తన బిడ్డను గంజాయికి బానిసగా మార్చి శారీరకంగా వాడుకున్నారని కన్నీరుమున్నీరైంది. తనబిడ్డను గంజాయి నుంచి బయటకి తేవడానికి సహాయం అందించాలని, లేకపోతే ఆమెను తన చేతులతోనే చంపేస్తానని ఆ తల్లి చెప్పింది, లేకపోతే తన ఇద్దరు బిడ్డలు కూడా గంజాయికి బానిసలుగా మారి తన దక్కరని ఆ తల్లి చెప్పిన మాటలు విని నేను తీవ్ర మనోవేదన చెంధాను. ఆ తల్లికి వచ్చిన కష్టం రాష్ట్రంలో మరెవరూ రాకూడదని ఆనాడే నిర్ణయించుకున్నానని లోకేష్ పేర్కొన్నారు.

Leave a Reply