శివాలయంలో ప్రదక్షిణ ఏ విధంగా చేయాలి?

శివాలయంలో చేసే ప్రదక్షిణ అన్ని దేవాలయాలలో చేసే ప్రదక్షిణ కి భిన్నంగా ఉంటుంది ఏ గుడిలోకి వెళ్ళిన సర్వసాధారణంగా ప్రదక్షణలు చేస్తారు. కానీ శివాలయానికి ఓ ప్రత్యేకత ఉంది .

ఇతర దేవాలయాలలో చేసిన విధంగా ఈశ్వరుని దేవాలయంలో ప్రదక్షణ చేయకూడదు శివాలయంలో ఏ విధంగా ప్రదక్షణ చేయాలో లింగపురాణంలో స్పష్టంగా వివరించింది.

శివాలయంలో చేసే ప్రదక్షిణ చండి ప్రదక్షిణ లేదా సోమసూత్ర ప్రదక్షిణ మని అంటారు. ఈ చండి ప్రదక్షిణ చేయడం వలన ఎలాంటి ఫలితాలు పొందవచ్చు పురాణాల్లో వివరంగా పేర్కొన్నారు. లింగపురాణంలో శివాలయంలో చేయవలసిన ప్రదక్షిణ గురించి ఈ విధంగా చెబుతుంది.శివాలయంలో ధ్వజస్తంభం వద్ద ప్రదక్షణ ప్రారంభించి ధ్వజ స్తంభం నుండి చండీశ్వరుని వరకు ప్రదక్షణచేసి చండీశ్వరుని దర్శించుకొని అక్కడ నుండి మళ్ళీ వెనక్కి తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి ఒక్క క్షణం ఆగి మరలా ప్రదక్షణ మొదలుపెట్టి సోమసూత్రం అభిషేక జలం బయటకు పోవు దారి వరకు వెళ్లి తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు రావాలి అలా వస్తే ఒక ప్రదక్షిణ పూర్తి అవుతుంది.

వెనుదిరిగి నందీశ్వరుని చేరుకుంటే ఒక శివ ప్రదక్షిణ పూర్తి చేసినట్లు ఈ విధం చేసే ప్రదక్షిణ చండి ప్రదక్షిణ లేదా సోమసూత్ర ప్రదక్షిణమని అని పేరు శివ ప్రదక్షిణలో సోమసూత్రాన్ని దాటరాదు ఎందుకంటే ఆయనకు అభిషేకం చేసిన జలము సోమసూత్రం నుండి పోతుంది అంతేకాక అక్కడ ప్రమదగణాలు కొలువై ఉంటారు.

ఈ విధంగా చేసే ఇలా చేసే ప్రదక్షిణం సాధారణ ప్రదక్షణాలు కంటే పదివేల ప్రదక్షణాలుతో సమానమని లింగా పురాణంలో పేర్కొనబడింది. ఇలా మూడు ప్రదక్షణాలు చేయాలి అయితే నంది శివునికి మధ్యలో నడవకూడదు ఎందుకంటే సదా ఆయన చూపులు శివుని మీదే ఉంటాయి అలాగే చాలామంది ఏ దేవాలయంలో అయినా తెలియక చేసే పొరపాటు గర్భ గుడి వెనుక భాగాన్ని తాకి నమస్కారం చేస్తారు అలా చేయకూడదు.

మరో విషయం ఏమిటంటే విగ్రహానికి ఎదురుగా నిలబడి ఏ దేవుడు లేదా ఏ దేవత దర్శనం చేయకూడదు ఎందుకంటే విగ్రహం నుండి వెలువడే శక్తి తరంగాలు నేరుగా మన మీద పడతాయి వాటిని వాటి శక్తి మనం భరించలేం కనుక ప్రక్కన నిలబడి దర్శనం చేసుకోవాలి.

Leave a Reply