– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
అమ్మనే గెంటేసినవాడికి అంగన్వాడీల విలువ ఏం తెలుస్తుంది? పాదయాత్రలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోమని శాంతియుత నిరసనలు తెలపడం కూడా నేరమేనా? అంగన్వాడీ ఉద్యమంపై సైకో సర్కార్ ఉక్కుపాదం మోపడం దారుణం. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం, సమ్మె కాలానికి వేతనంలో కోత పెట్టడం.. జగన్ నియంత పోకడలకు పరాకాష్ట.
అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ వైకాపా ప్రభుత్వం తెచ్చిన జిఓ నెంబర్ 2 తక్షణమే ఉపసంహరించుకోవాలి. అంగన్వాడీల ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది. జగన్ అహంకారానికి… అంగన్వాడీల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఉద్యమంలో అంతిమ విజయం అంగన్వాడీలదే.