ఇంటెగ్రేషన్ డే అంటే ఎంటో నాకు తెలియదు

-అమరులైన వారి సంగతేంటి?
-కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
-ఈ నెల 17 న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా విమోచనా దినోత్సవ ఉత్సవాలు నిర్వహిస్తాం..

ఇందులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారు.. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బోమ్మై, మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ లకు అహ్వానిం చాలని నిర్ణయించారు. అజాది కా అమృత్ మహోత్సవాల వలే విమోచనా ఉత్సవాలను ఏడాదీ పాటు కేంద్ర ప్రభుత్వం నిర్వహించాలని నిర్ణయించారు.

1947 ఆగస్ట్ 15 వరకు బ్రిటిష్ వారికి సామంత రాజు గా ఉన్నా నిజాం రాజు ఆ తర్వాత భారత్ లో విలీనం అవ్వను అన్నారు.గతంలో ఉన్న కర్ణాటకలో 3 , మహారాష్ట్రలో 5, తెలంగాణ లో ఉన్న 8 జిల్లాలు హైదరాబాద్ సంస్థానం లో ఉండే. ఇంటెగ్రేషన్ డే అంటే ఎంటో నాకు తెలియదు. అమరులైన వారి సంగతేంటి? 75 ఏళ్లు కావస్తుంది కాబట్టి ఇప్పుడు నిర్వహిస్తున్నాం తప్ప రాజకీయాల కోసం కాదు. సిఎం ను లిఖిత పూర్వకంగా ఉత్తరం రాసి ఆహ్వానించాం. ఇది మూడు రాష్ట్రాలకు పరిపాలనకు సంబంధించిన అంశం కాబట్టి, మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకావాలి.హైదరాబాద్ కేంద్రంగా పరిపాలన జరిగిందీ కాబట్టి ముందుగా ఇక్కడి నుంచి ప్రారంభించాం.

సాంస్కృతిక కార్యక్రమాలు, పరేడ్ వంటివి ఉంటాయి. అప్పుడు లేని మతం ఇప్పుడు గుర్తు వచ్చిందా? పరకాలకు నేనే వెళ్తా. అక్కడా జరిగిన అత్యకాండకు వ్యతిరేకంగా ఆ రోజు పాల్గొంటాం. బ్రిటిష్ వారు స్వతంత్య్రం ఇస్తు.. సంస్థానాలు ఇష్టముంటే విడిగా ఉండొచ్చు లేదా భారత్ పాక్ లో ఎక్కడైనా విలీనం చేసుకోవచ్చు అన్నారు.జమ్మూ కాశ్మీర్ కు జవహర్ లాల్ నెహ్రూ 370 ఆర్టికల్ పెడుతూ.. బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని జమ్ము కాశ్మీర్ లో అమలు చేయలేదు.

నిజాం దౌర్జన్యాలకు చరమ గీతం పాడాలని ప్రజలు అనేక ఉద్యమాలు చేశారు. ఉద్యమాలు చేసిన గ్రామాలను టార్గెట్ చేస్తూ.. అత్యాచారాలు, దోపిడీలు మానభంగాలు చేస్తూ.. నిజాం సైన్యం అరాచకాలు చేశారు.గ్రామాల్లో మహిళలను వివస్రగా చేసి బతుకమ్మా ఆడించారు.దీంతో అవమానం తట్టుకోలేక అనేక మంది మహిళలు సామూహికంగా ఆత్మ హత్యలు చేసుకున్నారు.గ్రామాన్ని రక్షించుకోవడానికి ప్రజలు గ్రామాలకు బురుజులు నిర్మించుకున్నారు. తమ ఆడవాళ్ళ ప్రాణాలు రక్షించుకునేందుకు అనేక ఉద్యమాలు కొమురం భీం, చాకలి ఐలమ్మ వంటి వారు ప్రజల పక్షాన నిలబడి ఉద్యమాలు చేశారు. మాన ప్రాణాలకు లెక్క లేకుండా ఉండేది.

Mim పార్టీకి మూలం ఖాషిం రజ్వీ. ట్రైబల్ ఏరియా లో అనేక నిర్బంధాలు పెట్టినా పరిస్థితి ఉండేది. వీటన్నింటినీ అనాటి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నిశితంగా పరిశీలించి నిజాం అరాచకాలు సహించేది లేదని, హైదరాబాద్ పైన దండ యాత్ర చేసారు.. అనేక రకాల ఆయుధాలతో సెప్టెంబరు 13 న 1948 లో ఈ సంస్థానం ను ముట్టడించారు.సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు భారత్, హైదరాబాద్ మధ్య మినీ వార్ జరిగింది. ఇందులో ఇద్దరికి సంబంధించిన సైనికులు అసువులు బసరుదీంతో నిజాం లొంగిపోయారు.ఆ రోజు నుంచి ఈరోజు వరకు.. సెప్టెంబరు 17 ను స్వతంత్ర్య, విమోచనా ఉత్సవాలను నిర్వహించుకోలేదు. మజ్లిస్ ప్రభావం లేని మహారాష్ట్ర, కర్నాటక కాంగ్రెస్ ఇప్పటికే కార్యక్రమం నిర్వహిస్తోంది.

ముక్తి సంగ్రామ్ దీవస్ పేరుతో మహరాష్ట్ర లో కాంగ్రెస్ నిర్వహించింది. హైదరాబాద్ విమోచనా దినోత్సవ పేరుతో ఉత్సవాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించింది. కానీ సంస్థానానికి గుండె కాయ వంటి హైదరాబాద్ లో ఇన్నేళ్ళు నిర్వహించలేదు. మన గడ్డపై జెండా ఎప్పుడు ఎగిరింది అనేది చాలా మందికి తెలియదు. దీనికి సంబంధించి ఎక్కడ పాఠ్యాంశాలలో కూడా చేర్చలేదు. హైదరాబాద్ సంస్థానం విముక్తి పొంది అమృత్ మహోత్సవంలో అడుగు పెట్టబోతున్నాం. భారత ప్రధాని ఈ ఉత్సవాలు జరపాలని నిర్ణయించారు.

అమరులకు ఆత్మకు శాంతి కలిగే ప్రోగ్రాం కేంద్ర ప్రభుత్వం తరపున సెప్టెంబరు 17 న జరగబోతుంది. ఇది ఒక అత్యంత చరితాత్మకమైన కార్యక్రమం. రజాకారులు గా ఉన్న min ఏ పార్టీ అధికారంలో ఉన్న వాళ్లను చెప్పు చేతుల్లో పెట్టుకొని శాసించింది కాబట్టే, ఈ చరిత్ర ప్రజలకు తెలియకుండా తొక్కి పెట్టారు… బుజ్జగింపు, ఓటు రాజకీయాలకు ఆనాడే లేపారు. 14 ఆగస్ట్ నాడు పాకిస్తాన్ స్వతంత్య్ర దినోత్సవం నాడు హిందువులను ఊచకోత కోశారు. మజ్లిస్ కు ఒంగి ఒంగి సలాం కొట్టీ జీ హుజూర్ అంటూ గత ప్రభుత్వాలు పని చేసాయి.

ఇంత అనాగరికమైన చర్య ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. మేము గతంలో వీటినీ నిర్వహించామని అసెంబ్లీ వేదికగా అడిగిన వాళ్ల మిత్రపక్షం బాధపడతాది నిర్వహించాలేమని తెలిపారు.ప్రభుత్వం తరపున నిర్వహించే మొట్ట మొదటి సెప్టెంబర్ కార్యక్రమం అవ్వబోతుంది.నాటి హోంమంత్రి 1948 సెప్టెంబరు 17 సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణ గడ్డ మీద జాతీయ జెండా ఎగురవేశారు..74 ఏళ్ల తర్వాత ఈ సెప్టెంబర్ 17 న ఈనాటి హోంశాఖ మంత్రి ఈ గడ్డపై మళ్ళీ అదే రోజు జాతీయ జెండా ఎగవేయనున్నరు.

ప్రజలందరూ స్వచందంగ ఈ కార్యక్రమంలో పాల్గొనాలి.మీరు కట్టుకున్న బురుజులకు సున్నాలు వేసి జాతీయ జెండా ఎగురవేయలని విజ్ఞప్తి చేస్తున్నా.బురుజులు సున్నం వేసి జాతీయ జెండా ఎగురవేయాలి. ప్రపంచ చరిత్రలోనే హర్ ఘార్ తిరాంగ్ కార్యక్రమం లో ఇన్ని కోట్ల మంది పాల్గొన్నది లేదు.. ప్రజలు రాజకీయాలకు, సిద్ధాంతాలకు అతీతంగా హార్ ఘర్ తీరంగ్ వలే సెప్టెంబరు 17 ను నిర్వహించాలి.ఈ కార్యక్రమం ఏడాది పాటు నిర్వహించాలి స్వాతంత్య్రం కోసం బలి ఆయిన అందరిని సన్మానించుకుని వారి ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్దాం.

Leave a Reply