మంగళగిరి ప్రజలు గర్వపడేలా అభివృద్ధి చేసి చూపిస్తా!

-దక్షిణ భారతంలో అతిపెద్ద గోల్డ్ క్లస్టర్ ఏర్పాటుచేస్తాం
-ఇక్కడే అందుబాటులో ఉంటా… ఒక్క మెసేజ్ తో స్పందిస్తా!
-బ్రేక్ ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమంలో యువనేత నారా లోకేష్

మంగళగిరి: తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక మంగళగిరి ప్రజలంతా గర్వపడేలా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపుతానని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులోని మిడ్ వాలీ సిటీ, మంజీరా అపార్ట్ మెంట్ వాసులతో బ్రేక్ ఫాస్ట్ విత్ లోకేష్ అనే వినూత్న కార్యక్రమం ద్వారా యువనేత లోకేష్ సోమవారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాక నేను ఉండవల్లిలో అందుబాటులో ఉంటా, ఎవరికి ఏ సమస్య వచ్చినా ఒక్క మెసేజ్ తో స్పందిస్తానని చెప్పారు.

మంగళగిరిలో పెద్దసంఖ్యలో ఉన్న స్వర్ణకారులు ఉన్నారు. ప్రజాప్రభుత్వం వచ్చాక దక్షిణభారత దేశంలోనే అతిపెద్ద గోల్డ్ క్లస్టర్ ను ఇక్కడ ఏర్పాటుచేస్తాం. దీనివల్ల వేలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మంగళగిరిని రిక్రియేషన్ సెంటర్ గా మార్చేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. మంగళగిరిని ఐటీ హబ్ గా మారుస్తాం. గన్నవరం విమానాశ్రయాన్ని విస్తరిస్తాం. అంతర్జాతీయ సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తాం. గతంలో స్వల్ప మెజార్టీతో నేను ఓడిపోయాను.

ఎన్నికల తర్వాత పెమ్మసాని చంద్రశేఖర్, నేను డబుల్ ఇంజిన్ తరహాలో వేగవంతంగా అభివృద్ధి చేస్తాం. నియోజకవర్గంలో ప్రధాన నీటి సమస్య ఉంది. టీడీపీ హయాంలో తాగునీటి కోసం పైప్ లైన్ నిర్మాణ పనులు ప్రారంభిస్తే వైసీపీ వచ్చిన తర్వాత నిలిపివేశారు. రెండు నెలలు ఓపిక పట్టండి.. ఏడాదిలో మంగళగిరి పరిధిలోని అన్ని ప్రాంతాలకు కృష్ణానది నుంచి తాగునీటి సౌకర్యం కల్పిస్తాం. మంజీరా అపార్ట్ మెంటు పక్కన ఉన్న వాగుకు లైనింగ్ ఏర్పాటుచేసి ఇక్కడ ఉన్న ప్రజల సమస్యను పరిష్కరిస్తాం. గతంలో స్వల్ప మెజార్టీతో నేను ఓడిపోయాను. ఎన్నికల తర్వాత పెమ్మసాని చంద్రశేఖర్, నేను డబుల్ ఇంజిన్ తరహాలో వేగవంతంగా అభివృద్ధి చేస్తాం.

అసమర్థ ఎమ్మెల్యే వల్లే అభివృద్ధి శూన్యం
సమర్థుడైన శాసనసభ్యుడి లేకపోవడంతో రాష్ట్రం నడిబొడ్డున ఉన్నా గత పదేళ్లుగా మంగళగిరి ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కే రూ.2వేల కోట్లతో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి గాలికొదిలేశారు. టీడీపీ ప్రభుత్వం ఖర్చుచేసిన నిధుల్లో 10 శాతం కూడా ఖర్చుపెట్టలేదు. కృష్ణానది పక్కనే ఉన్నా నియోజకవర్గ ప్రజలకు కనీసం తాగునీరు అందించలేకపోయారు.

టీడీపీ హయాంలో మంగళగిరికి ఐటీ పరిశ్రమలు తీసుకువచ్చాం. ఏపీఐఐసీ ద్వారా వివిధ పరిశ్రమలకు భూములు కూడా కేటాయించడం జరిగింది. ఆ పనులను ముందుకు తీసుకెళ్లలేదు. నేను మంగళగిరిలో ఓడిపోయినప్పటికీ నాలుగేళ్ల పది నెలల నుంచి ఈ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నా. సొంత నిధులతో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టా. మంగళగిరిలో చేనేత వృత్తిని నమ్ముకున్న వారి కోసం పలు కార్యక్రమాలు చేపట్టాం. స్వర్ణకారుల కోసం కూడా వివిధ కార్యక్రమాలు రూపకల్పన చేశాం.

లోకేష్ మంగళగిరి అభ్యర్థి కావడం అదృష్టం
గుంటూరు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ… నేను అమెరికా వెళ్లి 24 సంవత్సరాలు అయింది. ఇటీవల కాలంలో దేశంలో జరుగుతున్న అభివృద్ధిని చూస్తుంటే తర్వలోనే అమెరికాను మించిపోయేలా ఉంది. ఇక్కడ మిడ్ వాలీ సిటీ లాంటి అపార్ట్ మెంట్ లు చూస్తున్నప్పుడు ప్రజల జీవన ప్రమాణాలు ఏవిధంగా పెరిగాయో అర్థమవుతోంది. 2019లో టీడీపీ ప్రభుత్వం వచ్చి ఉంటే ఈ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారిపోయి ఉండేవి. రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి.

వచ్చే 10 ఏళ్లు మంగళగిరి అభివృద్ధి పథంతో దూసుకెళ్తుంది. లోకేష్ పోటీచేస్తుండటం ఇక్కడి ప్రజల అదృష్టం. లోకేష్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి. ఇందుకు ప్రతి ఒక్కరు కృషిచేయాలి. ఇప్పటికే గెలుపు ఖాయమైంది. రాబోయే 20ఏళ్లు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఎన్ఆర్ఐలు కూడా తిరిగి వచ్చే పరిస్థితి వస్తుంది. నన్ను, లోకేష్ ను మంగళగిరి ప్రజలు ఆశీర్వదించాలని చంద్రశేఖర్ కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త చిల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Leave a Reply