Suryaa.co.in

Telangana

నీ ఆంధ్రా అల్లుడి భాగోతం మొత్తం నిరూపిస్తా

– నీ అల్లుడు పోలీసు రిక్రూట్మెంట్లు ఎలా చేస్తున్నాడు ?
– 24 ఎకరాల భూమిని ఒక నెల రోజుల కింద నీ బినామీ పేరు మీద కొనలేదా ?
– కడియం శ్రీహరికి జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కౌంటర్

జనగామ: మా పార్టీ కండువా మీద, కేసీఆర్ పేరు మీద గెలిచి, పదవులు పైసల కోసం వేరే పార్టీకి పోయిన నువ్వు మా నీతి, నిజాయితీల గురించి మాట్లాడుతావా ? చీము, నెత్తురు ఉంటే నిరూపించమని అడిగినవ్ కదా, నీ అండ దండలతో అక్రమాలకు పాల్పడుతున్న నీ ఆంధ్రా అల్లుడి భాగోతం మొత్తం నిరూపిస్తాము.

దేవునూరులో అటవీ భూముల పక్కన 24 ఎకరాల భూమిని ఒక నెల రోజుల కింద నీ బినామీ పేరు మీద కొనలేదా ? ఆ భూమికి రోడ్డు వేసుకోవడానికి, పక్కన భూమి వాళ్లను బెదిరించావా లేదా ?
నీ అధికార అహంకారం, నీ బిడ్డ ఎంపీ పదవిని అడ్డం పెట్టుకోని, నీ ఆంధ్రా అల్లుడు పోలీసు రిక్రూట్మెంట్లు ఎలా చేస్తున్నాడు, రెవెన్యూ అధికారులను గుప్పెట్లో పెట్టుకోని నీ కుటుంబం చేస్తున్న దౌర్జన్యాలను మొత్తం ప్రజల ముందు పెడతాం

LEAVE A RESPONSE