Suryaa.co.in

Andhra Pradesh

పైలెట్ బ్యాగ్ కొట్టేసిన జగన్ ఫ్యాన్స్

– హెలికాప్టర్ రెక్కను వంకరలు తిప్పారు
– భయపడి ..రోడ్డు మార్గాన బెంగుళూరుకు జగన్

చూసి రమ్మంటే చుట్టుకొని పోయినట్టు” తయారైంది జగన్ అభిమానుల వ్యవహారం! హెలికాప్టర్ అద్దాలు తొలగించి, మెరుపు వేగంతో పైలట్ బ్యాగును కూడా “మా నాయకుడి కానుక” అనుకుని క్షణాల్లో మాయం చేశారు! అంతే కాదు, తమ అభిమాన నేత వాహనం కదా అని, హెలికాప్టర్ రెక్కను అందుకొని వంకరలు తిప్పారు! “మా హీరో మామూలోడు కాదు… మేమూ తక్కువేం కాదు!” అని గట్టిగా చాటి చెప్పారు! దీనితో భయపడిన జగన్.. ఆ హెలికాప్టర్లో ప్రయాణించటం అంత సేఫ్ కాదని, రోడ్డు మార్గాన బెంగుళూరు వెళ్లిపోయారు.

ఇది లేటేస్టుగా.. జగన్ రాప్తాడు నియోజకవర్గంలో ఓదార్పు జరుపుతున్న వేళ, ఆయన ఎక్కి వచ్చిన హెలికాప్టర్‌పై అభిమానుల ఆవేశపు దృశ్యం.

ఆ మధ్య పులివెందులలో కూడా ఇదే సీను రిపీటైంది గుర్తుందా? అక్కడ కూడా బిల్లులు ఇవ్వలేదని అభిమానులు ఆగ్రహంతో ఇంటి అద్దాలు పగలకొట్టారు అని కవర్ చేశారు.

LEAVE A RESPONSE