Home » తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు ఒక తండ్రైతే..భువనేశ్వరి ఒక తల్లి లాంటిది

తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు ఒక తండ్రైతే..భువనేశ్వరి ఒక తల్లి లాంటిది

– టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ
తెలుగుదేశం పార్టీకి చంద్రబాబునాయుడు ఒక తండ్రైతే.. భువనేశ్వరి గారు ఒక తల్లి లాంటిదని, అలాంటి ఆమెను కించపరచి మాట్లాడటం మహా పాపమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు. శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడిన మాటలు మీ కోసం.. . భువనేశ్వరి ఒక గ్రేట్ ఇండస్ర్టియలిస్ట్. దక్షిణ భారతదేశంలోనే ఆమెకు సాటి ఎవరూ లేరు.
వేలాది మందికి ఉపాధి కల్పించిన మహనీయురాలు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి భార్య సుధామూర్తిగారు అప్పుడప్పుడు ముందుకొచ్చి మాట్లాడారుగానీ ఏనాడూ భువనేశ్వరి బయటికి రాలేదు. ఈ ప్రభుత్వం కరోనా సమయంలో ప్రజల్ని ఆదుకోవడంలో విఫలమైంది. ఆ సమయంలో ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ప్రజల్ని ఆదుకున్నారు. ఇంట్లో జరుగుబాటు లేని వారికి ఇంట్లో సరుకులనందించారు. వ్యాక్సినేషన్ వేయించుకోలేనివారికి వ్యాక్సినేషన్ వేయించారు. ఆసుపత్రికెళ్లి డబ్బులు ఖర్చు పెట్టుకోలేనివారికి కన్న తల్లిలా ఆదుకున్న మహా సాధ్వి. ఆమెను కించపరిచే విధంగా అసెంబ్లీలో వైసీపీ నాయకులు మాట్లాడారు.
అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్, కొడాలి నాని లు మాట్లాడుతుంటే జగన్ చూస్తుండిపోయారే తప్ప కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. జగన్ భార్య భారతి సాక్షి ఛైర్మన్ గా ఉండి ఎన్నో తప్పుడు రాతలు రాయిస్తే.. మా నాయకులు చంద్రబాబు, లోకేశ్ లు నిబంధనలకు అనుగుణంగా పరువు నష్టం దావా వేశారే తప్ప ఏనాడు భారతిని ఒక్క మాట అనలేదు. ఇక్కడోమాట, అక్కడో మాట మాట్లాడే షర్మిల తన గురించి కొందరు అసభ్యకరంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని తన భర్తతో ప్రెస్ మీట్ పెడితే ఆరోజు చంద్రబాబు, లోకేశ్ కరెక్టు కాదు, ఎవరెన్ని పెళ్లిళ్లు చేసుకుంటే మనకెందుకు? ఇది మీరు కూడా ఖండించండి ఒకరి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. మీరు కూడా షర్మిల మాటలను ఖండించండి అని మాకు సలహా ఇచ్చారు.
నేడు రోజా మంత్రి పదవి కోసం ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. విజయలక్ష్మి, భారతి, షర్మిలని ఏనాడు మేము ఒక్క మాట అనలేదు. ఇంత తంతు జరుగుతున్నా షర్మిల తెలంగాణలో తిరుగుతోంది, వీళ్లిక్కడున్నారు. మాపై ఒక్కరు మద్దతుగా మాట్లాడలేదు. కుటుంబ విషయాలు మాకెందుకు అని మేం హుందాగా ఉన్నాం. మరి వారేమో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. మేం వారి వ్యక్తి గత విషయాల్లో తలదూర్చలేదు. భువనేశ్వరిని కించపరిచేలా మాట్లాడినందుకు వారి భార్యలు ఇంటికెళ్లే వారిని చెప్పులతో కొడతారు. ఎన్టీఆర్ బిడ్డపై ఇలాంటి అసభ్యకరమైన భాష మాట్లాడారు. 14 సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తి భార్యపై మాట్లాడారంటే వారి దిగజారుడుతనం తెలుస్తోంది.
మంత్రి పదవి కావాలంటో డబ్బులిచ్చి కొనుక్కోవాలిగానీ దిగజారుడు మాటలు మాట్లాడకూడదు. ఈ విధంగా మాట్లాడాలా? రోజాని సినీ ప్రముఖులు, ప్రొడ్యూసర్లు ఎంత అసభ్యంగా మాట్లాడారో అందరూ చూశారు. అయినా ఆమెకు బుద్ధి రాలేదు. వీటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. కబడ్డీ ఆడటం తప్ప, రోజా దేనికి పనికిరాదని తేలిపోయింది. రూ.8వేలకోట్ల డ్వాక్రాసొమ్ముని మీనాయకుడుకొట్టేస్తుంటే ఆపేదమ్ములేదు మీకు?
చంద్రబాబునాయుడు తీసుకొచ్చిన ఫోర్త్ లయన్ యాప్ ను దిశాయాప్ లా మార్చి డబ్బాకొట్టుకుంటున్నారు. రోజా నోరుసంభాళించుకోవాలి…జీవితమంటే జబర్తస్త్ కాదని తెలుసుకోవాలి. మోదీ భార్యని ఏదో అన్నామని ప్రచారంచేస్తూ, ఒకఅబద్ధాన్ని వందసార్లుచెప్పి నిజం చేయాలనుకుంటున్నావా?
కరోనాసమయంలో బయటికెళ్లవద్దని ఆడవాళ్లు వారించారు. కానీ భువనేశ్వరి తనభర్త, బిడ్డా ప్రజలకోసం తిరుగుతుంటే, ఆమే టెన్షన్ పడ్డారుతప్ప, ఏనాడూ వారిని వారించలేదు. జగన్మోహన్ రెడ్డి తనతప్పు తెలుసుకొని, భువనేశ్వరి గారికి క్షమాపణచెప్పి తీరాల్సిందే టీడీపీ మహిళానేతల్ని దారుణంగా తనపార్టీ వారు ట్రోల్ చేసినప్పుడు కూడా జగన్ స్పందించలేదు. జగన్మోహన్ రెడ్డికి ఆడపిల్లలున్నారుగా.. భార్యఉందిగా. వారిలానే అందరూ అని తెలియదా? వర్షాలు, వరదలకు రైతులు హలోలక్ష్మణా అని ఏడుస్తుంటే, వారిని పట్టించుకోకుండా, చంద్రబాబునాయుడి ముఖం చూడాలనే శాడిజం ఏమిటి? ఒక మహామనిషికి దండం పెట్టాల్సిందిపోయి ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సబబా? వైసీపీ నాయకులు శాడిస్టుల్లా వ్యవహరిస్తున్నారు. భువనేశ్వరి గారికి క్షమాపణ చెప్పాల్సిందిగా టీడీపీ తరపున డిమాండ్ చేస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ విలేఖరుల సమావేశంలో వివరించారు.

Leave a Reply