Suryaa.co.in

Telangana

నీళ్లు ఇస్తే నేను దుంకుత.. లేదంటే హెలికాప్టర్ నుంచి దుంకుతవా?

– గురుదక్షిణ చెల్లిస్తూ తెలంగాణ నీటి హక్కులకు రేవంత్ మరణ శాసనం
– ఇంత చిల్లరగా, ఇంత చిచోరగా ఉన్నావు
– 10లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తే నేను దుంకుత, లేదంటే హెలికాప్టర్ నుంచి దుంకుతవా.
– అడ్ హక్ కు, ఫైనల్ అవార్డుకు తేడా తెలియని అజ్ఞాని రేవంత్
– అధికారిక ప్రజెంటేషన్ అయితే ఎందుకు అందరు ఎమ్మెల్యేలను పిలవలేదు?
– అది హైదరాబాద్ లో ఇచ్చినట్లు లేదు..అమరావతిలో ఇచ్చినట్లు ఉంది
– పీపీటీ తెలంగాణ ప్రభుత్వం తయారు చేసిందా? లేక ఏపీ తయారు చేసిందా ?
– హృదయం ఇంకా తెలుగుదేశంలోనే ఉంది
– ఎమ్మెల్సీ నీ సొంత జిల్లాలో గెలిచినం
– తెలంగాణ భవన్ వేదిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తం కుమార్ రెడ్డిపై నిప్పులు జరిగిన మాజీ మంత్రి హరీష్ రావు
– సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలను ఆధారాలతో సహా ఎండగట్టిన హరీష్ రావు
– ప్రజాభవన్ వేదికగా గోదావరి బనకచర్ల పై రేవంతు చంద్రబాబు మధ్య చీకటి ఒప్పందం జరిగిందంటూ వెల్లడి
– అసెంబ్లీలో తా ఎప్పుడైనా చర్చకు సిద్ధం
– మైక్ కట్ చేయొద్దు, కెమెరా తిప్పొద్దు అని రేవంత్ కు సవాల్ విసిరిన హరీష్ రావు
– 299 కు బిఆర్ఎస్ ఒప్పుకున్నది అని ఎవరైనా అంటే నాలుక చీరేస్తం

హైదరాబాద్: సీఎం బాధ్యతగా మాట్లాడుతాడు అనుకుంటే, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ అన్ని అబద్దాలే మాట్లాడుతున్నడు రేవంత్ రెడ్డి.ప్రతిపక్షంలో అబద్దాలు, అధికారంలో అబద్దాలు మాట్లాడుతున్నడు.

అబద్దాలు, తప్పులు మాట్లాడినప్పుడు పాఠకులకు, ప్రజలకు వార్తలు చేరవేయాల్సిన బాధ్యత మీడియాపై ఉందని వినతి. .రాజకీయాలే కేంద్రంగా బురద జల్లుతున్నారు. క్రాస్ చెక్ చేసి వార్తలు రాయాలని కోరుతున్నా.

అధికారిక ప్రజెంటేషన్ అయితే ఎందుకు అందరు ఎమ్మెల్యేలను పిలవలేదు? అది హైదరాబాద్ లో ఇచ్చినట్లు లేదు, అమరావతిలో ఇచ్చినట్లు ఉంది. పీపీటీ తెలంగాణ ప్రభుత్వం తయారు చేసిందా? లేక ఏపీ తయారు చేసిందా? బనకచర్లను ఆపాలని చిత్తశుద్ది ఉంటే మీరు చంద్రబాబు కేంద్రానికి రాసిన లేఖలు, ఆయన మాట్లాడిన మాటలు గాని చూపాలి.

కాళేశ్వరం, పాలమూరు, డిండి, తుమ్మిళ్ల, భక్తరామ దాసు వంటి అనేక ప్రాజెక్టును చంద్రబాబు అడ్డుకున్నడు. ఎందుకు ఒక్క ముక్క కూడా పీపీటీలో చూపించలేదు? బనకచర్ల కట్టే బాబు బంగారం లెక్క కనిపిస్తే, బిఆర్ఎస్ సచ్చిన పాము లెక్క కనిపిస్తున్నది రేవంత్ రెడ్డికి. నీకు నిద్రలో కూడా గులాబి జెండా కనిపిస్తున్నది.

కేంద్రంలో మీ పార్టీ 11 సంవత్సరాలుగా అధికారానికి దూరంగా ఉంది, అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఒక్క ఎమ్మెల్యే సీటు గెలవలేదు, అంతమాత్రాన కాంగ్రెస్ సచ్చిన పాలు అయ్యిందా? సచ్చిన పాము లాంటి చవకబారు ముచ్చట్లు రాహుల్ కు చెప్పు. ఎమ్మెల్సీ నీ సొంత జిల్లాలో గెలిచినం.
బ్యాగులు మోసి బ్యాడ్ మెన్ గా పేరు తెచ్చుకున్నడు.

బనకచర్ల కోసం బొంకు మెన్ గా మారిండు.టెక్నికల్ గా కాంగ్రెస్ ముఖ్యమంత్రివి కానీ, హృదయం ఇంకా తెలుగుదేశంలోనే ఉంది. స్కూల్ ఏజ్ కాలేజ్ ఏజ్ లో ఉన్న చంద్రబాబుతో నీ అనుబంధం మరిచిపోవడం లేదు. జులై 6, 2024 నాడు ప్రజా భవన్ కు చంద్రబాబును పిలిచి విభజన హామిల ముసుగులో గోదావరి బనకచర్ల మధ్య చీకటి ఒప్పందం జరిగింది.

ప్రజాభవన్ వేదికగా తెలంగాణ నీటి హక్కులకు మరణ శాసనం రాసిండు రేవంత్ రెడ్డి.
Sep 13, 2024 నాడు ఉత్తం కుమార్ రెడ్డి సతీ సమేతంగా విజయవాడలో చంద్రబాబును కలిసి బెజవాడ బజ్జీలు తిని బనకచర్లకు మద్దతు చెప్పి వచ్చిండు. ఈ క్రమంలోనే.. నవంబర్ 15, 2024 నాడు Ap – Gb లింక్ కు సహకరించాలని నిర్మలా సీతారామన్ కు చంద్రబాబు లేఖ
ఆ తర్వాత వెంటనే డిసెంబర్ 31, 2024 నాడు నిర్మలకు మరో లేఖ. 80 వేల కోట్లు ప్రాజెక్టు కోసం ఆర్థిక సాయం అందించాలని కోరిన చంద్రబాబు.
గోదావరి నీళ్ల తరలింపు కుట్రలు జరుగుతుంటే తనకేం తెలియనట్లు మౌనంగా ఉన్నడు, నటించిండు రేవంత్ రెడ్డి? ఈ చీకటి అధ్యాయం బయట పడదు అనుకున్నడు.

మాకు రేవంత్, బాబు కుట్రలు తెలియగానే నిలదీశాం. జనవరి 24, 2025 నాడు మొట్ట మొదట నేను తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి అడిగిన. గడ్డి పీకుతున్నరా అని ప్రశ్నించిన. అప్పుడు నిద్ర లేచి 22 జనవరి తేదీతో రాసినట్లు లేఖ సృష్టించి మీడియాకు విడుదల చేశారు.
జూన్ 14, 2025 నాడు నేను పీపీటీ పెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, అదే రోజు పాత డేట్ వేసి లెటర్ విడుదల చేశారు.

అపెక్స్ కమిటీ మీటింగ్ లో బనక చర్ల అనే పదం ఉందా రేవంత్ రెడ్డి ఎందుకు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నవు? ఒక్క పేరా చదివి ఎజెండా 5లో చెప్పిన అంశాలను ఎందుకు చదవలేదు? వరద జలాల వినియోగంలో రెండు రాష్ట్రాలు ఉపయోగ పడే విధంగా, ఆమోదయోగ్యంగా వాడుకునేందుకు సంప్రదింపులు చేసుకోవాలని ఉంది. అంతే గాని అందులో బనకచర్ల అని ఉందా, నీళ్ళు తరలించుకుపో అని ఉందా? ఎందుకు ఇంత చిల్లరగా మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి?

చంద్రబాబు ముందుకు రాలేదు, జగన్ ముందుకు రాలేదు, అది ముందుకు పడలేదు. ఇప్పుడు ముందుకు ఎలా పోతున్నది? బాబును ప్రజా భవన్ పిలించిండు, ఉత్తం బెజవాడ పోయి బజ్జీలు తిని అమోదం తెలిపిండు. ఎజెండా 5లో తెలంగాణ అనుమతి లేకుండా నీళ్ల డైవర్షన్ కు ఒప్పుకునేది లేదని చెప్పింది కేసీఆర్

నువ్వు రాసిన పీపీటీలోనే బనకచర్ల అనేది లేదు. నువ్వు హెడ్డింగ్ కావాలని 2016 గోదావరి పెన్నా అనుసంధానం అని పెట్టినవు
ఇంత చిల్లరగా, ఇంత చిచోరగా ఉన్నవు. దమ్ముంటే అసెంబ్లీ పెట్టు వాస్తవాలు బట్టబయలు చేస్తం. మైక్ కట్ చేయకు, కెమెరా తిప్పకు.
అపెక్స్ లో గోదావరి పెన్నా గాని, బనకచర్ల అని గాని ఎక్కడా లేదు.

గోదావరిలో వెయ్యి, కృష్ణాలో 500 టీఎంసీలు ఇచ్చి ఏమైనా చేసుకో అన్నడు మొన్న. నువ్వెవడివి తెలంగాణ హక్కులు వదిలి పెట్టడానికి. అంటే నిన్న రేవంత్ రెడ్డి మాట మార్చిండు

వరద జలాల్లోనూ వాటా కావాలని నిన్న అంటున్నడు. 3000 టీఎంసీలు అనేది ఓసారి బ్రహ్మ పదార్థం అంటడు, రాచ పుండు అంటడు రేవంత్ రెడ్డి. ఈ లెక్క చెప్పింది ఎవరు సిడబ్లుసీ చెప్పింది. సముద్రంలో కలిసే జలాలు 58 ఏండ్ల సగటు 3వేల టీఎంసీల దాకా ఉంది. నువ్వు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ తెలంగాణ ద్రోహివే. నీళ్లు ఏపీకి దారాదత్తం చేసి తెలంగాణ ద్రోహిగా మిగిలిపోకు రేవంత్ రెడ్డి.

హక్కుల విషయంలో కేసీఆర్, హరీశ్ రావు సంతకం పెట్టిండు అని చూపిస్తవా? నేను పదవికి రాజీనామా చేస్తా. గోదావరిలో 968 ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయితే, కృష్ణాలో 299:512ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే కదా? 18.10.2013 నాడు ఉమ్మడి ఏపీ జస్టిస్ శ్రీ కృష్ణ కమిటికి రిపోర్టు ఇచ్చింది. ఇదే రిపోర్టును శాసనసభలోనూ పెట్టారు. తెలంగాణకు కృష్ణాలో 299, ఏపీకి 512 ఇచ్చినం అని ఉంటుంది. ఎవరు మరణ శాసనం రాశారు తెలంగాణ నీటి హక్కులకు.

తెలంగాణ నీటి హక్కులు కాపాడంలో మీడియా క్రియాశీలక పాత్ర పోషించాలని చేతులెత్తి మొక్కుతున్నా. అడ్ హక్ కు, ఫైనల్ అవార్డుకు తేడా తెలియని అజ్ఞాని రేవంత్ రెడ్డి. 2015 జున్ 26లో చేసుకున్న అగ్రిమెంట్ తాత్కాలిక ఒప్పందం అని లేఖలో ఉంటుంది. మీ ముద్దుల అడ్వైజర్ ఆదిత్యానాథ్ సంతకం పెట్టిండు. ఆయనే ఇప్పుడు నీ అడ్వైజర్. తెలంగాణ హక్కులకు ఆనాడు వ్యతిరేకంగా మాట్లాడిండు.

తెలంగాణ హక్కులను కాలరాసిన వ్యక్తిని సలహాదారుడిగా పెట్టుకున్నవు. బాబు చెప్పు చేతుల్లో ఉన్నవా? తెలంగాణకు పని చేస్తున్నవా? గురుదక్షిణ చెల్లించాలనే తపనే తప్ప నీకు తెలంగాణ నీటి ప్రయోజనాలు పట్టవు. కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పగించాలని జోషి అంటే, లేదు లేదు అప్పగించాలని చెప్పిన వ్యక్తి ఆదిత్యా నాథ్ దాస్. అలాంటి వ్యక్తిని సలహాదారుడిగా పెట్టుకున్నడు. ఈ తాత్కాలిక ఒప్పందంపై సంతకం ఎవరు పెట్టారు మీ సలహాదారుడు. కానీ రేవంత్ రెడ్డి నేను పెట్టిన, కేసీఆర్ పెట్టిండు అంటడు. 299 కు బిఆర్ఎస్ ఒప్పుకున్నది అని ఎవరైనా అంటే నాలుక చీరేస్తం.

కృష్ణా బేసిన్ లో తెలంగాణ ఏం ప్రాజెక్టులు కట్టలేదు అని రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా మాట్లాడిండు. వాస్తవాలు చెబుతా తలకాయ యాడ పెట్టుకుంటవు రేవంత్ రెడ్డి?కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్, తుమ్మిళ్ల, జూరాల కెనాల్ మోడ్రనైజేషన్, మిషన్ కాకతీయ ద్వారా ఉమ్మడి మహబూబ్ నగర్ లో 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది కేసీఆర్.

పాలమూరు ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇవ్వాలని 28వేల కోట్లు ఖర్చు చేసాం. నాలుగు రిజర్వాయర్లు పూర్తి అయ్యాయి. చంద్రబాబు కాళ్లల్ల కట్టెలు పెట్టిండు, కేసులు వేసిండు.

ప్యాకేజీ 3లో బండ పగలకొడితే నీళ్లు వస్తయి. చంద్రబాబు బంగారం, పని మాత్రం చేయవు, నీళ్ళు ఇవ్వవు. గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు రేవంత్ నీళ్ల గురించి, కేసీఆర్ గురించి మాట్లాడటం. బిఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్లలో 48 లక్షల ఎకరాల 74వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినం.
17లక్షల కొత్త ఆయకట్టు, 31 లక్షల స్థిరీకరణ చేసినం. అది మా కమిట్ మెంట్ . రేవంత్ రెడ్డి నువ్వు ఒక చెరువు నింపినవా, చెక్ డ్యాం కట్టినవా?
ఏడాదిలో ఆరు లక్షల ఎకరాలకు నీళ్ళు అన్నవు అసెంబ్లీలో, రెండో ఏడాది ఆరు అన్నవు. హెలికాప్టర్ నేనే పెడతా పోదామా. 10లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తే నేను దుంకుత, లేదంటే హెలికాప్టర్ నుంచి దుంకుతవా.

కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డిది ఫెవికాల్ బంధం. ఇద్దరి మధ్య లవ్. ఇద్దరు కలిసి తెలంగాణ నీటి ప్రయోజనాలు దెబ్బ తీశారు. ఎస్ఎల్బీసీ భవిష్యత్తు ప్రశ్నార్థకం అయితే ఎందుకు మాట్లాడవు కిషన్ రెడ్డి, ఎందుకు ఎన్డీఎస్ఏకు లేఖ రాయవు? 5000 కోట్ల ప్రాజెక్టు ఆగం అయితే ఎందుకు మాట్లాడవు. కిషన్ రెడ్డి, రేవంత్ మద్య ఉన్న బంధం ఏమిటి?

2023 లో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్, సీతమ్మ సాగర్ కు 25 అనుమతులు వచ్చాయి. ఇందులో హైడ్రాలజీ, పర్యావరణం సహా అన్ని అనుమతులు ఉన్నాయి. అసెంబ్లీలో మాట్లాడుదామా హరీశ్ రావు అన్నడు. రేపు ఉదయం అసెంబ్లీ పెడితే నేను చర్చించేందుకు సిద్దం
కానీ ఒక్క కండీషన్ మైక్ కట్ చేయొద్దు. 15 రోజులు కృష్ణా, 15 రోజులు గోదావరి మీద మొత్తం నెల రోజులు మాట్లాడుదాం. శాసనసభకు సభా నాయకుడివి. ఎమ్మెల్యే ఉత్తరం రాస్తే సభ పెడుతవా? రేపే పెట్టు అసెంబ్లీ, ఎంత సేపైనా మాట్లాడు. అడ్జర్న్ చేయొద్దు, పారిపోవద్దు
మీరు ప్రజెంటేషన్ చేయి, మాకు ప్రెజెంటేషన్ చేసే అవకాశం ఇవ్వు.

మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అంటున్నడు, బనకచర్ల మీద ఉత్తరాలు రాయడం కాదు. చంద్రబాబు కోవర్టులు ఉన్నరు తెలంగాణలో అంటున్నడు. ఆ కోవర్టు ఎవరో అనిరుద్ చెబితే బాగుటుంది. కేసీఆర్ వాటర్ మ్యాన్ అయితే, రేవంత్ రెడ్డి వాటా మ్యాన్. అదృష్టం బాగుండి సీఎం అయ్యావు, ఐదేళ్లు ఉండు. మంచిగ చేయి.

 

LEAVE A RESPONSE