Suryaa.co.in

Andhra Pradesh

కోటను వదిలి జనంలోకి వస్తే ప్రజల సమస్యలు తెలుస్తాయి

-వై.సీ.పీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 8.72 లక్షల రేషన్ కార్డుల తొలగింపు
– టీడీపీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్
వై.సీ.పీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 8.72 లక్షల రేషన్ తొలగించారు. తాడేపల్లి కోటను వదిలి జనంలోకి వస్తే ముఖ్యమంత్రికి ప్రజల సమస్యలు తెలుస్తాయి. పెన్షన్ పెంచుకుంటూ పోతామని ఇప్పటివరకూ పెంచలేదు. పేదలకు అన్నంపెట్టే అన్నక్యాంటీన్లు మూసేయడం దుర్మార్గమైన చర్య. జాతీయ స్దాయిలో నాలుగవ స్దానం నుండి ముఖ్యమంత్రి 22వ స్దానానికి దిగజారారు. సంక్షేమం పేరు చెప్పి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టారు. వేలిముద్రల పడలేదన్న సాకుతో వాలంటీర్లు రేషన్ బియ్యాన్ని దోచుకుంటున్నారు.
మన రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటే రివర్స్ అనే పధంతో మొదలుపెట్టి పిచ్చితుగ్లక్ మాదిరి నిర్ణయాలు తీసుకుంటున్నారు. నవరత్నాలు పాలన తెస్తామని చెప్పి నేడు ప్రజలను సంక్షోభంలోకి నెట్టే పరిస్దితికి తీసుకొచ్చారు. రేషన్ వ్యవస్థను స్వర్గీయ ఎన్.టి.రామరావు తీసుకువస్తే చంద్రబాబు దాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళారు. పోర్టబులీటీ సిస్టం ద్వారా రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా రేషన్ తీసుకోనే విధానాన్ని చంద్రబాబు తీసుకొచ్చారు. రాష్ట్రంలో ఎక్కడున్నా రేషన్ తీసుకునే వెసులు బాటు టీ.డీ.పీ ప్రభుత్వం కల్పిస్తే నేడు కరోనా కష్టకాలంలో రేషన్ కోసం మూడు సార్లు వేలు ముద్రలు వేయలనే నిభందనలతో ప్రజలకు రేషన్ దూరం చేసే పరిస్దితి కల్పించారు.
రాష్ట్రం ఆర్థికంగా అప్పుల్లో కూరుకుపోవడంతో సంక్షేయ పథకాలకు ఎలా కోత పెట్టాలని ఆలోచన చేస్తున్నారు. రకరకాల నిబంధనలతో రేషన్ కార్డులు తొలగిస్తున్నారు. పదివేల జీతమని, కరెంట్ బిల్లు అధికమని, రెండెకకరాల పొలం ఉందన్న రకరకాల కారణాలతో పేదలకు రేషన్ దూరం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత సుమారు 8.72 లక్షల కార్దులు తొలిగించారు. సంక్షేమం ఎంతమేరకు చెపడుతుందో కోతలు చూస్తేనే అర్థమవుతోంది. టీడీపీ హయంలో వేలి ముద్రలు సరిగా పడని వారికి వీ.ఆర్.వో వేలిముద్ర వేసి రేషన్ పంపిణీ జరిగింది. వైసీపీ వచ్చాక దీన్ని వాలంటీర్లకు ఇవ్వడంతో పేదలకు అందే రేషన్ సరుకులు పక్క దారి పడుతున్నాయి. ఉదాహరణకు 2019 సెప్టెంబరులో సూమరు 1.70 లక్షలు, అక్టోబరులో 84 వేలు, నవంబర్ 1 లక్ష కార్డులకు వాలంటీర్లు వేలిముద్రలు వేసి రేషన్ దోచుకున్నారు.
సన్నబియ్యం ఇస్తామని చెప్పి ప్లాస్టిక్ బియ్యం సరాఫరా చేసి ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారు.
గతంలో రేషన్ బియ్యాన్ని డీలర్లు సరాఫరా చేసినప్పుడు పేదవాడు తనకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు తీసుకునే పరిస్దితి వుంది. కాని మొబైల్ డిస్టిబ్యూషన్ వావానాలు వచ్చిన తరువాత ఆ వావానం ఎప్పుడు వస్తుందో తెలియదు. వచ్చినా సర్వర్ పనిచేస్తుందో లేదో తెలియదు. దీని వల్ల చాల మంది రేషన్ తీసుకుకోలేని పరిస్దితి నెలకొంది. టీడీపీ ప్రభుత్వం పెన్షన్లు రూ.200 నుండి రూ.1000కు ఒకేసారి చంద్రబాబు పెంచారు. అనంతరం దాన్ని రూ.2000 పెంచారు. వై.సీ.పీ ప్రభుత్వం పెన్షన్ పెంచుకుంటూపోతామని నేడు మాట తప్పి మడమ తిప్పిన పరిస్దితి ఏర్పడింది.టీ.డీ.పీ హయంలో పేదవాడికి అన్నం పెట్టడానికి తెచ్చిన అన్నా క్యాంటీన్లు అసూయతో, ద్వేషంతో రద్దు చేశారు. సంక్షేమ పథకం ఏ ప్రభుత్వం మెదలు పెట్టినా తరువాత ప్రభుత్వం కొనసాగిస్తుంది.
పక్క రాష్ట్రాలలో కూడా మనం అదే చూశాం. కానీ రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదు. రూల్ ఆఫ్ లా లేదు. జగన్ రెడ్డి రాజ్యంగమే కాని అంబేద్కర్ రాజ్యంగం లేదు. మంత్రులు మాట్లాడే మాటాలు అలానే ఉన్నాయి. మంత్రులు మీద ప్రజా వ్యతిరేకత చాలా ఉంది. ఏ మంత్రినూ ఎన్నికల్లో నెగ్గే పరిస్దితి లేదు. గ్రామ సచివాలయాల్లో ఉన్న ఉద్యోగులు అయోమయంలో ఉన్నారు. వారికి ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే ఎలాంటి సదూపాయలు ఇవ్వకపోయినా వారికి ప్రభుత్వ పథకాలు నిలిపేశారు. గ్రామాల్లో ఉన్న వాలంటీర్లు చేసే ఆరాచకాలు అన్నీ ఇన్నీ కాదు.
వారసత్వ ఆస్తులు రెవెన్యూ రికార్దులో వాళ్ళు పేర్లు లేవని చెప్పి తగవులు పెడుతున్న పరిస్దితి రాష్ట్రంలో ఏర్పడింది. ప్రజలు ఎక్కడ కష్టాల్లో ఉన్నా చంద్రబాబు, లోకేష్ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ముఖ్యమంత్రి తాడేపల్లి కోటను వదిలి బయటకి వస్తే ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారో తెలుస్తుంది. ఒక పక్క రాష్టంలో ప్రజలు కష్టాలు పడుతుంటే జగన్ నీరో చక్రవర్తి మాదిరి తాడేపల్లి ప్యాలెస్ లో రాక్షసానందం పొందుతున్నారు. ఇప్పటికైనా మీ వైఖరి మర్చుకోకపోతే మీరు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని గుర్తుంచుకోవాలి.

LEAVE A RESPONSE