– బీజేపీ ఎంపీ సుజనాచౌదరి
5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారు. ప్రధాని మోడీ సమర్ధ నాయకత్వంపై ప్రజల అచంచల విశ్వాసానికి నిదర్శనం బిజెపి విజయం. 37 ఏళ్ల తరువాత యుపిలో వరుసగా రెండవ సారి ఒక పార్టీ అధికారంలోకి రావడం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ , ప్రధాని మోడీల సమర్థ పాలన ఫలితమే. కుల, వర్గ రాజకీయాలకు పాల్పడిన వారికి ఓటమి తప్పలేదు. భారతీయ జనతా పార్టీ ఘన విజయానికి కారకులైన నేతలు, కార్యకర్తలకు నా అభినందనలు.